మంటలకు – మాస్టర్ ప్లాన్? అధికారులపై దాడి దారుణం!

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం  తుంగుర్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం అధికారులపై పెట్రోల్ స్ప్రే చేసి మంట పెట్టడానికి నిందితుడు మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం..


గత కొన్ని సంవత్సరాలుగా తుంగుర్ గ్రామం బస్టాండ్. అనుకొని కొందరి ఇళ్లల్లోకి దారి ఉంది. ఈ దారి బీర్పూర్ నుంచి క మ్మునూరు బ్రిడ్జి వరకు ప్రధాన రహదారి మధ్య నుంచి కుడివైపుకు దాదాపు పది కుటుంబాల నివాస గృహాలకు దారి ఉంది ( ఇంటర్నల్ రోడ్డు)

నిందితుడు దారి రాకపోకలకు అడ్డంగా కర్రలు, ఇనుప ,సామాను వేసి అడ్డుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనేకసార్లు రెవెన్యూ ,పోలీస్ ,పంచాయతీ అధికారులు ఈ దారి వివాదంలో పరిష్కారానికి సంఘటన స్థలానికి వెళ్లి  నిందితుడికి, ఫిర్యాదు దారులకు నచ్చచెప్పారు.

ఆయన సమస్య కొలిక్కి రాలేదు. జగిత్యాల ప్రజావాణిలో నివాస గృహాల వారు దారి విషయమై ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం ఎం ఆర్ ఓ ఎం పి ఓ డి ఎల్ పి ఓ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థలాన్ని పరిశీలిస్తున్నారు..


పక్కా ప్లాన్ ?
పంట పొలాలకు క్రిమిసంహారక మందులు స్ప్రే  చేసే యంత్ర పరికరం లో దాదాపు 2,3 లీటర్ల మేరకు పెట్రోల్ పోసి. ముందస్తుగానే పరిసరాల పై పెట్రోల్  స్ప్రే  చేసినట్టు సమాచారం.. విచారణకు వచ్చే అధికారులపై గుమిగూడి జనంపై కూడా స్ప్రే చేసి లైట్ తో వెలిగించాలి యత్నంలో ఉన్నట్టు ఆ ప్రాంత ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.

పంచాయతీ అధికారి రామకృష్ణ రాజు కు గాయాలు కాగా మిగతావారు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. జగిత్యాల  డిఎస్పి ప్రకాష్ ,రూరల్ సిఐ ,హుటాహుటిన  బీర్పూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని సంఘటన వివరాలు తెలుసుకుంటున్నారు. గాయపడిన అధికారిని జగిత్యాల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించారు మెరుగైన వైద్యం కోసం, వైద్యుల సూచన మేరకు అవసరమైతే హైదరాబాద్ కు తరలించాల్సి గా ఎమ్మెల్యే వైద్యులను ఆదేశించారు.