డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ పోస్టర్ , కరపత్రాన్ని సోమవారం మంత్రి ఈశ్వర్ హైదరాబాదులో తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పులఈశ్వర్ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి,అన్ని రంగాల అభివృద్ధికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారు, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారింది, అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి దిక్సూచిగా తయారైంది, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం రూపాయలు 67వేల787కోట్లు ఖర్చు చేసింది, ఈ ఆర్థిక సంవత్సరంలో 93వేల489కోట్లు ఖర్చు చేయనున్నాం, అందరికి పరిశుద్ధమైన తాగునీళ్లు అందుతున్నాయి అన్నారు.

కోటిన్నర ఎకరాలకు సాగునీళ్లు పుష్కలంగా అందిస్తున్నం
24గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతున్నది, చేపలు, గొర్రెలు,కోళ్ల పెంపకం బాగా పెరిగింది, అందరికి మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి
వెయ్యి గురుకులాల ద్వారా ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తున్నం, అని స్పష్టం చేశారు. ఐటి, ఫార్మా,రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్, ఏరోస్పేస్ రంగాలు మరింత దూసుకుపోతున్నాయి, తలసరి ఆదాయంలో అగ్రభాగాన ఉందని వివరించారు.
జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు,ఎంపిగా, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి గొప్ప సేవలందించారు,ఆ మహనీయుడి జయంతి ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా ప్రజలందరిని మంత్రి కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కమిటీ వర్కింగ్ ఛైర్మన్లు రావుల విజయ్ కుమార్, నాగారం బాబు మాదిగ, వైస్ ఛైర్మన్లు ఏర్పుల యాదయ్య, తూర్పాటి హన్మంతు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ధర్మపురి సెగ్మెంట్లో నిరసనలు!
తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వంద శాతం కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రంపై, తెలంగాణ రైతులపై చూపుతున్న వివక్ష, చేస్తున్న అవమానానికి తెరాస పార్టీ ఆధ్వర్యం లో నిరసనగా చేపట్టిన నిరసన దీక్షలు జరిగాయి.. ఈ కార్యక్రమంలో రైతు బందు సమితి జిల్లా కోఆర్డినేటర్లు, ఎంపిపి, జడ్పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాలలో సెగ్మెంట్లో..
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా తెలంగాణలో రైతాంగం పండించిన వేసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ జగిత్యాల శాసనసభ్యుల డాక్టర్ :సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జెడ్పి చైర్మన్ దావ వసంత సురేష్ గారు,లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్రశేఖర్ గౌడ్ గారు మరియు జగిత్యాల నియోజకవర్గ అర్బన్ రూరల్ మండలంలోని వివిధ హోదాలలో వున్న తెరాస నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి తహసీల్ చౌరస్తా ఆర్డీవో కార్యాలయం వద్ద టీ.ఆర్.ఎస్ పార్టీ నిరసన దీక్ష (ధర్నా) కార్యక్రమం చేపట్టారు..