నూతన శ్రీ శుభ కృత నామ సంవత్సరం ఉగాది ఇది పర్వదినం సందర్భంగా బీర్పూర్ మండలం తుంగుర్ గ్రామంలో లో శ్రీ గుట్ట రాజరాజేశ్వరస్వామి. ఉత్సవ మూర్తుల పల్లకి సేవ. ఊరేగింపు నిర్వహించారు. అతి పురాతనమైన ఈ ఆలయంలో పర్వదినాల్లో ఘనంగా పూజలు అభిషేకాలు జరగడం ఆనవాయితీ. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం సాయంత్రం పొంగూరు గ్రామంలో పల్లకి సేవను ఊరేగించారు.

భక్తజనం మంగళ హారతులు ఇచ్చి స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుడిసే శ్రీమతి జితేందర్ యాదవ్, యంపి టిసి అడేపు మల్లీశ్వరి తిరుపతి, రాజరాజేశ్వర స్వామి చైర్మన్ కొల్లూరి ప్రభాకర్, ఉపసర్పంచ్ పూడూరి రమేష్, భక్తులు పాల్గొనరు

ధాన్యం కొనుగోలు చేయాలి !
. మండల కేంద్రమైన బీర్పూర్ లో. శనివారం రైతులు సమావేశమయ్యారు. రైతుల సమస్యలపై చర్చించి , ఆరుగాలం కష్టపడి పండించిన వేసంగి పంట వరి ధాన్యాన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా కొనుగోలు చేయాలని, రైతాంగం డిమాండ్ చేసింది. వరి ధాన్యం కొనుగోలు కోసం రైతాంగం రోడ్డుపై బైఠాయించి ధర్నాలు రాస్తారోకోలు చేసే పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించ వద్దని వారు ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాలా తిరుపతి రెడ్డి , బీర్పూర్ ఎంపిపి మసర్తి రమేష్ , వేముల విక్రమ్ రెడ్డి , కొట్టల మోహన్ రెడ్డి , నోముల గోపాల్ రెడ్డి, కొల నారాయణ, వేముల కర్ణాకర్ రెడ్డి, చంద్రశేఖర్, జలెందర్ , రైతులు, వ్యవసాయ కూలీలు సమావేశంలో పాల్గొన్నారు.,

అంబులెన్స్ సౌకర్యం!
బీర్పూర్ మండలం కొలువై గ్రామంలో గ్రామానికి చెందిన భాస్కర్, ప్రజలకు అంబులెన్స్ వాహన సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. కోల్వాయి గ్రామానికి చెందిన భాస్కర్ అంబులెన్స్ వాహన సర్వీసును శనివారం జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంతసురేష్, ప్రారంభించారు.