సీనియార్టీ సిన్సియర్ టీ, అంకిత భావంతో కష్టకాలంలో పార్టీకి అందించిన సేవలకు ప్రభుత్వం పట్టం కట్టింది
. ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అయ్యోరీ రాజేష్ కుమార్ కు ,మరోసారి అవకాశం కల్పించింది.. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 203, తేదీ.20/052022 న ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు జారీ చేసిన ఉత్తర్వుల్లో వైస్ చైర్మన్ గా, అక్కన్న పెళ్లి సునీల్ కుమార్, తో పాటు మరో 12 మంది కమిటీ సభ్యులుగా నియమించారు. జైన సింగిల్విండో చైర్మన్, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్, మార్కెట్ శాఖకు చెందిన ఇద్దరు అధికారులు, మొత్తం 18 మంది సభ్యులతో కూడిన కమిటీ కాలపరిమితి రెండు సంవత్సరాలుగా కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నూతన మార్కెట్ కమిటీ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
