కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి- కలెక్టర్ రవి!

జగిత్యాల, మే- 12:- జిల్లాలో పకడ్బందీగా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధించిన అధికారులను ఆదేశించారు.
గురువారం ఆయన కథలాపూర్ మండలంలోని, బొమ్మెన, తాన్ద్రి యాల , సిరికొండ మేడిపల్లి మండల కేంద్రం, కొండాపూర్ , కోరుట్ల మండలంలోని ,మోహన్ రావు పేట, ఎకిన్పూర్, గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, కొనుగోలు కేంద్రాలు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతులతో కలెక్టర్ చర్చించారు, రైతులు ఇంటి వద్ద ధాన్యం ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని కలెక్టర్ సూచించారు.


రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలులో వేగం పెంచాలని సెంటర్ ఇంఛార్జిలను ఆదేశించారు ,నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యము 17% తేమశాతం వచ్చినవి, ప్యాడి క్లినింగ్ చేసిన పిదప ఎక్కువమంది హమాలిలను ఏర్పాటు చేసుకుని లారీల లో లోడ్ చేసుకుని మిల్లులకు తరలించాలని తెలియజేశారు.
ధాన్యం కేంద్రాలలో ఉన్న ధాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా గా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం లోని రిజిస్టర్ లను కలెక్టర్ తనిఖీ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ప్రణాళికబద్ధంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించడానికి టోకెన్ సిస్టం అమలు చేయాలని , టోకెన్ సిస్టం ప్రకారం తేమ వచ్చిన తరువాత తూకం వేయాలని తెలిపారు.
ధాన్యం కొనుగోలు సెంటర్లకు అవసరం మేరకు గన్ని బ్యాగులు, టార్పారిన్లు, లారీలను అధిక మొత్తంలో సప్లై చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులుకు ఆదేశాలు జారీచేశారు.


సెంటర్లులో వివరాలు ఆడిగితెలుసుకుని రిజిస్టర్లు తనిఖీ చేశారు. తూకంలో ఇబ్బందులు లేకుండా చూడాలని, మిల్లులలో ఎప్పటికప్పుడు దాన్యం అన్లోడింగ్ చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు.
ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఆర్.డి.ఓ కొరుట్ల వినోద్ కుమార్, డి.ఆర్.డి.ఓ.ఓ, డి.సి.ఎస్.ఓ, డి.సి.ఓ., ఎం.పి.డి.ఓ.లు., తహసీల్దార్లు సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సింగిల్విండో చైర్మన్ ఎం సి చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.