కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు – ఎమ్మెల్యే సంజయ్ !

జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు కేంద్రం ,జనరల్ ఆస్పత్రిలో ఓపి సేవలు ప్రారంభమయ్యాయి…జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఓపి సేవలను బుధవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు,బలహీన , పేద వర్గాల వారికి ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు ఈ ఆస్పత్రుల్లో లభిస్తున్నాయని అన్నారు..నూతన మాతా శిశు కేంద్రం లో జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రి, .ఆప్తమాలజీ సేవలు రోగులకు అందుబాటులోకి వచ్చాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వార్డులు తిరుగుతూ, వైద్యం ఎలా ఉంది ?  అని  రోగులను  అడిగారు.  కార్పొరేట్ స్థాయిలో ఉండటం పై. వారు హర్షం వ్యక్తం చేశారు.. ఆదిలాబాద్ తో పాటు, పెద్దపెల్లి జిల్లాల, నుండి పేషెంట్లు  వైద్యం నిమిత్తం  జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్యం పొందుతున్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. శివరాం ప్రసాద్ .,సుపరిండెంట్ డా.రాములు, అర్ఎంఓ  డా.శ్రీధర్, కౌన్సిలర్ బోడ్ల జగదీష్,
నాయకులు  సత్యం, తిరుపతి, వంశీ, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.


ఎల్లమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్సీ!


. అంతర్ గాం లో గౌడ సంఘం, ఆధ్వర్యంలో జరుగుతున్న ఎల్లమ్మ పట్నాల, సందర్భంగా ఎల్లమ్మ తల్లి దర్షించుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


వాసవి మాత ను దర్శించుకున్న ఎమ్మెల్యే!


జగిత్యాల పట్టణ వైశ్య సంఘ భవనంలో, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవీ, జయంతి మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,.కౌన్సిలర్ బొడ్ల జగదీష్, కప్పల శ్రీకాంత్,  వైశ్య సంఘ అధ్యక్షులు మంచాల కృష్ణ,.Amc డైరెక్టర్ బట్టు ప్రవీణ్, గంప వేణు, పబ్బ శ్రీనివాస్, .అర్వపల్లి రాజేందర్,  తదితరులు పాల్గొన్నారు.


రూరల్ మండల అంతర్గం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాలు కార్యక్రమానికి  ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు  నిర్వహించారు.  లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్రశేఖర్ గౌడ్,  ఫైనాన్స్ కమిషన్ ఛైర్మెన్, రాజేశం గౌడ్., ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోనగిరి నారాయణ,.ఎంపీటీసీ శ్రీనివాస్, .రైతు బంధు సమితి మండల కన్వీనర్, నక్కల రవీందర్ రెడ్డి,  ఉప సర్పంచ్ శేకర్ గౌడ్,గ్రామ అధ్యక్షులు స్వామి రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మల్లారెడ్డి, గౌడ సంఘ అధ్యక్షులు బాలు గౌడ్, సురేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.