సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేటర్ స్థాయి పాఠశాలలో లభించే మౌలిక వసతులు తో పాటు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మన ఊరు మన బడి పోటీ పడుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు జగిత్యాల్ జిల్లా
వెల్గటూర్ మండలం లోని కొత్తపేట గ్రామంలో సోమవారం మంత్రి ఈశ్వర్ ముందుగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం, కొత్తపేట ప్రాథమిక పాఠశాలలో మన ఉరు- మన బడి కార్యక్రమాన్ని మంత్రి ఈశ్వర్ ,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్, కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీమతి లత, ఆర్ డి ఓ మాధురి, సర్పంచ్ రాంబాబు, జెడ్పీటీసీ సభ్యురాలు సుధారాణి రామస్వామి, ఎంపీపీ లక్ష్మి లింగయ్య. డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, పాక్స్ చైర్మన్ ఎంపీటీసీ పూజిత, DEO జగన్మోహన్.,PR EE రెహ్మాన్, స్పెషల్ అధికారి DWO నరేష్, MPDO సంజీవరావు, పాఠశాల ప్రాధనోపాధ్యాయులు ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లి తండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లాలో..

ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలనేదే కేసీఆర్ లక్ష్యం !
మగ్గం పూర్ లో మంత్రి గంగుల !
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సోమవారం కరీంనగర్ రూరల్ మండలం మొగదుంపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ పథకం కింద నిర్మించిన ఇండ్లకు, సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలు అందరూ సంతోషంగా ఉండాలనేదే కెసిఆర్ లక్ష్యమని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం తో పేదల కల సాకారం అయిందన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలన్న ఆలోచన రాలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలో నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు బంధు, రైతు బీమా, సాగుకు 24 గంటల ఉచిత కరెంటు, దళిత బందు లాంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో నైనా అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు .
కాలేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా మండుటెండలో సైతం నీళ్లు మత్తడి పైనుంచి పారుతున్నాయి అన్నారు. నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకం ద్వారా లక్ష 116 రూపాయలను ప్రభుత్వమే అందజేస్తుంది అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన గర్భిణీలకు, కెసిఆర్ కిట్ అందజేయడం జరుగుతుందన్నారు. మగ్దుంపూర్ గ్రామంలో 52 మందికి గాను 40 మందికి ఇండ్లను అందజేయడం జరిగిందని మిగిలిన 12 మందికి త్వరలోనే పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. మంత్రి అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పిటిసి, ఎంపీటీసీ దేవనపల్లి పుష్ప అంజిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఆనందరావు, శ్రీనివాస్ సంపత్, జక్కన్న నరసయ్య, తహసీల్దార్ వెంకట్ రెడ్డి, బండ తిరుపతి టిఆర్ఎస్ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలకు. చర్యలు!
ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా!
జగిత్యాల మే 16:- 10వ తరగతి పరీక్షల నిర్వహన కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సంబంధిత అధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో, స్కూల్ డైరెక్టర్ శ్రీ దేవసేన తో, కలిసి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో మే 23, 2022 నుంచి. జూన్ 01, ,2022 వరకు 10వ తరగతి పరీక్షల నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీని కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నాపత్రాల లీకేజీ సమస్య ఎదురైందని, మన రాష్ట్రంలో ఆ సమస్య ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, చివరి అరగంట సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాల తరలింపు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, అవసరమైన మేరకు పోలీసు బందోబస్తు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
10వ తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను, జిల్లాలకు తరలించామని, పరీక్ష కేంద్రాల వద్దకు ఓఎంఆర్ షీట్లను తరలించి వెరిఫై చేయాలని ఆయన సూచించారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటి పర్యవేక్షణలో మాత్రమే ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేయాలని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు కనీసం 45 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సుల రూట్ మ్యాపింగ్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
పాఠశాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతించవద్దని, విద్యార్థులను తనిఖీ చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోగల జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆయన ఆదేశించారు. పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బందికి ఐడెంటి కార్డు తీసుకొని రావాలని ఆయన తెలిపారు.
అనంతరం ఆయన మన ఊరు మన బడి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. మన ఊరు మన బడి కింద మొదటిదశలో ఎంపికైన పనులకు పరిపాలన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని, మంజూరు చేసిన పనులను క్షేత్రస్థాయిలో గ్రౌండ్ చేయాలని ఆయన ఆదేశించారు.
సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ దేవసేన మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు ముందస్తుగా పరిశీలించాలని సూచించారు. కాంపోజిట్ కోర్స్ విద్యార్థులకు మొదటి లాంగ్వేజ్ పరీక్ష 2 పేపర్లు అదేరోజు ఉదయం నిర్వహించడం జరుగుతుందని , ఉదయం 9.30 నుండి 11.45 ఒక పేపర్, 11.45 నుండి 12.45 వరకు 2వ పేపర్ నిర్వహించడం జరుగుతుందని ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్ .లత, జిల్లా విద్యాశాఖ అధికారి , ఈఈ పంచాయతీ రాజ్ , జిల్లా పంచాయతీ అధికారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
కరీంనగర్ లో.

ప్రజావాణి సమస్యలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలి
ప్రజావాణి సమస్యలను అధిక ప్రాధాన్యతతో .పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 241 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా పరిషత్ సి.ఈ.ఓ ప్రియాంకతో కలిసి అదనపు కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు పంపినట్లు వారు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఎస్సీ కార్పోరేషన్ కు చెందినవి 134, రెవెన్యూకు సంబంధించినవి 68, పంచాయతి శాఖకు చెందినవి 09, మున్సిపల్ కు చెందినవి ౦9, కాగా ఇతర శాఖలకు సంబంధించినవి 21 ఉన్నాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ లక్ష్మారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీలత రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, వివిధ శాఖల అధికారులు, డిప్యూటీ తహశిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు ఉద్యోగాలు
జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాల ఇంటర్వ్యూలు ఈనెల 18న నిర్వహించబడును నట్టు జగిత్యాల జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారినీ బి సత్యమ్మ ఓ ప్రకటనలో తెలిపారు.
నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ , (NAVATA ROAD TRANSPORT) హైదరాబాదు కంపనీ,
మరియు Aadharsha Nexa, Jagtial కంపనీల నందు క్లర్క్ (90), అసిస్టెంట్ మేనేజర్ (41), హార్డ్ వేర్ ట్రైనీ (15), మెకానిక్ (10), డ్రైవర్స్ (50), క్లీనర్ (50) మరియు సేల్స్ ఎక్స్కూటివ్ (15) మొదలుగు 271 ప్రైవేట్
ఉద్యోగా అవకాశాలు ఉన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఇట్టి ఉద్యోగాలకు తేదీ 18 .05 .2022 బుధ వారము రోజున జాగిత్యాల లోని జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసులో 11.00AM నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. . SSC, to Any Degree ,Any ITI, మరియు
Diploma, B.Tch అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. ఎంపిక కాబడిన వారు ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్ లలో పనిచేయాల్సి ఉంటుంది. ఇట్టి ఉద్యోగాలకు
నెలకు జీతం ₹ 8000 నుండి ₹ 17000 వరకు ఉండవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
(Resume),విద్యార్హతలు అనుభవం సర్టిఫికెట్లతో తేది: 18 .05.2022 బుధవారము ఇంటర్వ్యూల నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
వేదిక : జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం
ధరూర్ క్యాంప్, రామాలయం దగ్గర జగిత్యాల.
గమనిక : ఇవి ప్రైవేటు ఉద్యోగాలు మాత్రమే
వివరాలకు సంప్రదించవలసిన చారవాని నెం : 7995545407, 8897436633,8897606633

రేషన్ బియ్యం పట్టివేత !
, ధర్మపురి మండలం, దొంతాపూర్ గ్రామ శివారు లో అక్రమంగా తరలిస్తున్న PDS రైస్ 1.61qtls ను నాయబ్ తహశీల్దార్ (సివిల్ సప్లై),మండల గిర్డావర్ ధర్మపురి పట్టుకొని 6A case నమోదు చేశారు. అట్టి బియ్యమును స్థానిక డీలర్ బుచన్న చౌక ధరల దుకాణం 2703025. కు అప్పగిస్తూ, తదుపరి అట్టి వాహనం TVS XL ను తగు భద్రత నిమిత్తం SHO ధర్మపురి కి అప్పగించారు..

ఇష్టపడి, కష్టపడి చదవాలి!
పోటీపరీక్షలకు సన్నద్ధం అవుతున్న పోలీస్, మరియు గ్రూప్స్ ఉద్యోగ ఆశావాహులు పోటీపరీక్షలకు ఇష్టపడి కష్టపడి చదవాలని జగిత్యాల జిల్లా SP శ్రీమతి సింధూశర్మ. అన్నారు. సోమవారం ధర్మపురిలో న్యూ టిటిడి కళ్యాణ మండపం లో హెలెన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగులకు ఉచిత శిక్షణ భోజన వసతులు కనిపిస్తున్న శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ నిరుద్యోగ యువతకు అనేక సలహాలు సూచనలు ఇచ్చి వారిని ప్రోత్సహించారు.