ధర్మపురి అసెంబ్లీ వాసికి- రాజ్యసభ టిక్కెట్టు!

J.Surender Kumar,

ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి అధికార పార్టీ అభ్యర్థిగా రాజ్యసభ స్థానం తొలిసారి లభించుచున్నది. బుధవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన రాజ్య సభ అభ్యర్థులు ముగ్గురిలో ఒకరు ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మద్దునూర్ స్వగ్రామం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ,సీఎం డి దీకొండ దామోదరరావు, ఒకరు. మరో ఇద్దరు డాక్టర్ బండి పార్థసారథి, వద్దిరాజు రవిచంద్ర ( గాయత్రి రవి ). సీఎం కేసీఆర్ కు గత దశాబ్ద కాలంగా ఆంతరంగిక ఆత్మీయుడిగా దామోదరరావు కొనసాగుతున్నారు.

డాక్టర్ బండి పార్థసారథి,

ధర్మపురి మండలం కొనసాగిన మద్దూరు గ్రామం, నూతన మండలాల ఏర్పాటులో బుగ్గారం మండల పరిధిలో కి చేరింది. గతంలో బుగ్గారం నియోజకవర్గ పరిధిలో ఉన్న, 2009 అసెంబ్లీ పునర్విభజన ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడ్డ ధర్మపురి నియోజకవర్గ పరిధిలోను ఈ గ్రామం కొనసాగుతున్నది.

వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా జిల్లాకు నియోజకవర్గానికి, అపూర్వ అరుదైన అవకాశం లభించడం పట్ల ధర్మపురి ,బుగ్గారం, మండల ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.