నరసింహ జయంతి ఉత్సవాలకు- మంత్రి ఈశ్వర్ ను ఆహ్వానించిన కమిటీ సభ్యులు!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి నవరాత్రి ఉత్సవాల కోసం, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కార్యనిర్వహణాధికారి సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం  ఈ నెల 7న ప్రారంభం కానున్న స్వామి వారి ఉత్సవాలు మంత్రి కొప్పుల ఈశ్వర్ దేవస్థానం పక్షాన కమిటీ సభ్యులు, కార్యనిర్వహణాధికారి గురువారం ఆహ్వానించారు.


తేది 07-05-2022 నుండి 14-05-2022 వరకు జరుగు శ్రీ స్వామి వారి నృసింహ నవరాత్రి ఉత్సవాలకు గాను గౌరవ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారిని నవరాత్రి ఉత్సవాలకు రావాల్సిందిగా  కరీంనగర్ లో గల క్యాంప్ కార్యాలయంలో కలసి శ్రీ స్వామివారి శేషవస్త్ర, ప్రసాదం, ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి, సంకటాల శ్రీనివాస్ , రెనవేషన్ కమిటి సభ్యులు శ్రీ ఇందారపు రామన్న , గందె పద్మ , అక్కనపల్లి సురేందర్,వీరవేణి కొమురయ్య,చుక్కరవి,ఇనుగంటి రమ,గునిశెట్టి రవీందర్,పల్లెర్ల సురేందర్,గుంపుల రమేష్, వేముల నరేష్ ,జైన రాజమౌళి ,సంగం సురేష్ పాల్గొన్నారు.


ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను

ఆలయ కమిటీ సభ్యులు, కార్యనిర్వాహణాధికారి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు స్వామి వారి శేష వస్త్రాన్ని,  ప్రసాదం  అందించి, ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

కలెక్టర్ గుగలోత్ రవి

ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి,  ఎస్పీ సింధు శర్మ ను

అడిషనల్ ఎస్పీ రూపేష్ దేవస్థానం పక్షాన కమిటీ సభ్యులు కార్యనిర్వహణాధికారి కలసి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.


వెన్నముద్దల గండి లో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట


బీర్పూర్ మండలం రంగసాగర్ గ్రామం పరిధి వెన్నముద్దల గండి  లో శ్రీ వెంకటేశ్వర స్వామి,ఆలయం  నిర్మాణం  విగ్రహాల ప్రతిష్ట పూజా కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి.   

గ్రామ సర్పంచ్ స్వప్న సాగర్, ఉప సర్పంచ్ మేడిశెట్టి మల్లయ్య ,వార్డు సభ్యులు, కోఆప్షన్ గ్రామ పెద్ద లు,  గ్రామస్తులు  సమిష్టిగా కలసి విరాళాలతో తో  గుడిని నిర్మించుకొని ప్రతిష్ట  చేస్తున్నారు. 

వెన్నముద్దల గండి ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చని చెట్లు, గల గల పారే జలపాతాలు, పరవశం చెంది ప్రకృతి శోభకు నిలయం   గా చూపిస్తుంది వన్యప్రాణుల సంచారం రాయికల్ బీర్పూర్ మండల ప్రజలకు ఈ ప్రాంతం భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందవచ్చు అని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .