మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ – మంత్రి ఈశ్వర్!


పండుగ’ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది.  పండగ, మానవాళికి హితాన్ని బోధిస్తుంది.  ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ  సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.  ఇదే రోజున .అక్షయ తృతీయ పర్వదినం  హిందువుల పండుగ రావడం, ఇది వైశాఖ మాసంలో ప్రకాశవంతమైన శుక్లపక్షం మూడవ తిథి (చంద్రుని రోజున)  ఒకేరోజు రెండు మతాలకు చెందిన పండుగలు ఒకే రోజున కలిసిరావడం  ప్రస్తావనార్హం.

రంజాన్ పర్వదినం సందర్భంగా  మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి పట్టణ లో పలువురు ముస్లింల సోదరుల ఇండ్లకు వెళ్లి, కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి వారితో కలసి భోజనాది కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ హిందూ-ముస్లింల మత సామరస్యానికి ప్రతీక అంటూ వారితో ముచ్చటించారు.


పరామర్శ !


ధర్మపురి కి చెందిన సంగనబట్ల దనుంజయ శర్మ ,( ఈవో దేవాదాయ శాఖ)  గత కొన్ని రోజుల క్రిందట గుండె పోటుతో మరణించరు. వారి కుటుంబాన్ని మంత్రి  ఈశ్వర్ మంగళవారం పరామర్శించారు. DCMS చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ,మాజీ మార్కెట్ అయ్యోరి చైర్మన్ రాజేష్ ,  మార్కెట్ వైస్ చైర్మన్ సునీల్ కుమార్  సంగనబట్ల రామక్రిష్ణయ్య , తెరాస నాయకులు కిరణ్మయి సాంబమూర్తి , మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షుడు సంగి శేఖర్  తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

వసతి, సౌకర్యాల, పరిశీలన !


ప్రభుత్వ ఉద్యోగాల  కోసం పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న, నిరుద్యోగ యువతీ యువకులకు, కల్పిస్తున్న వసతి సౌకర్యాల. శిక్షణ కేంద్రాన్ని, మంత్రి కొప్పుల ఈశ్వర్  వసతి సౌకర్యాల గురించి శిక్షణ పొందుతున్న వారిని అడిగి తెలుసుకున్నారు.


ప్రభుత్వోద్యోగాల కోసం సంసిద్ధమయ్యే యువతకు ధర్మపురి కేంద్రంలో  “Dharmapuri -E-Classroom” పేరుతో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్, ఏర్పాటు చేసిన  శిక్షణా తరగతులు మే 1.వ  తేదీన  ప్రారంభించారు. ప్రారంభించిన  . కొనసాగుతున్న శిక్షణ తరగతుల తీరుతెన్నులు  పరిశీలించి, కనీస మౌలిక సదుపాయాలను  మంత్రి పరిశీలించారు. భోజన ,వసతులను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై శిక్షణ పొందుతున్న యువతీ యువకులు సంతృప్తి వ్యక్తం చేసారు..

రాజరాజేశ్వరస్వామిని సన్నిధిలో మంత్రి  దంపతులు!


వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు  మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయానికి చేరుకున్న మంత్రి కొప్పుల దంపతులకు అధికారులు, వేద పండితులు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

మంత్రి తో పాటు జగిత్యాల జెడ్పీ వైస్ ఛైర్మన్ హరిచరణ్ రావు, సిరిసిల్ల జెడ్పీ చేర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి,  మున్సిపల్ ఛైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు,  ఆలయ కార్యనిర్వహణాధికారి, రమాదేవి పాల్గొన్నారు. మంత్రి దంపతులను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు ఘనంగా వేద ఆశీర్వచనం చేసి స్వామివారి  ప్రసాదాన్ని అందించారు