–
సచివాలయం సమీపాన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులను బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి కేటీఆర్ పరిశీలించారు, ఇఎన్సీ గణపతి రెడ్డిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు, పలు సూచనలు, సలహాలిచ్చారు
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ
అంబేడ్కర్ తాను రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది, కేసీఆర్ మహోన్నత ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అని అన్నారు. మహనీయులు అంబేడ్కర్ చూపిన బాటలో కేసీఆర్ నడుస్తూ, వారి ఆశయాల మేరకు ప్రజలందరి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి వల్ల తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం నడుస్తున్నది మంత్రి అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి ,.దళితబంధు, రైతుబంధు పథకాలు మహత్తరమైనవి, ప్రజలందరి సహకారంతో వీటిని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. దాదాపు అన్ని మంచి అంశాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని, నగరం నడిబొడ్డున సచివాలయం సమీపాన పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న భారతరత్న రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోగా ప్రతిష్ఠిస్తామని మంత్రి అన్నారు..మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో గత 8 నెలలుగా విగ్రహ ఏర్పాటు పనులను ప్రతి నిత్యం పర్యవేక్షిస్తున్నారు, రాత్రిబవళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నయ్, ఈ విగ్రహం ప్రపంచంలోని అంబేద్కర్ విగ్రహాలన్నింటిలో అతి పెద్దది. ఇది దేశానికే తలమానికంగా నిలవనున్నది, ఇందులో మ్యూజియం, గ్రంథాలయం, ఫోటో గ్యాలరీ, ధ్యాన మందిరం, మీటింగ్ హాళ్లు, క్యాంటీన్ ఏర్పాటు జరుగుతుంది. మంత్రి వివరించారు.

ఈ ప్రాంగణాన్ని సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతం, పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శించనున్నారు, అంబేద్కర్ ఆశయాలు దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మహనీయుడు కలలుగన్నట్టు తెలంగాణలో అన్ని వర్గాల వారికి మరింత మేలు జరుగుతుందన్నారు.
మంత్రుల వెంట ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సండ్ర వెంకటవీరయ్య, చిరుమర్తి లింగయ్య, కాలే యాదయ్య, దివాకర్ రావు, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, స్థానిక కార్పోరేటర్ విజయా రెడ్డి, బి.సి.కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు మహ్మద్ సలీం, రావుల విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేపట్టాలి
.. మంత్రి కొప్పుల ఈశ్వర్
జిల్లాలో యాసంగి 2021-22 పంటకు సంబంధించి పకడ్బందీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోలు అంశం పై బుధవారం సంబంధిత అధికారులతో ద్వారా మంత్రి రివ్యూ నిర్వహించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులు అనేక సమస్యలను ఎదుర్కున్నారని, కరెంట్ సమస్య, ఎరువుల సమస్య, కల్తీ విత్తనాలు వంటి దుర్భర పరిస్థితులతో చాలా నష్టపోయారని మంత్రి గుర్తు చేశారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వంటి చర్యల వల్ల వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని మంత్రి తెలిపారు.
2014 సంవత్సరంలో మన రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగితే, ప్రస్తుతం 2 సీజన్ లో కలిపి 1.04 కోట్ల ఎకరాల్లో వరి సాగు అవుతోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల విస్తీర్ణం పెరిగి రైతులు బాగు పడుతున్న సమయంలో రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న వరి కోత ల ప్రకారం ఆ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వేసవికాలం దృష్టిలో ఉంచుకుని తగు సౌకర్యాలు , వసతులు కల్పించి వరి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సమావేశంలో పాల్గోన్న జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 208200 ఎకరాలలో వరి సాగు జరిగిందని, 5.4 లక్షల మెట్రిక్ టన్నుల (సన్నం, దొడ్డు) ధాన్యం దిగుబడి అంచనా ఉందని, 1.30 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ చివరినాటికి లక్ష,మే చివరి వరకు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, జూన్ లో 50 వేల దిగుబడి వస్తుందని పేర్కొన్నారు.జిల్లాలో గతఏడాది మాదిరిగానే 252 పీఏసీఎస్, 162 ఐకెపి,7 వ్యవసాయమార్కెట్ యార్డులు మొత్తం 421 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కి అనుమతులు ఉన్నాయని.కలెక్టర్ తెలిపారు.
ధాన్యం నాణ్యత పరిశీలించే అంశంలో జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులకు అవసరమైన అవగాహన కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు.

జిల్లా ఎస్పీ శ్రీమతి సింధూశర్మ, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పెర్సన్ దావా వసంత, అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్. లత, జిల్లా మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటీ వెంకట్రావు, జగిత్యాల, కోరుట్ల ఆర్.డి.ఓ.లు మాధురి, వినోద్ కుమార్, జిల్లా అధికారులు రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.