జగిత్యాల ఏప్రిల్ 18:- జిల్లాలో శ్రీ వాల్మీకి ఆవాసం- సేవా భారతి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ రవి అభినందించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలిసి ధరూర్ క్యాంప్ లో ఉన్న శ్రీ వాల్మీకి ఆవాసం సేవాభారతి కలెక్టర్ సందర్శించారు.
సేవ హే పరమ ధర్మం అనే నినాదంతో 30 సంవత్సరాలుగా పేద పిల్లలకు, నాణ్యమైన విద్య, భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. సేవాభారతి ఆవరణలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలకు ఏర్పాటు చేశారని, విద్యతో పాటు పిల్లలకు మంచి సంస్కారం క్రమశిక్షణ నేర్పిస్తున్నారు అని కలెక్టర్ అభినందించారు.

విద్యపై ఆరోగ్యంతో ఉన్న పేద విద్యార్థులను సేకరించి వారికి మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడంలో కృషి చేస్తున్నందుకు కలెక్టర్ ప్రశంసించారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అధిక సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వం తో పాటు స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, మంచి సమాజం నిర్మాణం అవుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సేవాభారతి లో ప్రస్తుతం 43 మంది విద్యార్థులు ఉన్నారని వీరికి విద్యతోపాటు మంచి సంస్కారం క్రమశిక్షణ నిర్మిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
సేవా భారతి చేస్తున్న మంచి కార్యక్రమాల పోలీసులు సైతం ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. వేసవికాలంలో విద్యార్థులు ఆహ్లాదకరంగా సమయం గడిపేందుకు వీలుగా ఇండోర్ ఆటవస్తువులను కలెక్టర్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ లత శ్రీ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత తో సేవా తత్వం తో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సేవాభారతి నిర్వాహకులను, సహకరిస్తున్న దాతలను ఆమె ప్రశంసించారు.
అనంతరం సేవ భారతి కార్యదర్శి మాట్లాడుతూ 1992 లో 8 మంది విద్యార్థులతో వాల్మీకి ఆవాసం ప్రారంభించామని, ప్రస్తుతం 43 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వాల్మీకి ఆవాసం లో 30 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య భోజన వసతి సౌకర్యాలు, మంచి క్రమశిక్షణ ,సమయపాలన, పాజిటివ్ యాటిట్యూడ్ పిల్లలకు అందించడం వల్ల, వాల్మీకి ఆవేశం నుంచి డాక్టర్లు , సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వంటి ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన తెలిపారు. కులాలతో సంబంధం లేకుండా విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

వాల్మీకి ఆవాసం సేవా భారతి లో ఉన్న విద్యార్థులకు కలెక్టర్ ఆట వస్తువులు పంపిణీ చేసి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఆవరణలో మొక్కలు నాటారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ , లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట రెడ్డి, జిల్లా అధికారులు వాల్మీకి సేవా భారతి అధ్యక్షులు పురుషోత్తం, సహాయ కార్యదర్శి మల్లారెడ్డి , కోశాధికారి శ్రీనివాసరావు సంబంధిత అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోమవారం జిల్లా కేంద్రంలో స్థానిక iam హాలు లో ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 26 దరఖాస్తులు కలెక్టర్ కు అందించి తమ సమస్యలు బాధలు వారు వివరించారు.

భూ నిర్వాసితులు ఇల్లు మాకే కేటాయించండి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ముంపుకు గురైన బాధితులకు ఇళ్ల స్థలాలు మాకు అధికారికంగా కేటాయించాలని బీర్పూర్ మండలం . కోమన్ పల్లి గ్రామ సర్పంచ్ రమేష్ ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. భూనిర్వాసితులకు ప్రభుత్వం నివాస స్థలాలు కేటాయించగా ,లబ్ధిదారులు వచ్చిన కొంత కాలానికే తిరిగి వారి స్వంత ప్రాంతానికి వెళ్లిపోయారు, ఐతే వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలు అమ్మకానికి అవకాశం లేనందున ,వారు వదిలేసి వెళ్లిపోయారు, అట్టి నివాస స్థలాల్లో గత 30 సంవత్సరాలుగా మా గ్రామ ప్రజలు నివాసాలు ఏర్పరచుకొని నివాసం ఉంటున్నారు, కానీ అట్టి ఇళ్ల స్థలాలకు సంబంధించిన హక్కు పత్రాలు ఎవరికి లేవు. మేము గత ముప్పై సంవత్సరాలుగా ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నాము కాబట్టి మాకు, మేము నివసిస్తున్న ఇళ్ల స్థలాలకు పట్టా ఇవ్వగలరని ప్రజావాణి లో కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.