చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గాను మరింత విస్తరించడం, అభివృద్ధి పర్చే పనులను మరింత వేగవంతం చేయాల్సిందిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అధికారులను ఆదేశించారు.
ఇందుకు సంబంధించి దర్గా వద్ద ఉన్న నాలుగు ఎకరాల భూమిని సేకరించే విషయమై మంత్రి కొప్పుల ఈశ్వర్, షాద్ నగర్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ లు, అధికారులకు పలు సూచనలు , సలహాలిచ్చారు.

జె.పి దర్గా అభివృద్ధిలో భాగంగా బైపాస్ రోడ్డు, బస్టాండు, రోడ్ల విస్తరణ, వాష్ రూమ్స్, అతిథి గృహం నిర్మాణాలతో పాటు భక్తులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు మంత్రి కొప్పులకు వివరించారు.
సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్, Wakf Board ఛైర్మన్ .మషీవుల్లా, సిఇవో షానవాజ్ ఖాసీం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అమోయకుమార్ తదితరులు పాల్గొన్నారు

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉత్తమ ప్రమాణాలతో కూడి ఉందని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.
శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ కళాశాలల్లో డ్రాప్ అవుట్ శాతం తగ్గించాలని, ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు. పి.జి. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు వారధి నుండి పోటీ పరీక్షల శిక్షణను ఇస్తున్నామని పెర్కోన్నారు. ప్రతి విద్యార్థి ఆన్ లైన్, మూక్స్, స్వయమ్, కోర్సెరా వంటి కోర్సులు అధ్యయనం చేయాలని సూచించారు. డిగ్రీ కళాశాలల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకై సహకారం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్సారార్, మహిళా కళాశాలల ప్రచార పత్రాల్ని కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశానికి ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రామకృష్ణ కన్వీనర్ గా వ్యవహరించగా, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. శ్రీలక్ష్మి, జమ్మికుంట కళాశాల ప్రిన్సిపాల్ డా. సుజాత, హుజురాబాద్ కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్, డా. ఎస్. ఓదేలు కుమార్, డా. లక్ష్మినర్సయ్య, డా.ఏ. శ్రీనివాస్, డా.మల్లారెడ్డి, డా. డిఆర్ సి సమన్వయకర్త హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
ఔట్ సోర్స్ ప్రాతిపధికన 18మంది డాక్టర్ల ఎంపిక:

జిల్లాలో ఔట్ సోర్స్ ప్రాతిపధికన 18 మంది యంబిబిఎస్ డాక్టర్లను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా వైద్యాధికారి జువేరియా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో యంబిబిఎస్ డాక్టర్ల కొరకు నోటిఫికేషన్ జారీచేయగా 18 మంది యంబిబిఎస్ డాక్టర్లు ధరకాస్తు చేసుకోగా శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి అర్హత కలిగిన (18) మందిని ఎంపిక చేయడంతో పాటు వారికి పోస్టింగ్ కుడా ఇవ్వడం జరిగిందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.