J.Surender Kumar,
భారతదేశంను ఏ రాజులు పాలించిన, ఆక్రమించి, నిరంకుశ పాలన కొనసాగించిన, అనేక ప్రజాస్వామిక ప్రభుత్వలు అధికారంలో కొనసాగిన, తెలంగాణలో మాత్రం హిందూ ముస్లింల బంధాలు బలంగానే కొనసాగాయి, కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి అనే విశ్వాసం ప్రజల్లో నెలకొని ఉంది అదే తెలంగాణ ఫైల్స్. . సినిమా గాని, డాక్యుమెంటరీ ఫిలిమ్ గా , ప్రముఖ సినీ డైరెక్టర్లు, నిర్మాతలు ఈ బంధాలను వెండి తెరకెక్కించే ప్రయత్నం చేయకపోయినా, వారికి తెలిసినా, తెలియకున్నా , తెలిసి కూడా పట్టించుకోకపోయినా, అనాదిగా హిందూ ముస్లింల మధ్య కొనసాగుతున్న బలమైన బంధాలను , చారిత్రిక విశేషాలు, చిత్రీకరణ చేయకున్న, అనాదిగా తాత ముత్తాతల కాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం చిరస్థాయిగా , చిరంజీవి గానే ఉన్నాయి.
” మతోన్మాద ప్రసంగాలతో, ప్రశాంత వాతావరణం చెడగొడుతున్నారు. మతకలహాలు, రక్తపాతాలు, జరిగితే మంచిదా ? అంటూ ఆయా పార్టీల కు చెందిన కొందరు నేతలు వ్యాఖ్యానించడం, ప్రజా సమూహ వేదికలపై, పాత్రికేయులు సమావేశాలు పెట్టి మరింతగా ప్రశాంత వాతావరణం కోసం తాము పడుతున్న పడరానిపాట్లు చేస్తున్న కృషిని వివరిస్తూ ఊదరగొట్టడం తెలిసింది. కొన్ని సందర్భాలను, ఎన్నికల సమయంలోనూ కొందరు మతోన్మాదులు మరికొన్ని సందర్భాలలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన, చేస్తున్నప్పటికీ, హిందూ ముస్లింలు కలిసి మెలిసి ఆదర్శప్రాయమైన, ఆనందమయమైన జీవనం కొనసాగిస్తున్నారు. వారి మధ్య సంబంధాలు, బంధాలు బలంగానే ఉన్నాయి అనే విషయం ఈ రెచ్చగొట్టే వారికి తెలియదు కాబోలు.
దేశంలో ఏ ప్రాంతంలో, రాష్ట్రంలో, కనిపించని వినిపించని , హిందూ ముస్లిం భాయ్ భాయ్ కి ప్రతీకలైన పురాతన చారిత్రిక ఆనవాళ్లు వాటితో మమేకమై సనాతన సాంప్రదాయ, ఆచార, వ్యవహారాలు తెలంగాణ రాష్ట్రంలో అనాదిగా వందలాది సంవత్సరాలు నుంచి నేటి వరకు ఆచరణలో ఉన్నాయి, ఆ సాంప్రదాయాలను ఆచరిస్తూనే .జీవనం కొనసాగిస్తూనే ఉన్నారు.
హిందువులకు ముస్లింలు , ముస్లింలు లకు హిందువులు పరస్పర సహకారాలు అందిం చుకుంటూ ఉన్నారు. ముస్లిం దర్గా లను, హిందువులు తమ ఇంటి దేవుళ్లుగా తమ మొక్కులు కోరికలు తీర్చే దైవంగా కొలుస్తున్నారు. కొందరు ముస్లింలు తమ కోర్కెలు నెరవేర్చే ఏ దేవుడైనా తమ దైవంగా వారు హిందూ దేవుళ్లను పూజిస్తు, మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న సనాతన ఆచారం సాంప్రదాయంగా తెలంగాణ జిల్లాలు కొనసాగుతున్నది.
అపురూపమైన, అబ్బురపరిచే ఇలాంటి సనాతన సాంప్రదాయాల గురించి ప్రభుత్వం గాని, పర్యటక శాఖ గాని, అధికారికంగా ,గుర్తింపు గాని ,ప్రచారం గాని కల్పించకపోవడం బయటి ప్రపంచానికి హిందూ-ముస్లింల సంబంధాలు బలంగా ఉన్నాయనే విషయం తెలియడం లేదు.

మత సామరస్యానికి ప్రతీక ధర్మపురి.!!
అతి ప్రాచీన పుణ్యక్షేత్రంగా గోదావరి తీరంలో గల ధర్మపురి క్షేత్రం లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ముస్లింల ప్రార్థన మందిరం పక్క పక్కనే అనాదిగా కొనసాగుతున్నాయి. మసీదులో ప్రార్థన సమయంలో ఆలయంలో, గంటలు మోగించడం గాని మైకుల్లో పూజలు భజనలు ప్రసారం నిలిపివేస్తారు. ఊరేగింపులు నిర్వహణ సందర్భంగా ప్రార్థనా స్థలం వద్దకు రాగానే మేళతాళాలు, మంగళ వాయిద్యాల నిలిపివేస్తారు.
రసీదు లేకుంటే మసీదు !!
ఏదేని సందర్భాల్లో భూ వివాదాలు కానీ, అప్పులు చెల్లించకపోవడం, భార్య భర్తల గొడవలు, సందర్భంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించుకోవడం రివాజు. ఈ సందర్భంలో ఏదైనా సాక్ష్యం ఉందా ? లేక రసీదు పత్రం లాంటి ఉందా? .అంటూ పెద్దలు ప్రశ్నించడం ఒకవేళ లేకుంటే మసీదులో కి వెళ్ళి ప్రమాణం చేస్తావా ? అలా చేస్తే నీవు అప్పు లేవని ఒప్పుకుంట, నీవు తిట్టలేదు,. అని ఒప్పుకుంటాను, అంటూ గొడవలు పడిన వారు వాదించుకుంటారు. దీంతో మసీదు పట్ల ఎంతటి భక్తిభావం, భయం ,గౌరవం ,విశ్వాసం, నమ్మకం హిందువులు కలిగి ఉన్నారు అనే విషయం ప్రస్తావనార్హం.

హిందువుల ఇలవేల్పు బిజిగిరి షరీఫ్ దర్గా !!
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధ బిజిగిరిషరీఫ్ దర్గా. ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమునుండి ప్రముఖ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రం అం ఇక్కడ మతస్తులు ఎవరో ? ఆ ప్రస్తుత, ఆధ్యాత్మికత ప్రధానం. మత, వర్గ ,సామాజిక వైషమ్యాలకు, ఇక్కడ చోటు లేదు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు లు, అన్ని మతాల వారు ఈ దర్గాలో ప్రార్థన చేయడంతో పాటు ఉద్యోగాలు, కళ్యాణం, సంతానం, తదితర కోరికల కోసం మొక్కుకొని చిట్టి పై వ్రాసి దర్గా ముందు ఉంచుతారు. ఆది, గురు ,శుక్ర,వారాల్లో భక్తుల సందడి అధికంగా ఉంటుంది. ధర్మపురి లోని ఓ హిందూ కుటుంబానికి బిజిగిరి షరీఫ్ దర్గా ఇలవేల్పు. వారింట ఏ శుభకార్యం జరిగినా, ముందుగా, ఆ దర్గాను దర్శించుకొని వారు మొక్కులు చెల్లించుకుంటారు. వారి పిల్లల పుట్టు వెంట్రుకలను, సైతం ఆ దర్గా వద్ద పూజలు నిర్వహించి సమర్పించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం సాంప్రదాయం.

దస్తగిరి దేవుడు !
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోలి గ్రామ శివారులో చిన్న గుట్టపై దర్గా ఉంది. శతాబ్దాల నుంచి ఆ గ్రామం తో పాటు పరిసర గ్రామ ప్రజలు ఆ దర్గాను దస్తగిరి దేవుడిగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతియేటా అక్కడ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు 99 శాతం హిందువులే ఆ జాతరలో పాల్గొంటారు. ఆ గుట్టపైకి మెట్ల నిర్మాణం కోసం గ్రామస్తులు, భక్తులు కలసి విరాళాలతో రెండు వైపులా కలిపి దాదాపు 400 మెట్లను నిర్మించుకున్నారు.. ఈ దర్గాకు అధికశాతం గ్రామీణ ప్రాంత ప్రజలు, బడుగు ,బలహీన ,ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారు వస్తుంటారు. వారంలో రెండు రోజుల పాటు భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా వారు కొలుస్తుంటారు. సంతానం కోసం ఇక్కడ ముడుపులు కట్టి కొన్ని రోజుల పాటు గుట్టపై భక్తుల నివాసం ఉంటారు. సంతానం కలిగితే ” దస్తగిరి ” అని పేరు పెట్టుకుంటామని మొక్కుకుంటారు. గొల్లపెల్లి మండల పరిసర గ్రామాలతో పాటు చందోలి గ్రామం లోని అత్యధిక. శాతం మంది హిందువులకు “దస్తగిరి ” అనే పేర్లు ఉన్నాయి. మండలం ఇతర ప్రాంతాల్లో కలిపి దాదాపు వంద లాది హిందువులకు దస్తగిరి పేర్లు ఉండి ఉండవచ్చు.

వేములవాడ ఆలయంలో ” దర్గా”
దక్షిణ కాశి క్షేత్రం గా ప్రసిద్ధిగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ముస్లింల ” “దర్గా ” వందలాది సంవత్సరాల నుంచి ఉంది. స్వామివారికి మొక్కులు, కోడె మొక్కులు, చెల్లించుకుననె వారు ఇక్కడి దర్గాను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. దర్గాలోని ముస్లిం,పూజారి ఆశీస్సులు పొందుతారు. జైనులు, బౌద్ధులు, కాలం నుంచి ఇదే తరహాలో నేటికీ ఇదే ఆచారం కొనసాగుతూనే ఉంది. రాజన్న ఆలయంలోకి ప్రవేశించిన ప్రతి భక్తుడు దర్గాను, దర్శించుకుని ఆ పూజారి ఆశీస్సులు పొందడం అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం.

ప్రత్యక్షంగా కళ్ళు కు కనిపిస్తూ, చెవులకు వినిపిస్తున్న ఈ మత సామరస్య ప్రత్యేకత, ప్రత్యక్ష నిదర్శనంగా ఆ గుప్పిస్తున్న . ఇలాంటి తరుణంలో కొంతమంది మతోన్మాదులు రెచ్చగొట్టే. ప్రసంగాలు చేయకుండా, కలిసి మెలిసి హిందూ, ముస్లిం భాయి భాయి అంటూ ప్రశాంత జీవనం కొనసాగిస్తున్న ఈ ప్రాంతాలను పర్యటించి పరిశీలిస్తే ఎవరో ఒక నిర్మాతనొ, దర్శకుడి కో “తెలంగాణ ఫైల్స్” డాక్యుమెంటరీ తీయాలి అని జ్ఞానోదయం కలుగుతుంది కాబోలు.