నేను కన్న కలలు సాకారం చేసుకున్నాను మంత్రి ఈశ్వర్!

.ధర్మపురిలో ఆదివారం “Dharmapuri -E-Classroom” పేరుతో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ,ఎల్.ఎం.కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్, ఆధ్వర్యంలో ప్రభుత్వోద్యోగాలకు సంసిద్ధమయ్యే యువతకు శిక్షణా తరగతులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు

. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సుమారు లక్షా 35వేల ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. ఐటి రంగంలో బెంగళూరును, తలదన్ని హైదరాబాద్ నగరం పరుగులు పెట్టడంలో మంత్రి, కెటిఆర్ కృషి అభినందనీయమన్నారు. తనకు సింగరేణిలో ఉద్యోగం వచ్చిన తర్వాత ఓపెన్

యూనివర్సిటీ నుంచి, డిగ్రీ పూర్తి చేశానని, గుర్రం స్వారీ చేయాలనుకున్న కలను నెరవేర్చుకున్న. ఎమ్మెల్యేగా గెలవాలనుకుని, వరుసగా ఆరు సార్లు గెలిచిను, చైనా వెళ్లాలనుకుని, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట 11 రోజులు పర్యటించానని గుర్తు చేసుకున్నారు.

కలలు కనడమే కాదు, వాటిని తప్పక నెరవేర్చుకోవడమే లక్ష్యంగా, ధ్యేయంగా, క్రమశిక్షణ, పట్టుదలతో .సాధించుకోవాలని యువతకు మంత్రి హితవు పలికారు. సుమారు 91వేల ఉద్యోగాల భర్తీకి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయని. పేద వర్గాలకు చెందిన యువత ఈ ఉద్యోగాలు పొంది జీవితంలో గొప్పగా స్థిరపడాలనే సదాశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉచిత కోచింగ్ సెంటర్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారని కొప్పుల వివరించారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మంత్రి యువతను కోరారు.
ఈ శిక్షణా తరగతులకు సుమారు 1200.మంది యువతీ,యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్.ఎం.కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్, ఛైర్ పర్సన్ స్నేహలత, ప్రముఖ ఇంగ్లీష్ ప్రొఫెసర్, తిరుపతి కుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు, చిరంజీవిలు యువతకు స్ఫూర్తిదాయక సందేశాలిచ్చారు.

డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మునిసిపల్ ఛైర్ పర్సన్ సంగి సత్తమ్మ, కమిషనర్ రమేష్, పంచాయతీ రాజ్ ఇ.ఇ.రహమాన్, టిఆర్ఎస్ నాయకుడు అయ్యోరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.