దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తన రాజకీయ ప్రజా జీవితంలో పదికాలాలపాటు నిలిచిపోయే గొప్ప పనులు చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్సీతాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు, 2వ వర్దంతిని పురస్కరించుకుని మంగళవారం ధర్మపురి పట్టణంలో జువ్వాడి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు స్వగ్రామం తిమ్మాపూర్ లో జువ్వాడి ఇంటిలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.

రాజకీయ జీవితంలో తాను, జువ్వాడి ,సమకాలికులమని అన్నారు. వై ఎస్ ప్రభుత్వంలో ఇద్దరం మంత్రులుగా పనిచేసి రత్నాకర్ రావు చొరవతో,కోరుట్ల లో పశువైద్య కళాశాల, తన పట్టుదలతో జె ఎన్ టి యు కళాశాల, సాధించినట్లు గుర్తుచేసుకున్నారు. జువ్వాడి విద్యాధికులు కానప్పటికినీ, తన సృజనాత్మక ఆలోచనలతో, గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. జిల్లాలోని గోదావరి నది తీరప్రాంత రైతుల సాగునీటి కష్టాలను ఎత్తిపోతల పథకం, ద్వారా తీర్చారని అన్నారు. స్వయంగా రైతుబిడ్డ ఐన రత్నాకర్ రావు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందించి రైతాంగం కు ఊతం అందించేందుకు తపనపడేవారన్నారు.

వరిసాగు పై ప్రస్తుతం ఆస్పష్టమైన విధానం ఇప్పుడు ఉందని అన్నారు. గతంలో పంటవేసింది మొదలుకొని కల్లాల దగ్గరే కొనుగోలు చేసేదాక రైతాంగానికి భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా రత్నకార్ రావు ప్రతీ ఒక్కరినీ పేరుపెట్టి పిలిచేవారని, అంతలా ప్రజలతో మమేకం అయ్యారని అన్నారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్టీ భాద్యులు, రత్నాకర్ రావు తనయుడు నర్సింగరావు మాట్లాడుతూ.. దివంగత రత్నాకర్ రావు నిరంతరం ప్రజల మధ్య వుంటూ, సమస్యల పరిష్కారానికి పరితపించేవారన్నారు. ముఖ్యంగా రైతుల యోగక్షేమాలు తెలుసుకుంటూ, తొలకరి వచ్చిందని ,విత్తనాలు వేయాలని సూచనలు అందించి, పంటలకు నీటి సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేసేవరన్నారు. అనంతరం పంట చేతికొచ్చాక దిగుబడి పై ఆరాతీసి వారిలో ధైర్యం నింపేవారన్నారు. తాను ఆయన దారిలో పయనిస్తూ తండ్రిగారి ఆశయసాధనకై కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్ రావు కుమారులు కృష్ణారావు, చంద్రశేఖర్ రావు,.కస్తూరి శ్రీనివాస్, వేముల రాజు,.రఫియోద్దీన్, ఆశెట్టి శ్రీనివాస్, షబ్బీర్, సీపతి సత్యం, కుంట సుధాకర్, మొగిలి, తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల లో….
కోరుట్ల పట్టణంలో మున్సిపల్ అవరణలో అభివృద్ధి ప్రదాత, జననేత స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు గారి 2 వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయులైన కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు మరియు కాంగ్రెస్ శ్రేణులు నివాళులు అర్పించారు

జువ్వాడి రత్నాకర్ రావు , రాజకీయ ప్రస్థానం తిమ్మాపూర్ సర్పంచ్ గా మొదలై, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దేవాదాయ, ధర్మాదాయ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన, ఆయన చేసిన సేవలు మరువలేనివి అని, ఉన్నతమైనవి అని, గుర్తు చేసుకుంటూ, కోరుట్లకు .వెటర్నరీ యూనివర్సిటీ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, ద్వారా కోరుట్లలోని కొన్ని వేల పేద కుటుంబాలకు సొంతింటి కళ నెరవేర్చిన మహానుభావుడు స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు అని . అన్నారు.
ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గనికి మరియు జువ్వాడి రత్నాకర్ రావు గారికి మధ్య ఉన్న అనుబంధాన్ని, జువ్వాడి రత్నాకర్ రావు గారూ చేసిన సేవలను పలువురు కొనియాడారు..

కోరుట్ల పట్టణ మరియు మండల కాంగ్రెస్ అద్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజం ల అధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు, మరియు సిబ్బందికి అన్నదానం నిర్వహించారు… అన్నదానం కార్యక్రమాన్ని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు , ప్రారంభించడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పేరుమండ్ల సత్య నారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సత్యం రావు, కోరుట్ల మాజీ జెడ్ పి టి సి కొంతం రాజు, 13వ వార్డ్ కౌన్సిలర్ తిరుమల వసంత, పట్టణ ఉపాధ్యక్షులు ఎం ఏ నయీమ్, ప్రధాన కార్యదర్శులు తుపాకుల భాజన్న, బన్న రాజేశం, కార్యదర్శి మ్యాకల నర్సయ్య, సహాయ కార్యదర్శులు ఎంబేరి సత్యనారాయణ, చిటిమెల్లి రంజిత్ గుప్త, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, మెట్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంజిరెడ్డి, .బేజ్జరపు శ్రీనివాస్,, మండల ఎస్ సి సెల్ అధ్యక్షులు మంథని గంగనర్సయ్య , మాజీ కౌన్సిలర్ వహీద్, మాజీ కౌన్సిలర్ హమీద్ మాజీ సర్పంచ్ రెబ్బాస్ రాజన్న మాజీ ఉపసర్పంచ్ విఠల్ రవీందర్ రెడ్డి పి ఏ సి ఎస్ మాజీ ఛైర్మెన్ రవీందర్ రావు , షకీల్, తోడేటి శంకర్, వొలపు గంగాధర్, చిలివేరి విజయ్, రమేష్ , అర్షద్, జాగిలం భాస్కర్, పుల్లా రెడ్డి, సోషల్ మీడియా ఇంఛార్జి ముహమ్మద్ నసీర్, సరీకెళ్ళ నరేష్, కల్లూరు దనని లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
నరసింహుని దర్శించుకున్న జీవన్ రెడ్డి !
మంగళవారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని పట్టభద్రుల ఎమ్మెల్సీ T.జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం పక్షాన శ్రీస్వామి వారి శేషవస్త్ర, ప్రసాదం ద సీనియర్ అసిస్టెంట్, అలువాల శ్రీనివాస్ అందించి సన్మానించారు .

దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు , జగిత్యాల జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మన్ కుమార్, మరియు అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.