పరమ పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన ఈ నెలంతా కూడా భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్నారు-
ఈ మాసంలో భక్తిప్రపత్తులు,ఏకాగ్రత,ఆత్మను క్రమపద్ధతిలో ఉంచుకుని,నిష్ఠ, క్రమశిక్షణలతో ఉపవాస దీక్షలు కొనసాగించి రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న సందర్భంలో మంత్రి ఈశ్వర్ వారికి ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు
ఓర్పు ,సహనం, ఐకమత్యం, దయ, దాతృత్వం, శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం, కష్టసుఖాలను పరస్పరం పంచుకునే సద్గుణాలను ఈ పవిత్ర మాసం నేర్పింది అని పేర్కొన్నారు..మత సామరస్యానికి తెలంగాణ పెట్టింది పేరు . అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తున్నారు, శాంతి భద్రతలు వర్థిల్లుతున్నాయి-అన్నారు

.
కులమతాలు,ప్రాంతాలు,భాషలు,జాతులకు అతీతంగా ప్రజలందరి భద్రత, సంక్షేమం, వికాసానికి కెసిఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
మైనారిటీల సంక్షేమానికి దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నరు
మైనారిటీల సంక్షేమం, సముద్ధరణకు కెసిఆర్ ప్రభుత్వం ఈ 8 ఏండ్లలో 11వేల 610కోట్లు ఖర్చు చేసింది- అన్నారు
రంజాన్ పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నం,పేదలకు దుస్తులు పంపిణీ ,మసీదులు, ఈద్గాల అభివృద్ధికి, మరమ్మత్తులకు నిధులిస్తున్నం-
204 గురుకులాల ద్వారా, మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నం, విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు గాను ₹ 20లక్షల చొప్పున 1940 మందికి.₹ 341కోట్లను ప్రభుత్వం అందజేసింది మంత్రి ఈశ్వర్ వివరించారు.
10వేల మంది ఇమామ్, మౌజంలకు ₹ 5 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నం- పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు షాదీ ముభారక్ ద్వారా రూ.1,00,116 లు ఉచితంగా అందజేస్తున్నం- ఉర్దూ భాషకు పూర్వవైభవం తెచ్చేందుకు గాను రెండో అధికార భాషగా గుర్తించి గౌరవిస్తున్నం అన్నారు. వేసవి తాపానికి గురి కాకుండా శ్రద్ధాసక్తులు, భక్తిప్రపత్తులతో ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవలసిందిగా, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లాలని అల్లాను ప్రార్థించవలసిందిగా ముస్లిం సమాజాన్ని -మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు.
బారసాల..

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేట గ్రామ తెరాస నాయకులు దాసరి స్వామి గారి కుమారుడి బారసాల కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్ పాల్గొని చిన్నారి ఆశీర్వదించారు..
గ్రంధాలయం ప్రారంభోత్సవం !

75 లక్షల వ్యయంతో బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన కాళోజీ శాఖ గ్రంథాలయ భవనాన్ని,మరియు నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు, డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య , మంచిర్యాల జిల్లా జడ్పి చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి , మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోళీ కేరి ఇతర అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మార్కెటింగ్ శిక్షణ
పోలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల అధ్వర్యంలో మామిడి కోత, అనంతరం యాజమాన్యం, మార్కెటింగ్ మరియు ఎగుమతులపై శిక్షణ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ , జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ . ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బందు సమితి అధ్యక్షులు వెంకట్ రావు, ADR ఉమాదేవి, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, AMC ఛైర్మెన్ దామోదర్ రావు, అగ్రికల్చర్, .హర్టికల్చర్ DAO లు సురేష్, ప్రతాప్ సింగ్,. PACS ఛైర్మెన్ లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, రైతు బందు సమితి నాయకలు బాల ముకుందం, నక్కల రవీందర్ రెడ్డి, ,జంబర్తి శంకర్, శాస్త్రవేత్తలు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

శంకుస్థాపన!
.పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంట పల్లే గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమంలో భాగంగా RMP, PMP ల భవన నిర్మాణాల శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు