. కరీంనగర్ లో….
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మంగళవారం రోజ ఉదయం హైదరాబాద్ నుండి నేరుగా కరీంనగర్ కు చేరుకుని మొదట పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ , జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య , జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి ప్రియాంక తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు స్వాగతం పలికారు.

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్ల పై సమీక్షించారు. మొదట వివిధ కారణాల వల్ల జిల్లాలో ఖాళీ అయిన సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ స్థానాలు, మునిసిపాలిటీల వార్డు మెంబర్ల , వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 2 సర్పంచ్, 4 ఉప సర్పంచ్, 31 వార్డు సభ్యుల స్థానాలు, 2 ఎంపీటీసీ స్థానాలు , ఒక మండల వైస్ ప్రెసిడెంట్,, కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒక కౌన్సిలర్ , స్థానాలు ఖాళీగా ఉన్నాయని జిల్లా అధికారులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన మీదట రానున్న జూన్ మాసంలో వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు ఉన్నందున ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులకు సూచించారు.

తప్పిదాలకు ఆస్కారం లేకుండా, ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్దిo చేశామని, పోలింగ్ స్టేషన్ ల ముసాయిదా జాబితా కూడా ప్రచురించామని అధికారులు తెలియజేసారు. పోలింగ్ స్టేషన్ ల ఏర్పాటులో ఏవైనా అబ్యంతరాలుoటే వాటిని పరిష్కరించి ఈ నెల 24 వ తీదీన పోలింగ్ స్టేషన్ ల తుది జాబితా ప్రచురించాలని, తర్వాత పకడ్బందీగా ఎన్నికలు జరుపుటకు తగిన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనరు సంబందిత అధికారులను ఆదేశించారు.

వారధి మొబైల్ యాప్ ను ప్రారంభించిన కలెక్టర్
…..ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం వారధి మొబైల్ యాప్ కరీంనగర్ ఐటీ హబ్ ఆధ్వర్యంలో రూపొందించడం జరిగిందని, గ్రూప్ 1,2 పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు ఈ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

మంగళవారం కరీంనగర్ ఐటి హబ్ టవర్ లో, టీమ్ -అప్ సంస్థ అధినేత ఎం. కె. చైతన్య, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంకతో కలసి “వారధి సొసైటీ మొబైల్ యాప్” ను జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐ.టి. రంగ విస్తీర్ణంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ,Tier-ll సిటీ లలో కూడా ఐ.టి. ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కరీంనగర్ లో ఐటీ టవర్ ని నెలకొల్పడం జరిగిందని అన్నారు. కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటి సారిగా టీం-అప్ సంస్థ ద్వారా రూపొందించిన యాప్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఉపయోగార్థం మాక్ టెస్ట్, స్టడీ మెటీరీయల్స్, పలు రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఉద్యోగార్థులకు ఈ అవకాశాన్ని ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. ఈ యాప్ ను కరీంనగర్ జిల్లా వాస్తవ్యులే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
టీం-అప్ సంస్థ సీఈఓ ఎం.కే.చైతన్య మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగులను ప్రోత్సహించుటకు వారధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఉపయోగార్థం మొబైల్ అప్లికేషన్ అప్ రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ యాప్ యొక్క సేవలను పొందడానికి ఫోన్ నెంబర్, ఓటిపితో లాగిన్ అవ్వాలని అన్నారు. ఒకవేళ ఇంతకు ముందు వారథిలో మెంబర్ అయినట్లైతే వారి వారధి అకౌంట్లో లాగిన అవ్వాలని అన్నారు. https://play.google.com/store/apps/details?id=com.teamup.varadhi ఈ యాప్ ను ప్లే స్టోర్ నుండి వారధి అని టైప్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, టీం- అప్ సంస్థ కో-ఫౌండర్ ఏ. రంజిత్, వారధి సెక్రటరీ ఆంజనేయులు, మరియు టీం అప్ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.