బసవేశ్వరుడు గొప్ప మానవతావాది, సంస్కర్త అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు అన్నారు. శ్రీ మహాత్మ బసవేశ్వర 889 వ జయంతి వేడుకలను జగిత్యాల జిల్లా కేంద్రంలో వీరశైవ సమాజం నాయకులు ఘనంగా జరుపుకున్నారు.
జిల్లా కేంద్రం లోని బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి, కమిషనర్ స్వరూప రాణిలు బసవేశ్వరునికి నివాళులార్పించారు.

ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం బసవేశ్వరుడు కష్టపడ్డారని తెలిపారు., ఆర్థిక అసమానతలను రూపుమాపిన మానవతావాది బసవేశ్వరుడని కొనియాడారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ బసవేశ్వరుడు 12 వ శాతబ్దంలో “అనుభవమఠం” ఏర్పాటు చేసి అందులో ప్రజలందరూ కూర్చొని సమస్యలపై చర్చించుకునే విధంగా కృషిచేసిన సంఘ సంస్కర్త బసవేశ్వరుడని పేర్కొన్నారు. అనుభవమఠం స్ఫూర్తితోనే పార్లమెంట్ భవననిర్మాణం జరిగిందని జీవన్ రెడ్డి వివరించారు., అనుభవమఠం వివిధ రకాల సమస్యలను పరిష్కారం చూపిన మహనీయుడని తెలిపారు.
ఆనాడు శివాలయాల్లో స్త్రీ లకు ప్రవేశం లేకపోవడంతో బసవేశ్వరుడు ఎన్నో కార్యక్రమాలు చేసి తుదకు స్త్రీ, పురుషులకు సమానంగా ప్రవేశం కల్పించిన మహనీయుడు బసవేశ్వరుడని జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి కొనియాడారు., ఆర్థిక సమానత్వంకోసం పోరాడిన మేధావి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌ న్సిలర్లు దుర్గయ్య, పంభాల రాంకుమార్, బాలే శంకర్, భోగ ప్రవీణ్, తాటిపర్తి దేవేందర్ రెడ్డి, గుంటి జగదీశ్వర్, వీరశైవ సమాజం నాయకులు కంది కైలాసం, గాజుల నాగరాజు, నాగేందర్, వీరయ్య, శివకుమార్, నిరంజన్, చరణ్, ఆనందరావు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అలయ్ బలయ్..

రంజాన్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని మజీద్ ఏ ఫాతిమా, ఈద్గా, ఖిల్ల, మరియు టీఅర్.నగర్ ఈద్గా లో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి తో కలిసి అలయ్ బలయ్ చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ.శ్రావణీ, వ మైనారిటీ అధ్యక్షులు, ముజ్జు భాయ్, వైస్ చైర్మన్ గోలి.శ్రీనివాస, స్థానిక కౌన్సిలర్ పంబల.రామ్ నాయకులు బాలేశంకర్, ఆనందరావు, రాజ్ కుమార్, తదితరులు వున్నారు.,

సీఎం సహాయ నిధి !

ఈరోజు జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల్ తుంగూర్ గ్రామానికి చెందిన కందుకూరి పోశవ్వ కు CM రిలీజ్ చేక్కు రూ”.60.000/_ MLC తాటిపర్తి జీవన్ రెడ్డి సహాయ సహకారం తో వచ్చిందని కాంగ్రెస్ నాయకులు గుడిసె జితేందర్ యాదవ్ అన్నారు. తుంగూర్ సర్పంచ్ గుడిసే శ్రీమతి జితేందర్ యాదవ్ లబ్ధిదారుకు అందించారు.
పరామర్శ !

బుగ్గారం మండలం శెకల్ల గ్రామంలో రెండు రోజుల క్రితం జగిత్యాల సిగ్మా హాస్పిటల్ లో మరణించిన కత్తరపాక మధుకర్ కుటుంబాన్ని పరమార్శించిన మంగళవారం MLC తాటిపర్తి జీవన్ రెడ్డి , DCC అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. వారి వెంట గొల్లపల్లి సర్పంచ్ ముస్కు ఇశాంత్ రెడ్డి, ఇస్రాజ్పల్లి సర్పంచ్ చిర్ర గంగాధర్, భీంరాజ్ పల్లి సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, గాలి పల్లి వెంకన్న, చౌలమద్ది శ్రీనివాస్ ,.కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి

జగిత్యాల జిల్లా మండల కేంద్రమైన బుగ్గారం లో, ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి పై, ఆదివారం జరిగిన హత్యాయత్నం, విడిసి వైస్ చైర్మన్ నక్క చంద్రమౌళి అక్రమ నిర్బంధానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మదన కుమారస్వామి ఆరోపించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పిటిసి బాధినేని రాజేందర్, అండదండలతోనే ఈ నిర్బంధాలు, దాడులు – హత్యాయత్నం, సుపారి హత్యల ప్రయత్నం కొనసాగుతోందని పౌర హక్కుల సంఘం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్ ఎదుట చుక్క గంగారెడ్డి పై జరిగిన దాడిని, దళితుడు నక్క చంద్రమౌళి అక్రమ నిర్బంధాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ లు, దళిత లిబరేషన్ ఫ్రంట్ లు తీవ్రంగా ఖండించాయి. మంగళవారం బుగ్గారం గ్రామంలో ఈ సంఘాల నేతలు పర్యటించి గంగారెడ్డి పై జరిగిన హత్యాయత్నం, దళిత బిడ్డ నక్క చంద్రమౌళి అక్రమ పోలీస్ నిర్బందాలపై నిజనిర్ధారణ చేపట్టారు. ఈ నిజనిర్దారణలో, విలేఖరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు నార వినోద్, సహాయ కార్యదర్శి బొడ్డుపెళ్లి రవి, సహాయ కార్యదర్శి గడ్డం సంజీవ్ కుమార్ కోశాధికారి పోగుల రాజేశం, ఈసీ మెంబర్ లు కడ రాజన్న, మోటపలుకుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను వివరించిన ఈవో.!

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా వివిధ ప్రదేశాల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు మంగళవారం వివరించారు. స్వామీజీ . స్థలంలో లో కళ్యాణ మండపం, రెండో సారీ మంత్రి విడుదల చేసిన 50 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులు వివరాలు తెలిపారు సభ్యులు ఇందారపు రామయ్య, సురేందర్, పల్లెర్ల సురేందర్, వేముల నరేష్ తదితరులు పాల్గొన్నారు
వేములవాడ ఆలయ ఈవో కు నోటీసులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (ఈఓ) కార్యనిర్వహణాధికారి కి హైదరాబాద్ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని విశ్వహిందూ పరిషత్ వేములవాడ శాఖ తరఫున పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంపై మానవ హక్కుల కమిషన్ విశ్వహిందూ పరిషత్ తరపున ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మానవ హక్కుల కమిషన్ స్పందించి తేదీ 5-07-2022 రోజున మానవహక్కుల కమిషన్ ఎదుట ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.
పండుగ రోజు విషాదం !
పట్టణంలోని బైపాస్ రోడ్డు 17 వ వార్డ్ జాంబాగ్ కు చెందిన యువకులు పొచం పాడ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి. మంగళవారం మధ్యాహ్నం సరదాగా పోచం పాడ్ కు కార్ లో వెళ్లిన నలుగురు యువకులు, ఈతకు వెళ్లి అమాన్, సమీర్, అనే యువకుల మృతి., రంజాన్ పండుగ రోజే యువకులు మృతి చెందడం తో ఇరు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకన్నాయి.