గీట్ల ముకుందరెడ్డి అజాతశత్రువు-మంత్రి ఈశ్వర్!

మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి అజాతశత్రువు అని, ప్రజాస్వామ్యవాది ఎన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుంద రెడ్డి విగ్రహాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని, కూనారం రోడ్డులో  మంత్రి కొప్పుల ఈశ్వర్  ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, బిరుదు రాజమల్లు, కటకం మృత్యుంజయం, ఈద శంకర్ రెడ్డి, వేముల రామ్మూర్తి, గీట్ల సవితా రెడ్డి, రాజేందర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, జెడ్పిటి సిలు గంట రాములు, తిరుపతి రెడ్డి, బండారి రామ్మూర్తి, సత్యనారాయణ రెడ్డి, ఈర్ల కొమరయ్య, గొట్టేముక్కుల సురేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జాకోటియా  తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

జలకాలు ఆడిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్!

రాయికల్ మండల బోర్న పల్లి గ్రామంలో రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో  ₹  3.20కోట్ల తో నిర్మించిన చెక్ డ్యాం ను  ఆదివారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సందర్శించి మత్తడి పారుతున్న దృశ్యాన్ని చూసి నాయకులతో కలిసి జలకాలాటాలు ఆడారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  కళ నీళ్లు, నిధులు, నియామకాలు అని అందులో భాగంగానే సాగు నీరు రైతులకు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి  అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఉత్తర తెలంగాణలో కొంత నీటి కరువు ఉండేదని నేడు భూగర్భ జలాలు పెరగడం వల్ల రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భూగర్భ జలాలు పెరిగిన విషయాన్ని సెంట్రల్ వాటర్ మిషన్ మరియు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారని అన్నారు. ముఖ్యమంత్రి  ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టే విధంగా  రైతుల భూమి నష్ట పోకుండా తక్కువ దూరంలో చెక్ డ్యాం లను నిర్మించి భూగర్భ జల మట్టం పెరగడానికి, నీటి వసతి ఏర్పడ దానికి కృషి చేయటం జరిగిందన్నారు. 

నిండు వేసవిలో మత్తడి పారుతున్నాయాని అన్నారు.మెయిన్ కెనాల్ కు తొంబరావు పెట్ వద్ద D52 వద్ద గౌరవ ముఖ్యమంత్రి చొరవతో నేను కోరగానే తూము ని ఏర్పాటు చేయడం వల్ల తొంబారావు పేట, పోరుమల్ల, రాయికల్,చేర్ల కొండాపూర్, మైతాపూర్, ఇటిక్యాల,ముటపల్లి,కొత్తపేట బోర్న్ పల్లి ఇలా  14 గ్రామాలకు నీటి వసతి ఏర్పడిందని 25 కోట్ల వరకు నిధులు మంజూరు చేయడం. జరిగిందని 35 కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉండడం, తో ఒక జీవ నది లా కనిపిస్తుందని అన్నారు.  కాలేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ కాలంలో పూర్తి చేసి రివర్స్ పంపింగ్ విధానం ద్వారా వరద కాలువను జీవనదిలా మార్చిన ఘనత ముఖ్యమంత్రి దని అన్నారు. ముఖ్యమంత్రి  రైతు పక్షపాతి కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని రైతుబంధు, 24 గంటల కరెంటు ,ఎరువులను, అందుబాటులో ఉంచడం నకిలీ విత్తనాలు తయారు చేసే, వారిపై పిడియాక్ట్ పెట్టడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, సకాలంలో రైతు ఖాతాలో నగదు జమ చేయడం ,రైతు వేదికలు,వ్యవసాయ అధికారుల నియామకం, ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టి రైతులను రాజును చేసే దిశగా ముఖ్యమంత్రి  కృషి చేస్తున్నారని  ఎమ్మెల్యే అన్నారు..ప్రతిపక్ష నాయకులు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ రైతులను రాజకీయంగా వాడుకుంటున్నారని రైతులు గమనించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అశ్విని జాదవ్, రాయికల్ మున్సిపల్ చైర్మన్  మోర హనుమండ్లు, మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్, ,ఇంతియాజ్,
సర్పంచ్ లత రాజు, ,ఉప సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ కవిత,.గ్రామ శాక రవీందర్,.ఐలయ్య,.ఆనంద్ రావు,.మల్లారెడ్డి, ఆంజనేయులు, రాజేందర్, రాహుల్,సర్పంచులు, ఎంపీటీసీ లు,కౌన్సిలర్ లు,రైతులు,
తదితరులు, పాల్గొన్నారు.


16 న జాతీయ డెంగ్యూ దినోత్సవం !


మే 16 తేదీన జరుగు జాతీయ డెంగ్యూ దినోత్సవంలో భాగంగా అన్ని ప్రాధమిక మరియు పట్టన ఆరోగ్య కేంద్రాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పుప్పల శ్రీధర్ కోరారు .పారిశుధ్య నివారణే డెంగ్యూ నివారణకు మార్గమని ప్రతి శుక్రవారం మాత్రమే కాకుండా ప్రతిరోజు డ్రై డే పాటించాలని, తద్వారా దోమలు పుట్టకుండా చేసినట్లయితే డెంగ్యూ వ్యాధిని నివారించ వచ్చని అన్నారు.
     రానున్న వర్షాకాలంలో జిల్లా ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దోమలు పుట్టకుండా చేయవచ్చునని దోమల వచ్చే వ్యాధులైన మలేరియా ,డెంగ్యూ ,చికున్గున్యా , ఫైలేరియా మరియు మెదడువాపు లాంటి వ్యాధులు రాకుండా చేయవచ్చని తెలియజేసారు .కావున ప్రజలందరూ దోమల యెడల అప్రమత్తంగా ఉండాలని కోరారు
       తప్పని సరిగా డ్రై డే పాటించాలని ,పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని యిండ్లలోని కూలర్లలోని నీటిని ఎప్పటి కప్పుడు మార్చుకోవాలని కోరారు .కొబ్బరి బొండాలు ,పూలకుండీలు ,టైర్లు రోళ్ళు ,పాడుబడిన ప్లాస్టిక్ సామానులలో నీరు నిల్వ లేకుండా చూడాలని ఈ విషయాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని కోరారు .
    వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కీటక జనిత వ్యాధులపై ప్రజలలో పూర్తి అవగాహన కల్పించాలని కోరారు
   జ్వరము ,తలనొప్పి ,వళ్లునొప్పులు చర్మముపై ఎర్రటి దద్దురులు ఉంటె వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు .
    అందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే కీటకాల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా చేయవచ్చని తెలియజేసారు .
     కావున మే 16 న జరుగు డెంగ్యూ నివారణా దినోత్సవంను విజయవంతం జేయాలని ఆయన కోరారు

.

విద్యుత్ ADE దుర్మరణం

కోరుట్ల పట్టణ శివారులోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద  ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో, రెండు కార్లు ఢీ., కోరుట్ల విద్యుత్ ఏడి నీలి శ్రీనివాస్ మృతి., కథలపూర్ మం. భూషణ్ రావు పేట కు కు చెందిన మరొకరికి తీవ్ర గాయాలు., వివరాలు తెలియాల్సి వుంది..