టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. సోమవారం జగిత్యాల లో ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. నిరుద్యోగ భృతి, 58 ఏళ్ళకే వృద్దాప్య పింఛను, రైతులకు లక్ష రుణమాఫీ వంటివి నేటికీ ఆచరణలోకి రాకపోవడాన్ని బట్టి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏపాటి చిత్త శుద్ధి ఉందొ అర్థమవుతుందని ఆరోపించారు., ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి మహిళా సంఘం సభ్యులు నెల నెల ఎంత మోత్తo బ్యాంకులో జమ చేస్తారో ప్రభుత్వం కుడా అంతే మొత్త్తాన్ని జమాచేస్తూ అభయహస్తం పేరుతో మహిళలకు 500రూపాయల పింఛన్ ఇచ్చిందని, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దీన్ని నిలిపివేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘం సభ్యులు సమకూర్చిన 600 కోట్ల సొమ్మును అరేళ్లుగా ప్రభుత్వం దగ్గరే ఉంచుకుని లబ్దిదారులకు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఈవిషయమై శాసనమండలిలో తాను ప్రస్థావించానని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శాసనసభలో అభయహస్తం పథకాన్ని రద్దుచేస్తున్నట్టు ప్రకటించి ఏడాది గడిచిన సొమ్మును లబ్దిదారులకు ఇవ్వకపోవడంతో ఇందిరా శోభన్ అనే సామాజిక కార్యకర్త కోర్టును . ఆశ్రయించారు అని అన్నారు. ఇట్టి డబ్బును వాయిదాల ప్రకారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడం విడ్డురంగా ఉందన్నారు., ఆడబిడ్డల సొమ్ము తింటే ,పేరుకు రాకుండా పోతారని వాయిదాల ప్రకారం కాకుండా ఒకేసారి వెంటనే డబ్బులు అందజేయాలన్నారు. రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క కొత్త పింఛన్లు ప్రభుత్వం ఇవ్వడంలేదని, నిరుద్యోగ భృతి ఏమైందని ? జీవన్ రెడ్డి ప్రశ్నించారు. .టెట్ అర్హత పరీక్షకు 6 లక్షల మంది దరఖాస్థులు చేసుకున్నారని వీరందరు నిరుద్యోగులు కాదా ? అని ఆయన ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఎపిలో భాష పండితులకు టెట్ లో 3 వ పేపర్ రూపొందించారని, కాని తెలంగాణలో భాష పండితులకు ప్రత్యేక పేపర్ లేదని, ప్రభుత్వం వీరికి 3 వ పేపర్ రూపొందించాలని సూచించారు., మార్చి నెలాఖరు లోపు రైతులకు 50 వేల రుణమాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో శాసనసభలో ప్రకటించిన అమలుకావడంలేదని, బడ్జెట్ ప్రసంగానికి కుడా ప్రభుత్వం విలువ ఇవ్వడంలేదని అసహనం వ్యక్తం చేశారు.
ఈ నెలాఖరులోనైనా రైతులకు ప్రభుత్వం 50 వేల రుణమాఫీ చేసి ప్రభుత్వం తన విశ్వసనీయతనునిలబెట్టుకోవాలని జీవన్ రెడ్డి సలహా ఇచ్చారు. రెండు సంవత్సరాలు ఇబ్బందులు పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించి ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వలేదని విమర్శిస్తూ తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు., తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విధానంలో స్పష్టత లేదని, నిర్భంద సాగుపేరుతో,వరి వేయద్దనే ప్రభుత్వ ప్రకటనతో యాసంగిలో 15 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయలేదని వివరించారు. రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం లక్ష్యం కాగా క్వింటలకు 300 చొప్పున కేవలం 1500 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని, రైతులకోసం ప్రభుత్వం భరించుకోలేదా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. . ప్రభుత్వం వరి ధాన్యం కొంటామని చెప్పడంతో అన్నీ సౌకర్యాలుండి వరి వేయని రైతులకు ఎకరానికి 10 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సూపర్ ఫైన్ రకం ధాన్యాన్ని , కామన్ రకం ధన్యంలో కలుపుతామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి మాట్లాడడం సరికాదన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళేపెల్లి దుర్గయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్, మాజీ ఎంపిపి ధర రమేష్ బాబు, మాజీ కౌన్సిలర్ పుప్పాల అశోక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బండ శంకర్, బీరం రాజేష్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు


హెల్త్ మేలా !


.ఆజాధికా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక పద్మ నాయక కళ్యాణ మంటపంలో సోమవారం జరిగిన హెల్త్ మేళా కార్యక్రమానికి ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ ,
జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాన రాష్ట్రంలో వైద్య సేవల పరంగా దేశం లో నంబర్ వన్ స్థానంలో ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఅర్, ఎమ్మెల్సీ కవిత , ఎమ్మెల్యే సంజయ్ ల సహకారం తో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.


ఎమ్మేల్యే మాట్లాడుతూ
ఆరోగ్య మేళా ను ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని, ఆధార్ కార్డు ఉపయోగించి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను నమోదు చేసి హెల్త్ ప్రోఫైల్ తయారు చేయడం ద్వారా అందరి ఆరోగ్య వివరాలు అందుబాటులో ఉంటాయని, ప్రభుత్వం వైద్య పరంగా కార్యక్రమాలకు ఇది దోహదపడుతుందని అన్నారు.
వైద్యులు సమయ పాలన పాటించాలని అప్పుడే రోగులు వైద్యులను సంప్రదిస్తారని, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు..ప్రజలు ఇంకా ఆయుర్వేదం, హోమియో, ఇమామి,అలోపతి ఇలా అనేక వైద్య సేవలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.
ప్రజల్లో ప్రభుత్వ వైద్య పరంగా ఇంకా చైతన్యం,నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని, ప్రజలు ఇంకా నాటు వైద్యం వైపు వెళ్తున్నారని వాటిని తగ్గించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో DMHO శ్రీదర్,డిప్యూటీ DMHO జైపాల్ రెడ్డి,శ్రీనివాస్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను పరిశీలించిన
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.,

నిర్మాణ పనుల్లో అలసత్వం పై, అధికారులు, కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పక్షం రోజుల్లో మళ్ళీ పార్కు పరిశీలనకు వస్తానని లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఆదేశించారు. అనంతరం రోడ్డు డివైడర్ పనులను, పరిశీలించిన ఎమ్మేల్యే. మున్సిపల్ అధికారులు, నాయకులు, తదితరులు ఉన్నారు.