ముగ్గురు బాలులను మింగిన చెరువు !!
ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి తుమేనాల గ్రామం లో ఆదివారం హృదయవిదారక సంఘటన జరిగింది. .ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో ఇరుక్కొని మృతి చెందారు. గ్రామస్తుల కథనం మేరకు యశ్వంత్ (14) , శరత్ (13), మణిదీప్ (13) ,ఉదయం ఈతకు కోసం గ్రామం ఆనుకొని ఉన్న ఊరు చెరువు కు వెళ్లినట్టు వివరించారు. పగలు దాదాపు పదకొండు పన్నెండు గంటల సమయంలో ఓ బాలుడి శిరస్సు చెరువు నీటిపై భాగం తేలి ఉండడంతో అటుగా వెళ్తున్న పాదచారులు చూసి నీటిలో ఎవరిదో మృతదేహం ఉందని చెప్పడంతో గ్రామస్తులు చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మా పిల్లలు అగుపించడం లేదంటూ మరో ఇద్దరు పిల్లల కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకొని విలపించారు. అనుమానంతో గ్రామస్తులు అదే నీటి మడుగు గాలించి మరో రెండు మృతదేహాలు వెలికితీశారు. మృతి చెందిన విద్యార్థుల, తల్లిదండ్రులు ,బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. సీఐ కోటేశ్వర్ ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

సీఎం ఆర్థిక సహాయం !!
జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల్ తుంగూర్ గ్రామానికి చెందిన ముగ్గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి . మొత్తం రూపాయలు 40,500/ ఆర్థిక సహాయం అందిందని సర్పంచ్ శ్రీమతి జితేందర్ యాదవ్ తెలిపారు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎంకు ఆర్థిక సహాయం గురించి చేసిన సిఫార్సు మేరకే వీరికి చెక్కులు జారీ అయ్యాయని సర్పంచ్ వివరించారు. అడేపు రజిత కు రూ”18.000/_ మరియు పూడూరి సత్తవ్వ కు రూ”13.500/_ పాలజి హరిక కు రూ”9.000/_ మొత్తం రూ”40.500/_ ల.చేక్కుల ను ఆదివారం సారంగాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడీసే జీతేందర్ యాదవ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యంపి టిసి అడేపు మల్లీశ్వరి తిరుపతి ,మండల కో ఆప్షన్ సభ్యుడు యండి బీబా, శ్రీ గుట్ట రాజరాజేశ్వరస్వామి ఆలయ, చేర్మేన్ కోల్లూరి ప్రభాకర్ ,ఉపసర్పంచ్ పూడూరి రమేష్, వార్డు సభ్యురాలు,అడేపు సరోజన మల్లేశం పాల్గొన్నారు.