జగిత్యాలలో శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి!

జగిత్యాల పట్టణంలో శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
సోమవారం జగిత్యాల పట్టణ శ్రీ రాధ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ శ్రీ మదన గోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలకు శ్రీ శ్రీ శ్రీ త్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఆలయానికి వచ్చారు.   స్థానిక ఎమ్మెల్యే దంపతులు, సంజయ్ కుమార్ రాధిక, మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు డా భోగ శ్రావణి ప్రవీణ్, ఫలితాలు ఇయర్ స్వామిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు.


అభివృద్ధి పనులకు భూమిపూజ!


పట్టణ 1వ వార్డ్ లో 14 లక్షల తో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.,పట్టణములో పలు వార్డులలో లబ్ధిదారులకు  కల్యాణ లక్ష్మీ, సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్,.స్థానిక కౌన్సిలర్ కుసరి అనిల్,,కమిషనర్ స్వరూప రాణి, DE రాజేశ్వర్, కౌన్సిలర్ లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


డ్రైవర్ల ర్యాలీ!


జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో సోమవారం డ్రైవర్ లో కార్మికులు వాహనాల యజమానులు,
ఆటో, జీప్, టాటా మ్యాజిక్ లాంటి వాహనాలపై 714 జీవోను రద్దు చేయాలని పాత బస్ స్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కార్యాలయ అధికారికి వినతిపత్రం  అందించారు.


దంపతుల బలవన్మరణం !


జగిత్యాల జిల్లా రూరల్ మండలంలోని రఘురాములకోట గ్రామంలో సోమవారం విషాదకర సంఘటన వెలుగుచూసింది .ఆర్థిక ఇబ్బందులతో సింహరాజు మునిందర్ ,సులోచన అనే వృద్ద దంపతులు బలవన్మరణం చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ!


రాయికల్ మం. మూటపెల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిచిన వరి ధాన్యంను పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించి రైతాంగాన్ని, ధైర్యం చెప్పి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం  రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
రూరల్ మం. చల్గల్, పట్టణంలో గత కొన్ని రోజులుగా పలువురు మృతి చెందారు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం పరామర్శించి ఓదార్చారు

.

రాజన్న సిరిసిల్ల జిల్లా :


వేములవాడ ఆలయం వద్ద 28 రోజుల బాలుడి కిడ్నాప్ ను చేదించిన పోలీసులు., వరంగల్ లో కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకొని బాలుణ్ణి క్షేమంగా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ..


పరామర్శ!


రూరల్ మండలంలోని వడ్డెర కాలనీ బీజేపీ సీనియర్ నాయకుడు బోధస్ వెంకటేష్  తండ్రి గారు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ జిల్లా నాయకుడు చిలుకమర్రి మదన్ మోహన్,
వీరివెంట బీజేపీ మండల అధ్యక్షుడు అన్నవేణి వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు తొగిటి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్, గ్రామ నాయకులు రాజలింగం, లింగన్న తదితరులు ఉన్నారు.