జగిత్యాల జిల్లాలో ఆదివారం గ్రామాల్లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంప్ శ్రీ రామాలయం లో జరిగిన కళ్యాణం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ గూగుల్ లోతు రవి,జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ లు సతీ సమేతంగా తలంబ్రాలు ,పట్టు వస్త్రాలు అందజేశారు.

ధర్మపురి లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని శేషప్ప కళావేదికపై శ్రీ రాములవారి కళ్యాణం మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం జరిగింది,. నదీ తీరంలోనీ శ్రీ శ్రీ రామాలయం లో లో వేద మంత్రాల ఘోషలో కళ్యాణం జరిగింది.

ఆలయం నుంచి తలంబ్రాలు ,పట్టు వస్త్రాలు!
ధర్మపురి గోదావరి నది వద్దగల శ్రీ రామాలయం కు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నుంచి. ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరముకూడ అర్చకులకు అందించారు



ముదునూరు గండి హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. ప్రముఖ గుండె. వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి దర్శించుకుని వేలాది మంది భక్తజనంకు అన్నదానం, తాగునీటి వసతి సౌకర్యం కల్పించారు

