రాజ్యసభ ఎన్నికల TRS అభ్యర్థి, దీవకొండ దామోదర్ రావు ను గురువారం హైదరాబాదులో మంత్రులు కొప్పుల ఈశ్వర్ ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి శుభాకాంక్షలు తెలిప అభినందించారు.

ఈ సందర్భంగా దామోదర్ రావు ను మంత్రి శాలువాతో సత్కరించారు.
మంత్రులతోపాటు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, కేశవ్ , తదితరులు అభినందించారు.
చెక్కుల పంపిణీ !

జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో మోతే రోడ్డులోనీ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లో లో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 58 మంది లబ్ధిదారులకు, ₹.18,00,000/- రూపాయలు విలువగల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్, పాక్స్ చైర్మన్ ,మైపాల్ రెడ్డి, మండల రైతు బంధు కన్వీనర్ నక్క రవీందర్ రెడ్డి, రూరల్ మండలం యుత్ అధ్యక్షులు దమ్మ సురేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయమును ఆకస్మిక తనిఖీ!

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయమును జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ గురువారంఆకస్మిక తనిఖీ చేశారు.
చైర్మన్ మాట్లాడుతూ కథలాపూర్ మండలం లోని విద్యార్థిని, విద్యార్థులకు, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారందరికీ గ్రూప్ I, II, TET కు కావాల్సిన బుక్స్, పుస్తకాలు కాంపిటేటివ్ బుక్స్ , స్థానిక గ్రంధాలయంలో అందుబాటులో ఉన్నట్టు చైర్మన్ తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తో కలిసి నూతన భవనం కొరకు 3-00 గుంటల భూమిని సర్పంచ్ ,వైస్ ఎంపిపి తో కలిసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఏరియా లో పరిశీలించారు..
కథలాపూర్ సర్పంచ్ కంటే సత్యనారాయణ,. వైస్ ఎంపీపీ కిరణ్ రావు, ,లైబ్రరీ ఇన్ చార్జ్ కవిత , మాజీ సర్పంచ్ బి.నారాయణ, కోరుట్ల గౌడ సంఘం అధ్యక్షులు, బొల్లేపల్లి శ్రీనివాస గౌడ్, సాయ గౌడ్, గంగాధర్ గౌడ్, తదితరులు ఉన్నారు.
జగిత్యాల జిల్లా కు అవార్డు !

రాష్ట్ర స్థాయిలో బాంక్ లింకేజీ రుణాలు మరియు తిరిగి చెల్లించు కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రధమ స్థానం లో నిలిచి గ్రామీనాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సందర్భంగా జెడ్పి క్యాంపు కార్యాలయంలో జెడ్పి చైర్ పర్సన్ గా వసంత సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డిఆర్డీవో శ్రీ.వినోద్, ఈ సంద్భంగా వారిని అభినదించిన జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్,
ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్డీవో శ్రీ.సుదీర్, DPM మానిక్ రెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యుక్షురాలు రమ్య, మరియు కోశాధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
పరామర్శలు!

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లిలో గురువారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పలువురు కుటుంబాలను పరామర్శించారు.,
మహ్మద్ అంకూస్ ( 82 ) కుటుంబ సభ్యుల్ని, ఇటీవల దుబాయ్ లో మృతి చెందిన జూపాక అనిల్, కుటుంబ సభ్యులను, అనారోగ్యంతో చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న, పోచంపల్లి లస్మవ్వ, పర్షే రాజవ్వలను, జీవన్ రెడ్డి పరామర్శించారు.

ఎమ్మెల్సీ వెంట గ్రామ సర్పంచ్ , తాటిపర్తి శోభారాణి, కాంగ్రెస్ నాయకులు ,తాటిపర్తి దేవేందర్ రెడ్డి, ఎంపీటీసీ 2 తుమ్మల లచ్చయ్య, వార్డు సభ్యులు చంద్రశేఖర్ గౌడ్ , కో అప్షన్ సభ్యులు హన్మండ్లు, సింగిల్ విండో డైరెక్టర్ సుధీర్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్ప గంగారెడ్డి, బత్తిని సతీష్ గౌడ్, పోచంపల్లి రవి, అవునుటి రవి, సుంకే అంజయ్య , ,బెక్కం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
