మాజీ సీఎం జలగం – జయంతి వేడుకలు


జగిత్యాల పద్మ నాయక కళ్యాణ మంటపంలో మాజీ ఏపీ సీఎం,మాజీ కేంద్ర మంత్రి జలగం వెంగల్ రావు గారి 100శత జయంతి కార్యక్రమంలో భాగంగా వారి చిత్ర పటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన మంత్రులు హరీష్ రావు గారు,కొప్పుల ఈశ్వర్ గారు,ఎమ్మేల్యే లు డా.సంజయ్ కుమార్ గారు,విద్య సాగర్ రావు గారు,ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ,వెలమ సంఘ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు ,KDCC జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు,.సంఘ మాజీ అధ్యక్షులు పురుషోత్తం రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీపతి రావు గారి కూతురు వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు


కొండగట్టు దర్శనం !


జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్న ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్బంగా ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు..స్వామికి ఇరువురు ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు


ట్రెజరీ ఏర్పాటు చేయండి


ధర్మపురి మండల కేంద్రములో ట్రెజరీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, జగిత్యాల జిల్లా కేంద్రంలో TSGLI కార్యాలయం ఏర్పాటు చేయాలని మరియు ZPGPF ఖాతాలు ఉమ్మడి జిల్లా నుండి జగిత్యాల జిల్లా కు బదిలీ చేయాలని ఈ రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ & వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి వినతి పత్రం అందజేసిన PRTUTS జగిత్యాల జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, బోయినపల్లి ఆనందరావు ఉపాధ్యాయులు ఉన్నారు.


మంత్రికి ఘన స్వాగతం !


ఈరోజు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పర్యటన లో భాగంగా ధర్మపురి నియోజకవర్గ పలు మండలాల్లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు మరియు తెరాస శ్రేణులు పాల్గొన్నారు.


అకాల వర్షం నష్టం పై సమీక్ష !


వరి ధాన్యం కొనుగోలు, అకాల వర్షం తో తడిసిన ధాన్యం వివరాలపై టేలి కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఆర్.డి.ఓ.లు డి.ఏ.ఓ.,డి.ఎం. సివిల్ సప్ప్లై, డి.ఆర్.డి.ఓ., తహసీల్దార్లు వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.