ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలి – మంత్రి ఈశ్వర్


ఎస్సీ సంక్షేమ శాఖ, ఎల్.ఎం.కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరియు గ్రూప్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ యువతకు ధర్మపురిలో అందిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పి చైర్ పర్సన్ నవ వసంతం సోమవారం సందర్శించారు

.

పోటీ పరీక్షలకు శిక్షణ పొందిన వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో శిక్షణ కేంద్రాల్లో అందించే స్థాయిలో పూర్తిగా ధర్మపురి లో అర్హులైన నిరుద్యోగ పేద యువతకు ఉచితంగా కల్పిస్తున్నామని అన్నారు. త్వరలో సంబంధించిన యాప్ ను అందరికి అందిస్తామన్నారు, .ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, 3 నెలల పాటు చదువుపై శ్రద్ధ వహించాలన్నారు.

అనంతరం మంత్రి వారితో కలిసి భోజనం చేశారు. వసతి సౌకర్యాలు, శిక్షణ తీరుతెన్నులు, గూర్చి శిక్షణ పొందుతున్న వారిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.


కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు !


ధర్మపురి మండలం రాజారాం గ్రామ, ఎస్సీ మహిళలకు SC కార్పోరేషన్ ఆధ్వర్యంలో, కుట్టు మిషన్ శిక్షణ, స్వయం ఉపాధి, జ్యూట్ వస్తువుల తయారీ, మరియు కూరగాయల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, తదితర ఉపాధి అవకాశాలపై ధర్మపురిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ నిర్వహించారు.
త్వరలో రాజారం గ్రామంలో కుట్టు శిక్షణ సెంటర్ ని ఏర్పాటుచేసి, కుట్టు మిషన్ లను అందించడం జరుగుతుందని మంత్రి వారికి వారికి వివరించారు..