రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం హైదరాబాదులో మంత్రి నివాసంలో కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని వినతి ఇచ్చారు.
జగిత్యాలలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ల ఇండ్ల మౌలిక సదుపాయాల కోసం, నాలుగున్నర కోట్ల రూపాయలను మంజూరు చేయాలని, అన్ని గ్రామ పంచాయతీల నూతన భవనాలు, శిథిలావస్తలో ఉన్న గుల్లపెట్, సింగరావు పేట్, మైతాపూర్, బోర్న పల్లి, గ్రామాలకు నూతన పంచాయతీ భవనాలు మంజూరు చేయాలని, గ్రామాలలో సిసి రోడ్లకు, లింక్ రోడ్లకు దాదాపు 15 కోట్ల నిధులు అవసరం అవుతాయని నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. నిధులు మంజూరుకు సానుకూలంగా స్పందించిన మంత్రికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

:జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ గురువారం అం అంసాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, జిల్లా విద్యాశాఖ అధికారి , ఇంజనీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రెవెన్యూ సర్వీసులు!
కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసులు మరియు ఇతర అంశాల పై రెవెన్యూశాఖ అధికారులు లతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహిస్తున

జగిత్యాలలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు !
జగిత్యాల పట్టణంలోని నడి బొడ్డున ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీశ్రీశ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం జిల్లా కేంద్రంలో దివ్య క్షేత్రంగా నేటి వరకు నిత్యం,దూపదీప నైవేద్యాలతో వెలుగుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని చలువ పందిర్లు, విద్యుత్ దీపాలతో పాటు అన్ని ఏర్పాట్లను అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు.
కాగా శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాలస్వామి కొలువై ఉన్నారు. నిత్యం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేక కార్యక్రమాలు..
గురువారం నుంచి ఈ నెల 17వ తేదీ మంగళవారం వరకు ఆలయంలో ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలను వేద పండితుల, ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు.
మొదటి రోజు గురువారం రోజున రక్షాబంధన్, ఉ”5గం” సుప్రభాతం, ఉ”6గం” గ్రామ ప్రదక్షిణ, సా”4గం నుండి రాత్రి8 గం” వరకు విశ్వకేన్స్ నరాధన, రక్షాబంధన్ దీక్షా స్వీకరణ తో పాటు శుక్రవారం, కల్యాణం ఉ”7గం”ల నుండీ భేరితాడనం, దేవతాహ్మనం, నవగ్రహ హోమారభం, తీర్థప్రసాద వితరణ, సా”5:00గం”లకు ధ్వజారోహణం, గోధూళికా, స్వామివారి కల్యాణం, రాత్రి అగ్నిప్రతిష్ఠ, హావనం, బలిహారణతో పూర్తి కాగా, మరుసటి రోజు ఆదివారం ఉ”7గం”లకునిత్యహోం, నరసింహ స్వామి జయంతి సందర్భంగా నవకలశ స్నపనం, చందనోత్సవం, సా”5గం”ల నుండి 8గం ల వరకు వసంతోత్సవం, వేద సదస్సు, తులా భారం కార్యక్రమంతో పాటు సోమవారం ఉ”7గం”ల నుండి నిత్యహోమం, నవగ్రహ హోమం , బలిహారణ, సాయంత్రం వేదసదస్సు, సా”సహస్ర దీపోత్సవం, పూలంగి సేవా, నవగ్రహ పాశుపాతం, కార్యక్రమం కాగా మంగళవారం రోజున ఉ”7గం”ల నుండి 12 గం”ల వరకు నిత్యహోమం, నవగ్రహ హోమం, అష్టోత్తర శతకలషాభిషేకం పూర్ణాహుతి, విమనోరి కుంభాభిషేకం, సా”7 గం”ల నుండి 8 గం” వరకు రంగవల్లి అలంకారం, ద్వాదశవారపూజ, సప్తవర్ణ ప్రదక్షిణ, ఏకాంత సేవా, ఆచార్య ఋత్విక్ సన్మాన కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తుందని శ్రీమాన్ నంబీ వేణుగోపాల చార్య కౌశిక తెలిపారు.
బోయినపల్లి మండలం లో విషాదం..

తల్లి, ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకి ఆత్మహత్య, కుటుంబ కలహలతో ఇంట్లో గొడవపడి బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన అనూష, తనతో పాటు గణ (3), మణి 18 మాసాల కొడుకుతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వర్గాలు వివరించారు.