విభజన హామీల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, మంత్రి కేటిఆర్ దేశంలో ఉన్న సమస్యలను విడిచి విదేశాలకు తిరుగుతున్నారని, రైతులు, రైతు కూలీలు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లు లాంటి వారని, నెలఖారులోగా ధాన్యాన్ని కొనుగోళ్లు పూర్తి చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు, జగిత్యాల పట్టణంలో గురువారం ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకోని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత వరంగల్లో జరిగిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి చేసే పనులను వివరించారని, వరంగల్ డిక్లరేషనన్ను టిపిసిసి ఆదేశాల మేరకు గ్రామా గ్రామాన రైతు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి రైతులు, రైతుకూలీలకు తెలియజేస్తామన్నారు. రైతులకు మద్దతు కల్పించడం హక్కుగా చట్టబద్ధత కల్పిస్తామని, రుణమాఫీ అమలు చేస్తామని, రైతును ఏ పరిస్థితుల్లోనేనా ఆదుకోవడానికి పంట భీమా పథకాన్ని అమలు చేస్తూ ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రైతాంగం, రైతు కూలీలు రెండు కళ్ల లాంటివారని, రైతుల, రైతుకూలీల సంక్షేమానికి ఏ కార్యక్రమాలు చేపడుతామో రైతులు, రైతుకూలీలకు రైతు రచ్చబండ ద్వారా తెలియజేస్తామన్నారు. కాంగ్రెస్పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింతా బలోపేతం చేస్తామని, కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా ప్రతి ఏడాది నిధులను తగ్గిస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు ప్రతి రోజు రూ.257 .కూలీ వేతనం
అందాల్సి ఉండగా రూ.150-160 కూలీ వేతనం కూడా అందడం లేదన్నారు. .గత ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీలకు ఎండకాలంలో సమ్మర్ అలవెన్స్ అందించేవని, ప్రస్తుతం సమ్మర్ అలవెన్స్,, రవాణాచార్జీలు అందించడం లేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసిఆర్ అసెంబ్లీ ప్రకటించి రెండు మాసాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం, ఆస్తులను, సమకూర్చడం కాదని, ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యమన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి అనుగుణంగా పనులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేస్తామని, దీంతో రైతులకు ఆర్థిక వెసులుబాటుతో పాటు, కూలీలకు ఉపాధి లభిస్తుందన్నారు. రైతు భీమాను రైతులకే కాకుండా రైతు కూలీలకు ప్రాధాన్యతగా అమలు చేస్తామని, రైతు రచ్చబండ కార్యక్రమంతో రైతులకు కాంగ్రెస్పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలు గురించి వివరిస్తామని, రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో, 29న సారంగాపూర్ మండలం రేచపల్లిలో రైతు రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులు పడుతున్నా ఇబ్బందులను జిల్లా యంత్రాంగం దృష్టికి
తీసుకెళ్లిన స్పందన లేదన్నారు.
బీజేపీకి మద్దతు ఇస్తున్నారు !
తెరాస అన్ని విధాలుగా బిజెపికి మద్దతు ఇస్తుందని, రాష్ట్రపతి ఎన్నిక, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ తదితర బిల్లుల్లో మద్దతు ఇచ్చారని, 2014 నుండి 2019 వరకు బిజెపితో కలిసి ఉండి కాళేశ్వరానికి, జాతీయ హోదా తీసుకురాలేకపోయారని, కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వడంతో బిజెపి వివక్షత చూపిస్తే, తెరాస పార్టీ అసమర్థత కన్పిస్తుందన్నారు. సీఎం కెసిఆర్ ఉద్యమ స్ఫూర్తి ఏం అయిందని? , నాడు ఉద్యమ కాలంలో ఏలాంటి ఆయుధం లేకున్నా పోరా చేసిన ఆయన నేడు ప్రభుత్వమనే యుధం ఉన్న ఎందుకు పోరాటం చేయడం లేదన్నారు? . కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్తును ఫణంగా పెట్టి తెలంగాణను ఏర్పాటు చేస్తే, నేడు తెరాస పార్టీ తెలంగాణను అప్పుల ఊభిలోకి నెట్టారని, దీనికే తెలంగాణ సాధించుకున్నామా అని ప్రశ్నించారు. మంత్రి కేటిఆర్ దేశంలోని హక్కులను సాధించుకోకుండా విదేశాలకు తిరుగుతున్నారని, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆందోళన కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు అడ్లూరి
లక్ష్మణకుమార్, టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి, బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్, గిరి నాగభూషణం, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ,కల్లెపెల్లి దుర్గయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.