శ్రీరామ మహా పట్టాభిషేకం లో పాల్గొన్న గవర్నర్ తమిళ సై

శ్రీరామచంద్రమూర్తి స్వామివారి మహా పట్టాభిషేక మహోత్సవం దిగ్విజయంగా నిర్వహించడం పట్ల రాష్ట్ర గవర్నర్ శ్రీమతి డా తమిలి సై సౌందరరాజన్ హర్షం వ్యక్తం చేశారు. మహపట్టాభిషేకంలో పాల్గొనడానికి విచ్చేసిన గవర్నర్ కు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ స్వర్ణలత భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో పుషగుచ్చం అందించి స్వాగతం పలికారు.

ఇల్లందు విశ్రాంతి భవనానికి చేరుకున్న గవర్నర్ అక్కడి నుండి భద్రాచలం చేరుకుని శ్రీ సీతారామ చంద్రస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు మేళా తలాలతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కళ్యాణ మండపంలో నిర్వహించిన స్వామి వారు మహా పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

కనుల పండుగగా రామయ్య మహా పట్టాభి షేకాన్ని భక్తులు వీక్షించి రామననామాన్ని జపించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ శివాజీ, ఆర్డిఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.