J.Surender Kumar,
నిరుద్యోగ యువత ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని టీచర్స్ ఎమ్మెల్సీ రగోత్తమ్ రెడ్డి ,తన ఆకాంక్షను వెలిబుచ్చారు. బుధవారం ధర్మపురి క్షేత్రంలో
LM కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్స్, పోలీసు, ఉచిత శిక్షణ ను ఉపాధ్యాయ MLC, రగోత్తం రెడ్డి పరిశీలించారు

. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నిరుద్యోగ యువత తో మాట్లాడుతూ యువతఉచిత శిక్షణా అవకాశంను సద్వినియోగం చేసుకోని, ధర్మపురి నియోజకవర్గం నుండి ఎక్కువ సంఖ్య లో ఉద్యోగాలు సాధించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్, సంగి సత్తమ్మ, PRTU జగిత్యాల జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, ప్రధానకార్యదర్శి ఆనందరావు, మండల అధ్యక్షులు వేణుగోపాల్, చిలువేరి శ్యామ్, సుందర్ తదితరులు పాల్గొన్నారు.

నరసింహుని దర్శించుకున్న ఎమ్మెల్సీ!
పాల్గొన్నాఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి, దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం ,సాధరంగా స్వాగతంపలికి పూజలు అనంతరం, అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా



ఆర్చ్ గేటుకు మార్కింగ్ !
63 వ జాతీయ రహదారి రాయపట్నం క్రాస్ రోడ్ వద్ద ఆర్చ్ , గరుడ విగ్రహంనకు , బుద్దేశ్ పల్లి -నర్సయ్యపల్లి వద్ద ఆర్చ్ నిర్మాణాలకు బుధవారం దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి మార్కింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు చిట్టిబాబు, నరసయ్య పల్లి గ్రామ సర్పంచ్ తిరుపతి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య , వేముల నరేష్ , అక్కనపల్లి సురేందర్ exqutive ఇంజనీర్ రాజేష్ , డిప్యూటీ ఇంజనీర్ రఘునందన్ , అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రతాప్ , తదితరులు పాల్గొన్నారు.

పారిశుధ్య పనుల పరిశీలన !
జగిత్యాల పట్టణంలో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి… బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి కార్మికుల హాజరు శాతం ,పని విధానంనుఆమె పరిశీలించారు.
ఉదయము పారిశుధ్య కార్మికుల హాజరు పర్యవేక్షించి కార్మికులు అందరూ వారికి కేటాయించిన వార్డులో, ఇంటి ఇంటి తడి ,పొడి, చెత్త సేకరణ మరియు, మురికి కాలువలు, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారము శుభ్రం చేయుటకు విధివిధానాలను వివరించారు.
కరీంనగర్ రోడ్, యావర్ రోడ్ యందు పారిశుధ్య పనులను పర్యవేక్షించారు, చెత్త రహదారులపై వేసిన వారికి వారి ద్వారానే శుభ్రం చేయించి పునరావృతం అయితే జరిమానా విధిస్తామని తెలిపారు., నిషేధిత ప్లాస్టిక్ వాడితే జరిమానా విధించింది చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వీరి వెంట మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లు, అధికారులు శంకర్, అశోక్, రాము, శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు
