ఆటో కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా, న్యాయబద్ధంగా చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు సహకారం ఉంటుంది పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాలలో తన ఇంటిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా MLC జీవన్ రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న ఇంధన ధరలతో రవాణా రంగం కుదేలవుతుంటే, మోటార్ వాహన చట్టం పేరుతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో వాహన కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆరోపించారు. ఒకప్రక్క ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రవాణా రంగ కార్మికుల జీవితాలు కుదేలు అవుతుంటే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలకడం విడ్డురంగా ఉందన్నారు, వాహన ఫిట్నెస్ పేరుతో రోజుకు 50 రూపాయలు ఫెనాల్టీ భావ్యం కాదని,కోవిడ్ వల్ల ఇప్పటికే ఆటోరిక్షా కార్మికుల జీవితాలు దుర్భరమౌతుంటే ఇప్పుడు ఫిట్నెస్ ఫెనాల్టీ వారి జీవితాలకు గూదిబండగా మారిందని ఆరోపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్ ఫెనాల్టీ పేరుతో రవాణా రంగ కార్మికుల జీవితాలలో ఆటలాడుతుంటే కార్మికుల పక్షాన ఉండవలసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని హెద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వాహన రంగ కార్మికుల పక్షాన ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న వాహన రంగ కార్మికులకు, ముక్యంగా సమ్మె చేస్త్తున్న జగిత్యాల ఆటో రిక్షా కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన తన సంఘీభావం సంపూర్ణ సహకారం తెలుపుతున్నట్టు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
పాత్రికేయుల సమావేశంలో…
* పట్టణ ప్రాంతాల్లో ని నిరుపేదలు మోటార్ రంగం లో పెద్ద ఎత్తున ఉపాధి పొందుతున్నారు.వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించడం లేదు.
* క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం వలన రవాణా రంగం పూర్తిగా కుదేలయింది…
* పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వలన ఆటో రిక్షా కార్మికులకు భారం పెరిగింది…
* మూడు వేలు ఉన్న రోడ్ టాక్స్ ఇవాళ తొమ్మిది వేలయింది..
* ఆటో రిక్షా కార్మికులు ఉపాధి కోల్పోయారు…
* రాష్ట్రం విభజన జరిగినప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం..
* ఆంధ్రా లోటు బడ్జెట్ రాష్ట్రం..
కానీ ఆంధ్రలో ప్రభుత్వం ఆటో కార్మికులకు పదివేలు ప్రోత్సాహకం అందిస్తుంది…
* ప్రభుత్వాలు కుంచెరకల ప్రభుత్వవాలు అయినవి..
* రోజువారీ టాక్స్ లతో ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు…
* కరోన వల్ల బతకడం కష్టమైన కార్మికులకు పెనాల్టీ వేయడం ఎందుకు… కేంద్రం చేస్తే రాష్ట్రం ఎందుకు అమలు చేయాలి…
* గత రెండేళ్లుగా కరోన వల్ల ఆటో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది..
* ఇవాళ అందోలన చేస్తున్న ఆటో కార్మికులకు కాంగ్రెసు పార్టీ పూర్తిగా మద్దతు చేస్తున్నాం..
*వెంటనే పెనాల్టీ లేకుండా చేయాలి.అన్నిరకాల పెనాల్టీ క్లాజ్ తొలగించాలి..
* ఫిట్నెస్,ఇన్సూరెన్స్, రేణివల్ పెనాల్టీ తొలగించాలి..
*సంఘటిత కార్మికుల కు ప్రావిడెంట్ ఫండ్ పొందే వీలుంది. అసంగటిత కార్మికులైన మహిళలకు అభయ హస్తం అనే కార్యక్రమం ద్వారా గతం లో పెన్షన్ పొందేలా పతకం ఉండేది…
* లక్షలాది అసంఘటిత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం యజమాని హోదాతో 60 ఏళ్ళు నిండిన కార్మికులందరికి అభయ హస్తం పతకం ద్వారా పెన్షన్ ఇవ్వాలి…
* ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి మోటార్ ఫీల్డ్ పై ఆధారపడ్డ కార్మికులందరి 5 వేలకు తక్కువ కాకుండా పెన్షన్ పతకం అమలు చేయాలి… అంటూ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ధర్మపురిలో..
మండల కేంద్రమైన ధర్మపురి లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఆటోలను నిరవధిక బంద్ చేసి సమస్యల సాధన కోసం యూనియన్ నాయకులు ఆటోడ్రైవర్లు స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు.
బుగ్గారం లో..
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి 63 పై బైఠాయించి డ్రైవర్లు కార్మికులు నిరసన తెలపడంతో దాదాపు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి..

తెరాస కు షాక్…
మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ కి చెందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఓదెలు, ఆయన సతీమణి మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి. గురువారం కాంగ్రెస్ పార్టీ చేరారు.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి, దామోదర రాజనర్సింహ ల తో కలసి ఢిల్లీకి వెళ్లి ప్రియాంక గాంధీ, సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఓదెలు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో తమను అవమానాలకు గురి చేస్తున్నారని, జెడ్పి చైర్ పర్సన్ ,ప్రోటోకాల్ పద్ధతులు కూడా అధికారులు, అధికార పార్టీ నాయకులు, పాటించడంలేదని 2018 శాసనసభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే తనకు టికెట్ కూడా టిఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదని అవమానాలు భరిస్తూ, ఇంతకాలం ఓపిక పట్టమని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో తమకు సముచిత స్థానం, గౌరవం లభిస్తుందని చేరినట్టు ఢిల్లీలో మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు
