J.Surender Kumar,
తిరుపతి లో ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు పోటెత్తారు. ఎప్పుడూ చూడనంతగా శ్రీవారి భక్తులు రావడంతో మంగళవారం విపరీతమైన రద్దీ..తొక్కిసలాట జరిగింది. చంటిబిడ్డలతో వచ్చిన తల్లిదండ్రులు, వృద్ధులు అల్లాడి పోయారు. బతుకు జీవుడా..అంటూ వెనక్కి వచ్చేస్తున్నారు. చాలా మంది నీళ్లు.. నీళ్లు అంటూ తల్లడిల్లిపోయారు., టీటీడీ ఘోర వైఫల్యం చెందిందని, తాము మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నామని భక్తులు వాపోయారు. తిండి, నీళ్లు లేక ఉంటున్నామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని తనివితీర చూడాలని చాలా మంది భక్తులు అనుకుంటుంటారు. కరోనా కాలంగా శ్రీవారిని 2 సం.ల నుంచి భక్తులు దర్శించుకోలేదు. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు రావడంతో నిబంధనలు సవరించింది టీటీడీ. దీంతో కొన్ని రోజులుగా భారీగా భక్తులు తరలివస్తున్నారు. వీకెండ్ రోజుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. అయితే సోమవారం కొండ మీదికి భక్తులు అనూహ్యంగా భారీగా తరలివచ్చారు. తిరుపతిలోని అలిపిరి, రెండో సత్రం వద్ద టోకెన్లు తీసుకోవడానికి భక్తులు రెండు, మూడు రోజుల నుంచి వేచి ఉన్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి రద్దీ పెరగడంతో వీరిని కట్టడి చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.కొంతమంది కిందపడిపోయారు. కొందరు భక్తులు సృహ తప్పి పడిపోయారు. క్యూ లైన్ లో సరైన మేనేజ్ మెంట్ లేకపోవడం, స్పష్టంగా అగుపించడం తో మేల్కొన్న టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.

టోకెన్లు అవసరంలేదు.!
టోకెన్లు అవసరం లేదని, నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని ప్రకటించింది., అక్కడున్న భక్తులు శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. ఇదే నిర్ణయం ముందుగా తీసుకుంటే బాగుండేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొండపైకి భక్తులు వెళ్లేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది
కండ్ల పెళ్లి లో హోమం!

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండ్ల పల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 10_00 గంట లనుండి ,నవకుండి గాయత్రీ హోమము వైభవంగా జరిగింది.. శ్రీ శివాజీ రావు, శ్రీ సందీప్ జీ ,దక్షిణ భారత ప్రచార బాధ్యులు. గ్రామ సర్పంచ్ ,ఉప సర్పంచ్, రామ్ రెడ్డి హనుమాన్ దీక్ష స్వాముల ,ఆద్వర్యంలో గాయత్రీ హోమమ్ ఘనంగా జరిగింది.
RRR డైరెక్టర్ SS రాజమౌళి సందడి..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో

రాజమౌళి దంపతులు కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధికారులు, కొమరం భీమ్ కుటుంబ సభ్యులు, మహిళా సమాఖ్య సభ్యులు, ప్రేక్షకులతో కలిసి రాజమౌళి దంపతులు RRR సినిమాను చూశారు. ప్రముఖ డైరెక్టర్ రావడం తో సెల్ఫీలు దిగేందుకు పలువురు యువకులు పోటీపడ్డారు.
