ఆలయంలో నిర్బంధ వసూళ్లు!

J.Surender Kumar,

నా తండ్రి నా దాత నా ఇష్ట దైవమా!
నన్ను మనన్న సేయు – నరసింహ!
దయవుంచి నామీద – తప్పులన్నీ క్షమించు !
నిగమగోచర నాకు – నీవే దిక్కు “…. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస!… దుష్ట సంహార నరసింహ దురితదూర!
అనే మకుటంతో..
వందలాది సంవత్సరాల క్రితం నుంచి ధర్మపురి శ్రీ
లక్ష్మీనరసింహస్వామి ” శేషప్ప శతకం ” లోని పద్యాల ను
భక్తజనం తమ, తమ, సమస్యలు, కష్టాలు, తీరుతాయని నమ్మకం, విశ్వాసంతో నేటికి భక్తిశ్రద్ధలతో పా డుతుంటారు .
( భావం – ఓ నరసింహస్వామి! నన్ను పెంచు వాడవు, నా కోరికలు తీర్చు వాడవు, నాకు ఇష్ట దేవతవూ, నన్ను అనుగ్రహించు స్వామి, నీవైన వేద పురుష, నా తప్పులు మన్నించు, దుర్మార్గుడా అని కోపగించకు, నీకు మొక్కిన నన్ను రక్షించు గొప్ప ప్రభువా, నిన్ను ఆశ్రయించాను, నన్ను కాపాడుము..)
ఇంతటి మహిమాన్వితమైన. శతకం తమకు కూడా వర్తిస్తుందని కొందరు ధర్మపురి ఆలయ ఉద్యోగులు అనుకుంటున్నారు కావచ్చు. అందుకే వారు ఇష్టారాజ్యంగా, వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొందరు భక్తజనం నిర్బంధ వసూళ్లకు గురి అవుతున్నారు, సామాన్య భక్తులు, భగవంతుని స్వరూపంగా భావించి సకల సౌకర్యాల కల్పనకు కృషి చేయాల్సిన ఆలయ సిబ్బంది కొందరు, విఐపి భక్తజనుల సేవలో, తన్మయత్వం చెందుతున్నారు. భక్తుల నుంచి నిర్బంధగా వసూళ్ల చేస్తున్న వాళ్లను అడ్డుకునే ఆలోచన గాని, సాహసం గాని ఆలయ అధికారులు చేయడం లేదు
.

వివరాలలోకి వెళితే.
ప్రతియేటా దాదాపు నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కలిగి ఉండి, రాష్ట్రం , ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తజనంతో ఆలయం కిటకిటలాడుతుంది. స్వామివారికి ,భక్తజనం కు సేవలు అందించడానికి దాదాపు 80 మందికి పైగా ఉద్యోగులు ( ఆఫీసు సిబ్బంది,అర్చకులు, వేద పండితులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ,సెక్యూరిటీ, స్వీపర్లు ) ఉన్నారు . వీరికి ప్రతి నెల దాదాపు రూపాయలు ₹ 15 లక్షలకుపైగా ఆలయ ఆదాయం నుంచి జీతభత్యాలు చెల్లిస్తుంటారు.


నిర్బంధ వసూళ్లు ఇలా….


భక్తులు స్వామి వారికి తమ మొక్కులు, చెల్లించుకోవడం కోసం భక్తిప్రపత్తులతో కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే, కొబ్బరికాయను ₹ 20 నుంచి 30/- ( ఇందులో తులసి మాల ,అగరవత్తులు, పసుపుకుంకుమలు కలిపి ఉంటాయి) ఆలయ ప్రాంగణంలో కొడితే నిర్వాహకుడు నిర్బంధంగా కొబ్బరికాయ ఒక్కంటికి ₹ 10 నుంచి ₹ 15/- రూపాయలు వసూలు చేయడం షరా మామూలుగా మారింది. ప్రధాన ఉత్సవాల్లో ప్రత్యేకంగా జాతర, నరసింహ నవరాత్రులు, హనుమజ్జయంతి, అదనంగా మరో సహాయకుని పెట్టుకొని ఈ వసూళ్లను కొనసాగిస్తున్నారు. వసూళ్ల పర్వం పై భక్తులు ఫిర్యాదు చేసిన ఆలయ అధికార యంత్రాంగం కు, వారిని అడిగే ధైర్యం కాని,, అడ్డుకునే సత్తా కాని లేదనే విమర్శలు ఉన్నాయి. టెండర్ ద్వారా కొబ్బరి ముక్కల సేకరణ కాంట్రాక్టు పొందిన వ్యక్తి కొబ్బరికాయ ఒక్కంటికి కొట్టినందుకు ₹ 10/- నుంచి 15/- రూపాయలు వరకు అమాయక భక్తజనం నుంచి నిర్బంధంగా వసూలు చేస్తున్నారు.. తాను కొట్టడు, భక్తులు కొట్టడానికి అనుమతించాడు, ,విధిలేని పరిస్థితుల్లో కొందరు భక్తులు రాజగోపురం మెట్ల ,వద్ద కొబ్బరి కాయలను, కొడుతున్నారు. భక్తజనం రద్దీ అధికంగా ఉన్న సమయంలో కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కొడుతు, కొబ్బరికాయలు చాకచక్యంగా జాలి లోకి వదులుతూ మరో కొబ్బరి ముక్కను భక్తులకు ప్రసాదంగా నిర్వాహకుడు అందిస్తున్నారు. నిత్యం 5 నుంచి 10 కొబ్బరికాయలు తిరిగి మార్కెట్లో రీసైక్లింగ్ చేస్తు. రూపాయలు ₹ 15 రూపాయలకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. . ఇక్కడ కొట్టిన కొబ్బరికాయ నీళ్లు ను నిర్వాహకుడు ప్లాస్టిక్ బాటిల్లో నింపి బాటిల్ ₹ 40 నుంచి ₹ 50 రూపాయలకు భక్తులకు విక్రయించడం షరా మామూలే. ఆలయ ప్రాంగణంలో కొబ్బరి ముక్కల సేకరణకు సీల్డ్ టెండర్ ద్వారా 1/4/2020 నుంచి 31/3/2022 (. రెండు సంవత్సరములకు గాను) ₹. 17 లక్షల, 50 వేలకు నిర్వాహకుడు దక్కించుకున్నారు. టెండర్ నిబంధనలలో, భక్తుల నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదని, వారిపట్ల అమర్యాదగా ప్రవర్తించ వద్దు, కొబ్బరి నీళ్లు వాటర్ బాటిల్ లో పోసి విక్రయించ రాదని ,ఎవరైనా ఫిర్యాదు చేసిన, తమ దృష్టికి వచ్చిన, టెండర్లు రద్దు చేసే అధికారం దేవస్థానం అధికారులు ఉందని, అగ్రిమెంట్ లో స్పష్టంగా పేర్కొనబడింది, అయినా నిర్వాహకులు మాత్రం ఇష్టారాజ్యంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.


ఆలయ ప్రాంగణంలో భక్త జనం కు పూజా సామాగ్రి అమ్ముకోవడం కోసం . దుకాణం ఏర్పాటుకు టెండర్ ద్వారా అప్పగించారు.16/12/2019 నుంచి 31/3/2022 లకు రూ. 13 లక్ష ల. 84 వేలకు వేలంలో రవి అనే వ్యక్తి కైవసం చేసుకున్నారు. కొబ్బరికాయలు మినహా ,పూజా సామాగ్రి , పిల్లల ఆట బొమ్మలు, భక్తి పాటలు పుస్తకాలు, తదితర నూనెలు,పత్తి వత్తులు, వస్తువులు అమ్ముకోవడానికి టెండర్ దారుడికి హక్కు కల్పించారు. అధిక ధరలకు అమ్మ వద్దు, భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించ రాదు, కేటాయించిన స్థలములోనే దుకాణాము ఏర్పాటు చేయాలని విస్తరించి షెడ్ వేయరాదని అగ్రిమెంట్. కానీ దుకాణం నిర్వాహకులు అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనలకు అతీతంగా కొనసాగుతున్న ఆలయాధికారులు, సిబ్బంది గత రెండు సంవత్సరాలుగా చూసి చూసీచూడనట్టుగా మౌనం వహించడం గమనార్హం. అధిక ధరలకు ప్రతి వస్తువు మార్కెట్ లోని ధరలకు రెండింతలుగా భక్తుల కు అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రత్యేకంగా స్థానిక దైవం లక్ష్మీ నరసింహస్వామి, ఫోటో ఫ్రేములు అమ్మకాల కూడా, ఈ నిర్వాహకుడికి అప్పగించడంతో వివిధ సైజుల ఫోటోలు, రెట్టింపు ధరలు పెంచడంతో పాటు, అనేక సందర్భాల్లో ఫోటోలు అందుబాటులో లేవంటూ సమాధానం రావడంతో భక్తజనం నిరాశ చెందుతున్నారు. అధిక ధరల విషయం భక్తజనం వద్ద అధిక ధరలు వసూలు చేస్తున్న , అంశాలు ఆలయ అధికారులకు తెలిసిన తెలియనట్లు ప్రవర్తించడం గమనార్హం.


టెండర్ కాలపరిమితి ముగిసింది !


కొబ్బరి టెంకాయలు సేకరణ, ఆలయ ప్రాంగణంలో పూజా సామాగ్రి విక్రయించే దుకాణాలు టెండర్ కాలపరిమితి 31/3/2022 నాటికి ముగిసింది. తిరిగి వీటికి ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి నూతన టెండర్ ద్వారా వేలం నిర్వహించాల్సి ఉంది.


మానవీయ కోణం లో…


అయితే కరోనా నేపథ్యంలో, ఆలయాలు మూసివేయడం తో నష్టం వాటిల్లిందని, కొందరు టెండర్ దారులు న్యాయస్థానంను ఆశ్రయించారు. మానవీయ కోణంలో కొన్ని నెలలపాటు ఆలయాలకు డబ్బులు చెల్లించకుండా టెంకాయ ముక్కల సేకరణ, పూజా సామాగ్రి విక్రయాలకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే నిర్బంధగా భక్తుల నుంచి డబ్బులు వసూలు , దుకాణాలకు టెండర్ లో పేర్కొన్న విధంగా కేటాయించిన పొడవు, వెడల్పు స్థలంలోనే దుకాణం షేడ్ ఉండాలి. కేటాయించిన స్థలం కంటే దుకాణం విస్తరించి షెడ్లు వేయడం అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనల మేరకే నిర్వహణను కొనసాగించాలి, తప్ప నిబంధనలకు వ్యతిరేకంగా దుకాణాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలకు అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.


కోర్టు పేరుతో..


భక్తులు నిర్భంద వసూళ్ల, అధిక ధరలు తదితరా అంశాల పై అలయ అధికారుల కు పిర్యాదు చేసినా సందర్భం లో కోర్టు ఆదేశాలు ఉన్నాయి ఏం చేయలేము? అంటు తప్పించుకోవడం షరా మామూలుగా భక్తులకు చెప్పే సమాధానం. అలయంకు రూపాయాలు చెల్లించ కుండ వ్యాపార కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. తప్ప నిర్భంద వసూళ్ల కోసం కాదు అనే విషయం జగమెరిగిన సత్యం.


మహిళ అధికారిని లా చర్యలు తీసుకునే దమ్ముందా ?
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ కార్యనిర్వహణాధికారి భక్తజనం వాహనాల పార్కింగ్ రుసుము, అధిక ధరలు వసూలు చేసిన. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని, కాంట్రాక్టును రద్దు చేయడంతోపాటు, కాంట్రాక్టర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారు. భక్తుల సౌకర్యార్థం వాహనాల పార్కింగ్ ఉచితం చేశారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంలో ప్రచార సాధనాల్లో, సోషల్ మీడియాలో, నెటిజన్లు మహిళా అధికారిని పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. కళ్ళకు కట్టినట్టు ప్రత్యక్షంగా ఆలయంలో టెండర్ నిర్వాహకులు నిర్బంధంగా వసూళ్లకు పాల్పడుతున్న, షెడ్డు విస్తరించి దుకాణం నిర్వహిస్తున్న. వారిపై చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం అధికార యంత్రాంగానికి ఉందో లేదో వేచి చూడాల్సిందే.


వీఐపీ భక్తుల సేవలో …

..
భక్తజనం సౌకర్యార్థం, ఆలయ ఆదాయం, అభివృద్ధికై ఆలయ సిబ్బంది ,అధికార యంత్రాంగం విధులు నిర్వహించడం షరా మామూలే . కొందరు ఉద్యోగులు మాత్రం VIP భక్త జనుల సేవలో తన్మయత్వం చెందుతున్న రు. తాము విధులు నిర్వహిస్తున్న చోటు వదలి VIP ల వెంట. వారి సామానులు, వారి. బ్యాగ్ లు పట్టుకొని, వారికి ముందస్తుగానే సేవా టికెట్లు ఇవ్వడం, ప్రత్యేక పూజ సందర్భాల్లో స్వామి వారు ముందు వరుసలో కూర్చోబెట్టడం సామాన్య భక్తులను వెనక్కి పంపడం నిత్యం జరిగే హోమ,కుజ దోష నివారణ పూజ హోమం, తదితర పూజాది కార్యక్రమాల్లో వారి వెంట అంగరక్షకులుగా అనుసరించడం. అందరికీ తెలిసిన విషయమే. పులిహోర, దద్దోజనం ప్రసాద ల కౌంటర్ నుంచి తెచ్చి అప్పగించడం, వారి వెంట రాజగోపురం, వాహనాల వరకు వెళ్ళి సెండాఫ్ చేసి వారి పట్ల తమ వినయ విధేయతలు ప్రదర్శించడం కొందరు ఉద్యోగులకు. మామూలుగా మారింది. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గాని, అధికారులు గాని , లక్ష్మీ నరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాల నాటి నుంచి, గత 15 రోజుల ఆలయంలోని సీసీటీవీ పుటేజ్ లను పరిశీలిస్తే వీఐపీల సేవలో తరిస్తున్నది ఎవరో ? అనే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.


అభివృద్ధి కమిటీ పని తీరు అభినందనీయం !


జాతర ఉత్సవాల్లో, ప్రభుత్వం నియమించిన అభివృద్ధి కమిటీ పని తీరును భక్తులు ప్రశంసిస్తున్నారు. జాతర ఉత్సవాలు ఆదాయం పెరగడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం కావడం, ప్రత్యేకంగా స్వామివారికి నిత్యాభిషేకం కోసం గోదావరి జలాలను. బిందె తీర్థం, పునరుద్ధరించడం, శివాలయంలో శంకరాచార్య, శారదాంబ పీఠం వేదిక మరమ్మతులు శివాలయంలో కళ్యాణ వేదిక గ్రానైట్ రాయి , శ్రీ రామలింగేశ్వర స్వామికి వెండి పందిరి కోసం భక్తుల నుంచి వెండి విరాళాలు సేకరించడం, ఆలయం ముందు వేసవిలో గ్రీన్ మ్యాట్ వేయడం భక్తుల సౌకర్యార్థం కూలింగ్ వాటర్ ఏర్పాటు చేయడం. తదితర అంశాలు పట్ల భక్తజనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


శివాలయం పై చిన్న చూపు !


శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ( శివాలయం ) ఆలయ అధికారులు వివక్షత చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. అతి పురాతనమైన ఈ ఆలయం లో అభిషేకం ,హారతి ,అర్చనాది పూజా టికెట్లు వివరాలు భక్తజనులకు అందుబాటులో ఉండవు. శ్రావణమాసం సంకష్టి, మాస శివరాత్రి ,సందర్భాల్లోనే శివాలయంలో ఉద్యోగుల, పూజారుల, ఉనికి కనిపిస్తుంది తప్ప. ఎప్పుడు ఆలయం తెరుస్తారో ? అర్చకుడు ఉంటాడా ? తెలియని పరిస్థితి అక్కడ ఉంది. ఈ ఆలయంలో ఇద్దరు అర్చకులు ఉంటారు. అత్యధిక శాతం భక్తులకు ఒక్కడే అర్చకుడు అందుబాటులో ఉంటాడు. మరో అర్చకుడి సమయపాలన ఆలయ అధికారులకే అంతుపట్టదు. టిక్కెట్ల విక్రయానికి గాని హుండీ వద్దాగాని ఉద్యోగి ఉండరు. సెక్యూరిటీ గార్డు. భక్తులకు పూజా టికెట్ల విక్రయం చడం ఈ ఆలయంలో షరా మామూలుగా మారింది.


సెక్యూరిటీ నిర్వహణ ఎవరిది. ?


31/03/2022 నాటి వరకు ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సెక్యూరిటీ బాధ్యతలు సిరిసిల్ల కు చెందిన గౌతంరాజు సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహణలో ఉండేది. ఇటీవల జరిగిన టెండర్లలో ఆలయ సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతలు కొండగట్టు కు చెందిన “ఆంజనేయ ఎంటర్ప్రైజెస్” వారికి దక్కింది. 01/04/2022 నుంచి సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతలు కొండగట్టు కు చెందిన ఏజెన్సీ వారు నిర్వహించాల్సి ఉండగా గతంలో కొనసాగిన సిరిసిల్ల ప్రాంతం కు చెందిన సెక్యూరిటీ నిర్వాహకులు. యధావిధిగా సెక్యూరిటీ బాధ్యతలు చేపడుతున్నట్టు సమాచారం. రికార్డులలో, టెండర్ అగ్రిమెంట్లో, మాత్రం ఆంజనేయ ఎంటర్ప్రైజెస్ అని నమోదు చేసినట్లు సమాచారం. ఈ అంశంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ .
అధికార యంత్రాంగం,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, జోక్యం చేసుకొని, భక్తుల సౌకర్యార్థం ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు కోరుతున్నారు. అభివృద్ధి కమిటీ సభ్యులు ఆదాయ వ్యయాలు లతోపాటు, గత నెలరోజుల క్రితం కూలర్ ల కోసం ఓ దాత, ₹ 50 వేల రూపాయలు విరాళంగా అందజేసినట్టు సమాచారం. .అయితే కూలర్ల పై దాత
పేర్లు వ్రాయించలేదని చర్చ. ఆలయంలో కొనసాగుతున్న సెక్యూరిటీ గార్డు ఏజెన్సీల అంశం, నిర్బంధ వసూళ్లు, దుకాణం షెడ్ విస్తీర్ణం అంశంల పై విచారణ జరిగితే అనేక అవకతవకలు వెలుగుచూసే అవకాశం ఉందని భక్తజనం ముక్త కంఠంతో కోరుతున్నారు.

జగిత్యాలమహిళా డిగ్రీ కళాశాల ను సందర్శించిన ఎగ్జామినేషన్ కంట్రోలర్ శాతవాహన యూనివర్సిటీ

జగిత్యాల జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పిజి ఎగ్జామ్స్ మరియు యూజీ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి., సందర్భంగా పరీక్షా కేంద్రాన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శాతవాహన యూనివర్సిటీ శ్రీ రంగ ప్రసాద్, మంగళవారం సందర్శించారు. ., కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై. సత్యనారాయణ , పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నారని అభినందించారు., ప్రస్తుతం శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్ష మూల్యాంకనం యూజీ మరియు పిజి ఆన్లైన్లో జరుగుతుందని ఆన్లైన్లో మూల్యాంకన ప్రవేశపెట్టిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం శాతవాహన విశ్వవిద్యాలయం అని వారు పేర్కొన్నారు.,
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ముసునూరు సుల్తానా, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ హరి జ్యోతి కౌరు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ డాక్టర్ పడాల తిరుపతి, ఏ రజిని, మల్లారం శ్రీనివాస్ రెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీ ఏ శంకరయ్య ,డాక్టర్ ఏ జ్యోతి లక్ష్మి, జి చంద్రయ్య, జి వి ఆర్ సాయి మధుకర్ , స్వరూపరాణి, జమున, జ్యోత్స్నా,సత్యం, జి తిరుపతి ,నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.