ఉపాధి కోసం విదేశాలకు… ముఖ్యముగా గల్ఫ్, మలేసియా లాంటి 18 ఈసీఆర్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల కోసం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవాసి సహాయతా కేంద్రం (మైగ్రంట్స్ హెల్ప్ డెస్క్) ను బుధవారం ప్రారంభించారు.
ఎయిర్‌పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ .(టామ్‌కామ్) లు సంయుక్తంగా ఈ హెల్ప్‌డెస్క్‌ని ఏర్పాటు చేశాయని ప్రవాస వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ, స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ,రాణి కుముదిని ఈ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు. టాంకాం అధికారి నాగభారతి, ఎన్నారై అధికారి,చిట్టిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమెరికా వెళుతున్న విద్యార్థి , బేతి యశ్వంత్ రెడ్డి, తో కలిసి వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి, బుధవారం సాయంత్రం ఎయిర్ పోర్టులోని, ఇంటర్నేషనల్ డిపార్చర్స్ వద్ద ఉన్న ఈ ,హెల్ప్ డెస్క్ ను సందర్శించారు. టాంకాం అధికారి నాగభారతి, హెల్ప్ డెస్క్ ఇంచార్జి, ఫణి కుమార్ లను ఈ సందర్బంగా ఆయన అభినందించారు.

సిజేరియన్ వద్దు – సాధారణ ప్రసవాలే ముద్దు
జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రిలలో సాధారణ ప్రసవాలు పెంచాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ అన్నారు. ప్రతి ఒక్కరికి సాధారణ ప్రసవాల పై పూర్తి అవగాహన ఉండాలని అని, ఇందులో భాగంగా ప్రభుత్వ, మరియు ,ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆడిట్ నిర్వహిస్తున్నామని అన్నారు..
జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్, మరియు మాతాశిశు విభాగం అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి సిజేరియన్ ఆపరేషన్ లపై, ఆడిట్ నిర్వహించి రికార్డులను పరిశీలించారు. రికార్డులు ఉన్నా వాటి నిర్వహణ సరిగా లేదని గమనించి, సరి చేసుకోమని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే గర్భిణీలకు, మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా సాధారణ కాన్పుల పై అవగాహన కల్పించాలని అన్నారు. మొదటి కాన్పు సమయంలో ఆపరేషన్ చేయాలని కుటుంబసభ్యులు పట్టుబడితే, భవిష్యత్తులో వచ్చే నష్టాలు గూర్చి వివరించాలని అని, ఇందుకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలని ప్రైవేటు ఆసుపత్రి వైద్యురాలి నీ వారు ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు చేయాలి !
రైతుల వద్ద ధాన్యం నిరోధాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ముత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి కరుణాకర్ రెడ్డి మల్లేష్ యాదవ్ నారాయణ రెడ్డి మోహన్ రెడ్డి లు కలెక్టర్ కు వినతి పత్రంలో పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు సజావుగా సాగేల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ఇటీవల కురిసిన అకాల వర్షాల వాళ్ళ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన, రంగు మారిన ధాన్యన్ని కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని. రైస్ మిల్లర్లు ధాన్యం త్వరగా దింపుకునే చూడాలని, అలాగే మిల్లర్లకు ధాన్యం దింపుకోవడానికి తగిన చోటు గోడౌన్ లు లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మార్కెట్ గోదాముల్లో ధాన్యం త్వరగా నిలువలు ఉంచేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, తదితర సమస్యలను వినతిపత్రంలో వారు పేర్కొన్నారు.

అతడిని అరెస్టు చేశారు !
బీర్పూర్ మండలం లోని తుంగూర్ గ్రామం లో మంగళవారం అధికారులు హతమార్చడానికి యత్నించిన నిందితుని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వివాదంలో వున్న దారి పై విచారణ కు వెళ్ళిన MPO రామరాజు, ఎస్సై, అధికారుల పై పెట్రోల్ తో దాడికి నిప్పంటించి న ఘటనలో నిందితుడు చుక్క గంగాధర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపిన డిఎస్పీ రత్నాపురం ప్రకాష్ తెలిపారు.