ప్రశాంతంగా పదవతరగతి పరీక్షలు కలెక్టర్ రవి!

జగిత్యాల మే 23:- ప్రశాంత వాతావరణంలో జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరుగు తున్నాయని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు. సోమవారం 10వ తరగతి పరీక్షల ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్, ప్రైవేటు ఎ.సి.ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు.
జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 11820, మంది విద్యార్థులు హాజరవుతున్నారని, 67 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం లో సీసీ కెమెరాలు, ఏర్పాటు చేసామని కలెక్టర్ అన్నారు.


ప్రతి పరీక్ష కేంద్రం లో కనీసం మందులతోపాటు, ఎఎన్ఎం ఏర్పాటు చేశామని, జిల్లాలోని ఒక సీనియర్ అధికారి ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇంఛార్జిగా నియమించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి 10వ తరగతి విద్యార్థులను సన్నద్ధం చేశామని కలెక్టర్ అన్నారు.
జిల్లాలో పదవతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నియంత్రించేందుకు, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సిట్టింగ్ స్క్వాడ్, ఏర్పాటు చేశామని, సీనియర్ అధికారులతో కలిసి ఏర్పాటుచేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్, అధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారని కలెక్టర్ అన్నారు.
జిల్లా వైద్యాధికారి జగన్మోహన్ రెడ్డి , ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు కలెక్టర్ వెంట ఉన్నారు.


ప్రజావాణిలో 36 దరఖాస్తులు !


జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఐ.ఎం.ఏ హల్ నందు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై 36 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ జి. రవి స్వికరించారు.


వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష !


సోమవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా అధికారులతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కన్వర్జేన్సి సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీమతి బి.ఎస్. లత, ఇంచార్జి అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా అధికారులు , ఏ.ఓ. కలెక్టరేట్ తదితరులు పాల్గొన్నారు.


స్విమ్మింగ్ పూల్ ప్రారంభం !


జిల్లా కేంద్రంలోనీ వివేకానంద మినీ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ , కలెక్టర్ రావి నాయక్ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రవణీ, మున్సిపల్ కమిషనర్ ,స్వరూప రాణి, జిల్లా క్రీడా శాఖ అధికారి నరేశ్, పట్టణ కౌన్సిలర్స్ ,నాయకులు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..


జాతర ఉత్సవం !


సారంగాపూర్ మండల లక్ష్మి దేవిపల్లి గ్రామంలో సౌడాలమ్మ జాతర కార్యక్రమాలో జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్,. తదితర నాయకులు పాల్గొన్నారు తదితర నాయకులు పాల్గొన్నారు


ముగింపు కార్యక్రమం!


ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల పోలాస వారి అధ్వర్యంలో జాతీయ సేవా పథకం NSS ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ పాల్గొన్నారు వ్యవసాయ కళాశాల
విద్యార్ధులు ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్ ను పరిశీలించారు .వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్. నరేందర్ రెడ్డి, విద్యార్థి వ్యవహారాల ఇంచార్జి డాక్టర్ ఓదెల సంపత్, ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చంద్రశేఖర్, సత్యనారాయణ, ఎల్ల గౌడ్, ,జెడ్పీటీసీ మహేష్, ,సర్పంచ్ గంగాధర్, అంతర్గం ఎంపీటీసీ భూపెల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నారాయణ,నాయకులు మల్లేశం, తదితరులు పాల్గొన్నారు


ధర్మపురి మండలం లో…


మండలం లోని నాలుగు పరీక్ష కేంద్రాల లో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 692 మంది విద్యార్థులకు గాను 689 మంది విద్యార్థులు హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైన ట్లు మండల విద్యాధికారి బత్తుల భూమయ్య తెలిపారు. ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 171 కి 169 మంది, గర్ల్స్ బాలికల ఉన్నత పాఠశాల లో 170 కి 169 మంది, మగ్గిడి లో 189 మందికి 189, చైతన్య భారతి పాఠశాల లో 162 కి 162 మంది మొత్తం 692 మందికి గాను 689 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు.


నీటివసతి కల్పించిన కౌన్సిలర్ !


జక్కు. పద్మ రవీందర్ 11 వ వార్డ్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో , నేటి నుంచి జరుగుతున్న మూడు సెంటర్లలో 10 వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులకు వేసవి కాలాన్ని దృష్టితో చల్లటి నీటి వసతిని ఏర్పాటు చేశారు.