మంగళ వాయిద్యాలు వేద మంత్రాల ఘోషలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ‘చందనోత్సవం’ గురువారం ఉదయం కన్నుల పండువగా జరిగింది. కలెక్టర్ రవి నాయక్ దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి చందనోత్సవం పూజా కార్యక్రమాన్ని సుందరమైన స్వామివారి చందన స్వరూపాన్ని తిలకించడానికి తరలి వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

స్వామివారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఉదయం, వేదపండితులు, అర్చకులు ,పురుషసూక్త , శ్రీసూక్తం, కల్పోక్త , న్యాసపూర్వక , షౌడశోపచార పూజ , సహస్రనామార్చన, పంచోపనిషత్తులతో, రుద్రాభిషేకం , మరియు వాస్తు , యోగిని, క్షేత్ర పాలక , నవగ్రహ, సర్వతోభద్రమండలి , స్థాపిత దేవతాపూజల అనంతరం పూర్ణాహుతి , శ్రీస్వామి వారికి చందనోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి, రెనవేషన్ కమిటి సభ్యులు , వేదపండితులు, అర్చకులు , సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు

కలెక్టర్ దంపతులకు ఘన స్వాగతం
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం కు కలెక్టర్ దంపతులు వచ్చిన సందర్భంలో ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం ,మేళతాళాలతో స్వాగతంపలికి పూజలు అనంతరం, అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, మరియు రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య, శేషవస్త్ర ప్రసాదం అందజేసినారు

.

ప్రజా సమస్యల నివారణ కు ప్రత్యేక చర్యలు కలెక్టర్ !

జిల్లాలో ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలను అధిక ప్రాధాన్యత ఇస్తూ వాటిని సత్వరమే పరిష్కారని కి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసులు , ఇతర అంశాలపై అధికారులతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
సీఎంఆర్ రైస్
ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్య కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండలాల వారీగా లోడింగ్, ఆన్ లోడింగ్ తహసీల్దార్లు పర్యవేక్షించాలని, కలెక్టర్ ఆదేశించారు.మండలాలలో రైస్ మిల్లర్ల వారీగా పెండింగ్ ఉన్న, సీఎంఆర్ రైస్ ,డెలివరీ వివరాలు తహసీల్దార్లు రైస్ మిల్లర్ల నుండి పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
ఇసుక రవాణాపై
జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జరుగకుండా తగు చర్యలు తీసుకోని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, వాహనాలు సీజ్ చేసి పెనాల్టీలు విధించాలని, సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ నిర్మాణ పనులకు ఉపయోగించే విదంగా చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఇంటర్ పరీక్షలు
ఇంటర్ పరీక్షల సమయాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని, పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసి మాస్ కాపీ జరుగకుండా చూడాలని, వసతులు కల్పనకు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కళ్యాణ లక్ష్మి
కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ మరియు మీసేవా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూఅధికారులు మాత్రమే పంపిణీ చేయాలని , వేరే ఇతరులతో పంపిణీ చేయరాదని తెలిపారు.
ప్రజావాణి
ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి పిటీషన్ల పై సత్వరమే చర్యలు తీసుకొవాలని సూచించారు.ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయం నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
ఈ ఆఫీస్
ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని పేర్కోన్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, చెక్ మెమోలపై మీ సేవా సెంటర్ల ద్వారా మాత్రమే ధరఖాస్తులు చేసుకోవాలని, సిబ్బందికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనంలు , సర్వీసు మ్యాటర్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అన్నారు. చౌకధరణ దుకాణాల పై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక శ్రద్ధ వహించి రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చౌక ధరల దుకాణాలు
మండలాల్లో ఈ ఆఫీస్ వినియోగంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల జారీ సైతం కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.చౌకధరణ దుకాణాల పై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని, ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఇంచార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి మాదురి, 18మండలాల తహసీల్దార్లు , ఏ ఓ , కలెక్టరేట్, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.