పహాడీషరీఫ్ పనులు వేగవంతం చేయండి మంత్రి ఈశ్వర్ !

హైదరాబాద్ చారిత్రాత్మక జహంగీర్ పీర్, పహడీషరీఫ్, మౌలాలి దర్గాల అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు..మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి శుక్రవారం
హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో జరిపిన సమీక్షా సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, కార్యదర్శి అహ్మద్ నదీమ్, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్, మేనేజింగ్ డైరెక్టర్ కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు, సుమారు రెండున్నర గంటల పాటు సమీక్షా జరిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి పనుల కోసం 4 ఎకరాలు సేకరించడం గురించి రంగారెడ్డి జిల్లా కలెక్టరు తో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.


నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న అనీసుల్ గుర్భా,చారిత్రాత్మక మక్కా మసీదులో కొనసాగుతున్న మరమ్మత్తుల గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మక్కామసీదు పనులను నెల రోజుల్లో,అనీసుల్ గుర్భాను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి హామీనిచ్చారు.
కోకాపేటలో, ప్రతిపాదిత క్రిస్టియన్ భవన్, రాజస్థాన్ లోని అజ్మీర్ లో అషూర్ ఖానా నిర్మాణాలకు .సంబంధించి నెలకొన్న అడ్డంకులను తొలగించే విషయమై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కొప్పుల Wakf Board కు చెందిన ఆస్తులను లీజుకిచ్చే విషయమై సమగ్ర నివేదిక రూపొందించాల్సిందిగా మంత్రి ఈశ్వర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రభుత్వోద్యోగాల భర్తీ కోసం పెద్ద ఎత్తున వెలువడుతున్న నోటిఫికేషన్ల విషయమై మంత్రి ప్రస్తావిస్తూ, మైనారిటీ యువత ఓపెన్ కేటగిరీలో కూడా గొప్పగా రాణించే విధంగా అత్యుత్తమ శిక్షణ ఇప్పించాల్సిందిగా అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు

ధాన్యం కలాల్ల లో కలెక్టర్


. సకాలంలో జిల్లాలో నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధించిన అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం లోని పోలాస , జాబితా పూర్ , గొల్లపల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ మార్కెట్, చిల్వకోడూర్, వెల్గటూర్ మండలంలోని శాఖాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.