జగిత్యాల ‘షి’ టీమ్ కు అభినందనలు


ఉత్తమ పనితీరు కనబరిచిన  జగిత్యాల జిల్లా షీ టీం ను ఉమెన్ సేఫ్టీ వింగ్ DG  స్వాతి లక్రా అభినందించారు.
మహిళల భద్రత విషయంలో, మరియు ఈవ్ టీజింగ్ నిరోధానికి, కళాశాలల్లో,  స్కూల్లో మహిళ భద్రత, గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళలను, విద్యార్థినీ లను, చైతన్య పరిచినందుకు జిల్లా షీ టీం బృందాని ఉమెన్ సేఫ్టీ వింగ్ DG స్వాతి లక్రా శుక్రవారం   హైదరాబాద్ లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో. అభినందించి బహుమతి ని అందజేశారు.  బహుమతిని జిల్లా షీ టీం సభ్యులు  ఇన్స్పెక్టర్  కిరణ్ కుమార్, .SI వెంకటరాజం,.A.S.I వాలి బేగ్,  మహిళా కానిస్టేబుల్ పూజిత అందుకున్నారు.
ఉత్తమ పనితీరు కనబరిచి జిల్లా షీ టీం  పేరును రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషిచేసిన షీ టీం సభ్యులను జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ , ప్రత్యేకంగా అభినదించారు.


వైద్యురాలు మృతి !


మెడికల్ పిజీ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.,
నిజాంబాద్ జిల్లా కేంద్రంలో  ప్రభుత్వ ఆసుపత్రిలో, పిజీ స్టూడెంట్, అనుమానాస్పద మృతి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో గైనకాలజీ వార్డులో డ్యూటీ చేస్తున్న  P.G స్టూడెంట్, శ్వేత…
వాష్ రూమ్ కి వెళ్లి ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో వెళ్లిన  సహచర విద్యార్థినులు. అప్పటికే చనిపోయిన శ్వేత, గుర్తించారు.ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది…


15 న ఉచిత హెల్త్ క్యాంపు!


లయన్స్ క్లబ్ ఆప్ మెట్ పల్లి  వారు నిర్వహిస్తున్న ఫ్రీ కార్డియాలజీ.  హెల్త్ క్యాంప్ 15-05-2022  ఆదివారం  ఉదయం 10:00 గంటలకు  వాసవి గార్డెన్స్ లో నిర్వహించనున్నారు. ఉచితంగా  Heart Rate , RBS ,.SPO2,.ECG , .2D  ECHO  పరీక్షలు. Dr అన్నారపు నితిన్  మరియు వారి డాక్టర్ల, బృందంచే నిర్వహించనున్నారు.  మెట్ పల్లి ,మరియు పరిసర గ్రామాల ప్రజలు దీనిని వినియోగించుకోగలరు.
వివరాలకు సంప్రదించండి. లయన్ పోలీస్ శ్రీనివాస్ (ప్రెసిడెంట్)  9848040678.
సబ్బని చంద్రశేఖర్ (సెక్రటరి ) 9989027432 సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

వైభవంగా జగ్గసాగర్ కొండస్వామి బ్రహ్మోత్సవాలు..


ఈ నెల 18 న బుధవారం రాత్రి స్వామి వారి రథోత్సవం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలోని అతి పురాతన దేవాలయమైన కొండస్వామి  (శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి) బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగితున్నాయి. అందులో భాగంగా శుక్రవారం రెండో రోజు  కొండస్వామి కల్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది.  ఉదయం స్వామి వారికి అభిషేకం , ధ్వజారోహణం , నిర్వహించారు.  గ్రామం నుండి స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఆభరణాలను ఎదుర్కోలు జరిపారు. ఆనవాయితీగా బండలింగపూర్ గ్రామభివృది కమిటి సభ్యులు కల్యాణానికి, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, తీసుకవచ్చారు.  ఇరు గ్రామాల వారు కలిసి స్వామి వారిని ఎదుర్కోలు జరిపారు. పూజ కార్యక్రమాలు నిర్వహించి, కల్యాణాన్ని, అంగరంగ వైభవంగా జరిపారు. 

ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, బండలింగపూర్ గ్రామ భివృది కమిటీ సభ్యులు, చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన బుధవారం రాత్రి  రథోత్సవం (రథం పై స్వామి వారి పర్యటన) ఉంటుందని కొండ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు, జగ్గసాగర్ గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు తెలిపారు.


14 న అమ్మవారి శోభాయాత్ర


అక్కెపల్లి నర్సింహుల బండ వద్ద 15న జరిగే గాయత్రి యజ్ఞం సందర్భంగా చెన్నూరు లో  శోభాయాత్ర ఉంటుంది. తేదీ : 14.05.22 శనివారం  సాయంత్రం 6 గంటలకు స్థానిక శివాలయం, నుంచి ఊరేగింపు ప్రారంభం అవుతుంది. శోభాయాత్ర చెన్నూర్ పట్టణ పురవీధుల గుండా అక్కెపల్లి వరకు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారిని అక్కెపల్లికి చేర్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని  చెన్నూరు గాయత్రీ యజ్ఞ నిర్వహణ కమిటీ, ప్రకటనలు పేర్కొన్నారు.