తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 6 శాతం నుండి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో దీక్ష చేస్తున్న శిబిరానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం దీక్ష చేస్తున్న వారికి తన సంగిభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనుల జనాభా పెరిగిన ప్రాతిపదికన ఇప్పుడు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్దం, గిరిజనుల రిజర్వేషన్ పెంచడం అనేది రాష్ట్రానికి చెందిన అంశమని, కేంద్రానికి సంబంధం లేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇది జాతియ అంశంగా పేర్కొంటూ గిరిజనుల హక్కులను కాలరాస్తుందని, గిరిజనులను మరోసారి మోసం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో గిరిజనుల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపడం వెనుక కుట్ర దాగుందని, ఎట్టి పరిస్థితిలో గిరిజనుల రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపదని తెలిసికూడా పంపియడం గిరిజనులను మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం దగా చేసిందన్నారు. అసెంబ్లీలో గిరిజన రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలని గిరిజన రిజర్వేషన్ బిల్లుకు అడ్డుపడుతుంది., గిరిజన రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు., గిరిజనుల రిజర్వేషన్ కు సంభందించిన అంశాన్ని నేను శాసన మండలిలో ప్రస్తావించిన తెలంగాణ ప్రభుత్వం నుండి సరియైన సమాధానం లేదు. ఇప్పటికయినా గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతం పెంచి మీ నిజాయితీని నిరూపించుకోండి.లేని పక్షంలో కాంగ్రెస్ పక్షాన రాష్ట్రంలో ఉన్న గిరిజనులను ఏకాకృతం చేసి నేనే ముందువుండి గిరిజనుల హక్కుల కోసం ఉద్యమిస్తామని పట్టభద్రుల MLC జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వివేక్ వెంకటస్వామి పర్యటన !,
చెన్నూరు నియోజకవర్గం లోని జైపూర్ మండలంలో కుందారం గ్రామంలో శుక్రవారం బోరువెల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి. టేకుమట్ల గ్రామం లో జలంపెల్లి సతీష్ కుటుంబని పరామర్శించారు.

అనంతరం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని GM కార్యాలయంలో ముందు సింగరేణి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని చేపట్టిన ధర్నా లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ పలువురు బిజెపి నాయకులు సింగరేణి ఔట్ సోర్సింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ముగింపు
!తుమ్మిడెటి ప్రాణహిత ప్రాజెక్ట్ జలసాధన పాద యాత్ర పాల్వాయి హరీష్ రావు చేపట్టిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ కుమారి. అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు, ఈ నెల 13న జరగబోయే ప్రాణహిత పుష్కరాల సందర్భంగా తుమ్మిడేటీ ప్రాణహిత నది ఒడ్డున హారతి ఇచ్చారు.

మున్నూరు కాపుల దినోత్సవంగా శ్రీరామ నవమి.
మున్నూరు కాపుల దినోత్సవం గా జరుపుకోవాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం సెక్రెటరీ జెనరల్ హరి అశోక్ కుమార్ పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రం లోని పటేoడ్ల వాడలో హరి నరసయ్య పటేల్, పుప్పాల నారాయణ పటెండ్ల స్మారక భవనం సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు., తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గం త్రేతాయుగం,ద్వాపర యుగాల నుంచి తమ కుల పురుషుడు జనక మహారాజు కూతురు తమ ఆడబిడ్డ సీతాదేవి కళ్యాణం రోజును మున్నూరు కాపుల దినోత్సవంగా జరుపుకున్నారనే విషయంలో పౌరాణిక,చారిత్రక ఆధారాలున్నవని అన్నారు., మున్నూరు కాపుల ను బీసీ డి గ్రూప్ నుంచి గ్రూప్ ఏ కు మార్చాలని తమ సంఘం తరపున బీసీ కమిషన్ కు వినతిపత్రం అందజేశామన్నారు., హైదరాబాద్ టాంక్ బoడ్ పై రాణీ రుద్రమదేవి అంగరక్షకు రాలు యుద్ధంలో రుద్రమ ప్రాణాలు కాపాడే ప్రయత్నం లో వీర మరణం పొందిన హాజారి మంగమ్మ ,విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. .మున్నూరు కాపుల కు ప్రత్యేక కార్పొరేషన్ రూ.వెయ్యి కోట్లతో కేటాయించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరు కాపులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని,బంగారు తెలంగాణ లో భాగ స్వాము లవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా మున్నూరు కాపు నాయకులు పుప్పాల గంగాధర్,బండారి నరేందర్, సమిండ్ల శ్రీనివాస్, మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షుడు బండారి విజయ్,ప్రధాన కార్యదర్శి క్యాస రఘునందన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఒడ్నాల జగన్, జిల్లా జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు కూసరి అనిల్ కుమార్,పిట్ట ధర్మరాజు, కూతురు రాజేష్,తోట మల్లికార్జున్,చుక్క నవీన్, కొ లగాని ప్రేమలత,కూతురు శేఖర్,నాయకులు పుప్పాల సత్యనారాయణ, లైసెట్టి వెంకట్,,పుప్పాల కిషోర్ కుమార్,పుప్పాల నర్సింగా రావు,జంగిలి గంగాధర్,గొలుకొండ పవన్,పిట్ట శంకరయ్య,చిట్ల రవీందర్ పాల్గొన్నారు.