జూన్ 4 లోపు అక్రిడేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి- కలెక్టర్ రవి!

జగిత్యాల, మే 24:- 
జిల్లాలో 2022-24 సంవత్సరానికి గానూ రెండేండ్ల వ్యవధి గల అక్రిడిటేషన్ కార్డు ల జారీకి పాత్రికేయుల నుండి దరఖాస్తులను, జూన్ 4లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని   కలెక్టర్ జి.రవి ఒక ప్రకటన లో తెలిపారు.
2019 సంవత్సరంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డు ల గడువు జూన్ 31 వ, తేదీ నాటికి ముగుస్తున్న దృష్ట్యా కొత్త గా అక్రిడిటేషన్ కార్డు ల జారీకి అర్హులైన జర్నలిస్టు ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుట్లు తెలిపారు.
జిల్లాలోని జర్నలిస్టులు మే,25 నుంచి, సమాచారశాఖ ఆన్లైన్ వెబ్ సైట్ https:/ipr.telangana.gov.in/ ను సందర్శించి మెనూ క్రింద చూపించే Media Accreditation లింక్ ను క్లిక్ చేసి జర్నలిస్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫారం లో అడిగిన ఫోటోలను, విద్యార్హతలు, డాక్యుమెంట్ లను జత చేయాలన్నారు.
ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ కు జూన్ 4 వ తేదీ తుది గడువు అని తెలిపారు.
జగిత్యాల జిల్లాలోని అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానికి మీడియా జర్నలిస్ట్ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

ధర్మపురి మండలంలోని  కమలపూర్, నక్కలపేట, దమ్మన్నపేట లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైతు వేదిక జిల్లా అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు సమయంలో తరుగు పేరిట, కోత విధిస్తూ రైతులను నిట్ట నిలువునా దోపిడీకి గురి చేస్తున్న, రైస్ మిల్లరపై , వెంటనే చర్యలు తీసుకోవాలని  అన్నారు,  రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు,  రైతులు పండించిన సన్నపు వడ్లను, ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్దేశించిన అన్ని నిబంధనలు పాటిస్తూ, తూర్పారబట్టి శుభ్రం చేసినప్పటికీ కొనుగోలు సమయంలో క్వింటాలుకు 5 ,నుండి 8 కిలోల వరకు కట్ చేస్తూ రైస్ మిల్లర్లు రైతులను నిట్టనిలువునా ఆర్థికంగా దోపిడికి గురిచేస్తున్నారని  ఆరోపించారు . రైస్ మిల్లర్ల అక్రమాలను , దోపిడిని అడ్డుకోవాల్సిన స్థానిక ప్రజా ప్రతినిధులు , అధికారులు కూడా రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు నష్టం చేకూరుస్తూ బహిరంగంగా దోపిడీకి పాల్పడుతూ అన్నదాతలను ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని  ఆరోపించారు,                          
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రైతు  నాయకులు వేముల కర్ణకర్, వేముల విక్రమ్ , జాజాల రమేష్,  కొట్టాల మోహన్ , కాటిపెల్లి రాజశేఖర్,  నాగేశ్వర్ రెడ్డి, క్యాతం సాయి రెడ్డి, పడిగల తిరుపతి రెడ్డి,మేకల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు

కొండగట్టు లో 600 మంది పోలీసు సిబ్బంది తో బందోబస్తు.


కొండగట్టు అంజన్న ఆలయంలో జరిగే హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ  సింధు శర్మ ఆదేశాల మేరకు డీఎస్సీ ప్రకాష్ పర్యవేక్షణ  లో 600 మంది పోలీసు సిబ్బంది తో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మల్యాల సీఐ రమణ మూర్తి తెలిపారు.
10 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు మిగిలిన వారు వివిధ హోదా సిబ్బంది ఉత్సవాలు ముగిసే వరకు విధులు నిర్వహిస్తారు..
కొండపైకి ఎలాంటి వాహనాలు అనుమతిలేదని తెలిపారు.