ఈ నెల 18 వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ గురించి ముఖ్యమంత్రి కేసీఅర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరుగనున్నది.
ఈ సమీక్షా సమావేశంలో.. రాష్ట్ర మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డిపీవోలు, అటవీశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు తదితర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొననున్నారు

సీఎం ఎం పీ ఏ కూతురి వివాహం !
సీఎం కేసీఆర్, ఆంతరంగిక కార్యదర్శి వెంకట నారాయణ చిన్న కూతురు వివాహం నగర శివార్లలోని కొంపల్లి లో శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపత్ని, శోభమ్మ, మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపి సంతోష్ కుమార్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు కారం రవీందర్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా తదితర ప్రముఖులు నూతన వధూవరులకు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

కోరుట్ల మున్సిపాలిటీ కి రాష్ట్రస్థాయి పురస్కారం!
శుక్రవారం TS GENCO AUDITORIUM, యూసుఫ్ గూడా, హైదరాబాద్ లో కోరుట్ల మున్సిపాలిటీ కి పట్టణ ప్రగతి పురస్కారాలు 2021-22 సంవత్సరంకి గాను అవార్డ్ లను ప్రధానం చేశారు.
శానిటేషన్ విభాగం లో కోరుట్ల మున్సిపాలిటీ కి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీ గా ఎంపిక కావడం జరిగినది..అందుకు గాను రాష్ట్ర పురపాలక మంత్రి శ్రీ కె.తారక రామారావు చే, మరియు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ చే కోరుట్ల ఛైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య , మున్సిపల్ కమిషనర్ శ్రీ MD అయాజ్ అవార్డ్ లను అందుకున్నారు.

గోదాం నిర్మాణానికి భూమి పూజ !
జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో 23 లక్షలతో 300 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గారు శుక్రవారం భూమి పూజ చేశారు
ఈ కార్యక్రమంలో AMC ఛైర్మెన్ దామోదర్ రావు, PACS ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, జిల్లా రైతు బందు సమితి సభ్యులు బాలముకుందం, సర్పంచ్ బోల్లే సత్తమ్మ గంగారాం, ఎంపీటీసీ భూమా రెడ్డి,.ఉప సర్పంచ్ లింగా రెడ్డి, రాయికల్ AMC ఛైర్మెన్ రాజీ రెడ్డి, నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ !
మల్యాల మండలం మ్యాడంపల్లి మాజీ సర్పంచ్ ముదుగంటి వెంకట్ రెడ్డి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పరామర్శ లో ఎంపిపి విమల సుదర్శన్, PACS చైర్మెన్ సాగర్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు జనగామ శ్రీనివాస్, మ్యాడంపల్లి సర్పంచ్ రౌతు గంగామహేశ్వరి రవి, చీకట్ల అశోక్, విష్ణు, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.