పాల ఉత్పత్తిదారులకు న్యాయం చేయండి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా పాల ఉత్పత్తిదారుల కు న్యాయం జరగడం లేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాల ఉత్పత్తి దారుల ప్రోత్సాహకానికి పాల ఉత్పత్తిపై ప్రతి లీటర్ పాలకు రూ4/రూపాయల రాయితీ కల్పించగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహింపబడుతున్న పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం, వారు  KARIMNAGAR MILK PRDUCER COMPANY దాదాపు లక్ష మంది సబ్యులకు సంబంధించి 4/ రూపాయల రాయితీ గత  (3)  మూడు సంవత్సరంల నుండి చెల్లించకపోవడం దారుణం అన్నారు. ఈ అంశంపై సోమవారం కరీంనగర్ జిల్లా లో  ప్రజవాణి లో పాల ఉత్పత్తి దారులతో కలసి ఎమ్మెల్సీ వినతి పత్రం అందించారు.  ప్రత్యేకంగా చొరవ తీసుకుని కనీసం జూన్. 2వ తేదీ రోజు తెలంగాణ ఆవిర్భావం రోజు నాటికి. పాల ఉత్పత్తిదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని చర్యలు చేపట్టాలని ఇప్పించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులను కోరారు.

సైబర్ మోసానికి గురి అయితే 1930 లేదా 100 కి పిర్యాదు చేయండి.  ఎస్పీ శ్రీమతి సింధుశర్మ !

సైబర్ నేరగాళ్ళ వలలో పడి ఎవరైనా నగదును నష్టపోతే వెంటనే సైబర్ హెల్ప్లైన్ నంబర్లయిన 1930 లేదా డయల్ 100 కు చేయవచ్చని లేదా(www.cybercrime.gov.in) వెబ్ సైట్ ద్వారా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని  జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ ప్రకటనలో పేర్కొన్నారు. తక్షణ  ఫిర్యాదుతో పోగొట్టుకున్న నగదును తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది..ఫిర్యాదు అందిన తరువాత సంబంధిత పోలీసు అధికారులు త్వరితగతిన పరిశీలించి, ధృవీకరించి అట్టి విషయాన్ని బ్యాంకులకు మరియు  ఏ వాలెట్ ద్వారా నగదును కోల్పోయారో  ఆ యాజమాన్యానికి పంపి కోల్పోయిన నగదును నేరగాళ్లకు చెందకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పేర్కొన్నారు.
👉   తక్కువ వడ్డీ కి రుణాలు అని ఎవరైనా కాల్/మెసేజ్ చేస్తే నమ్మకండి. గుర్తింపు లేని ఎటువంటి లోన్ అప్లికేషన్ లలో లోన్ తీసుకోకండి, బాధపడకండి.
👉 కస్టమర్ కేర్ నెంబర్ కోసం సంబందిత వెబ్సైట్ లోనే వెతకండి గూగుల్ లో కాదు.
👉 బ్యాంక్ వినియోగదారుల సేల్ఫోన్లకు వచ్చే ఒన్ టైం పాస్వర్డ్ ( ఓ.టి.పి )ని ఇతరులకు తెలపకుండా జాగ్రత పడటంతో పాటు, ఆపరిచిత వ్యక్తులతో OTP పంచుకోరాదు.
👉 బ్యాంక్ వినియోగదారులకు ఎట్టి పరిస్థితులోను బ్యాంక్ అధికారులు సెల్ఫోన్ ద్వారా సంప్రదించరు. ఇది దృష్టిలో  వుంచుకోని వినియోగదారులు బ్యాంకుల అధికారులమని వచ్చే ఫోన్కాల్స్కు ఎలాంటి సమాధానం ఇవ్వరాదు.
👉 బ్యాంక్ రుణాల పేరుతో ఎవరైనా అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్ ద్వారా అడిగే వ్యక్తిగత అనగా బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డు మరియు తమ వ్యక్తిగత సమాచారాన్ని తెలపవద్దు.
👉 ఓలెక్స్, క్విక్కర్ లాంటి వెబ్సైట్ల్లో అమ్మే వస్తువులు, వ్యక్తులను చూడకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవిలు జరపవద్దు.
👉 ఆపరిచిత వ్యక్తుల నుండి సెల్ఫోన్ల మరియు  ఇంటర్ నెట్ వ్యక్తిగత మెయిల్స్ వచ్చే లింక్లపై క్లిక్ చేయవద్ద. ఈ విధంగా చేయడం ద్వారా తమ వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నిందితులు హ్యాక్ చేసారు.
👉 అన్లైన్ ద్వారా ఉద్యోగాలను ఇస్తామంటూ వచ్చే ప్రకటనపై యువత స్పందించకుండా జాగ్రత్త పడాలి. అధే విధంగా ఫోన్ మరియు మెయిల్స్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిసామని చేప్పి డబ్బులను డిమాండ్ చేసే వ్యక్తుపట్ల అప్రమత్తంగా వుండాలి.
👉 పలానా సంస్థలో నిర్వహించిన లాటరీని గెలిచినారని. లాటరీకి సంబంధించి డబ్బు పోందేందుకుగాను తమ వ్యక్తిగత సమాచారం అందజేయాల్సింది అంటూ సెల్ఫోన్ల వచ్చే సంక్షిప్త సమాచారంఫై  సెల్ఫోన్ వినియోగదారులు  స్పందించవద్దు.
👉 థ్టర్డ్ పార్టీ వెబ్సైట్ ద్వారా జరిపే రైలు మరియు విమాన టికెట్లు కోనుగోళ్ళ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి వుంటుంది.
👉 ఫోన్లు మరియు కంప్యూటర్లను అనుసంధానం చేసి ఒకే సమయంలో వినియోగించే యాప్ల పట్ల యువత జాగ్రత్తగా వుండాలి, ముఖ్యంగా ఎనీ డెస్క్ లాంటి యాప్ వినియోగంపై జర భద్రం.  సైబర్ నేరగాళ్ళుఈ యాప్ వినియోగం ద్వారా మీ కంప్యూటర్లు, ఫోన్లును వినియోగించి మీతరుపున మీ ఆర్థిక లావాదేవిలను నిర్వహిస్తారు.
👉 చిప్తో కూడిన కార్డు డెబిట్ మరియు క్రెడిట్ కార్డు మార్చుకోవాలంటూ  బ్యాంక్ ప్రతినిధులమంటూ వచ్చే ఫోన్ కాల్స్కు ప్రజలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.
👉 ఏటీఎం ల వద్ద అపరిచిత వ్యక్తులను నమ్మకండి. మీ రహస్య పిన్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకండి. ఒకవేళ మీ కార్డు సమాచారం ఎవరైనా తస్కరించినట్లు అనుమానం కలిగినచో మీ కార్డును వెంటనే బ్లాక్ చేయించండి.
👉సోషల్ మీడియా వేదికల్లో #Facebook లో కానీ, #Instagram లో కానీ  అమ్మాయి ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకొని మిమ్మల్ని కవ్విస్తూ చాటింగ్ చేస్తారు. మీతో చనువుగా ఉంటారు. మిమ్మల్ని వలలో వేసి మీ నుండి డబ్బులు వసూలు చేసి మోసగిస్తారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండి వివేకంతో ఆలోచించండి.
👉PAN CARD LINK చేయండి లేదా Aadar CARD LINK చేయండి అంటూ ఎవరైనా మెసేజ్ లు పంపితే అందులో ఉండే లింకులను క్లిక్ చేయండి. బ్యాంకు వారు మీకు ఎటువంటి లింక్ లను పంపరు. అంటూ ఎస్పీ పత్రికా ప్రకటన లో వివరంగా వివరించారు.


పెద్దపల్లి జిల్లా లో ఏసీబీ దాడి!


ఏసీబీ వలలో చిక్కిన అంతర్గం మం. తహసిల్దార్., ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు, భూ సర్వే విషయంలో ప్రైవేటు వ్యక్తి ద్వారా లక్ష రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని ఏసీబీ అధికారులు వివరించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చదరంగం పోటీలు పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీస్తాయి! ఎస్పీ శ్రీమతి సింధు శర్మ

పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి చదరంగం పోటీలు ఉపయోగపడతాయని జగిత్యాల జిల్లా ఎస్పి శ్రీమతి సింధు శర్మ  అన్నారు. సోమవారం రోజు తన కార్యాలయంలో జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా) ఆధ్వర్యంలో నిర్వహించబోయే జిల్లాస్థాయి చదరంగం పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో  పట్టణ ఆవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్, కోశాధికారి  వూటూరి నవీన్, .ఉపాధ్యక్షులు జిల్లా ఉమాకాంత్,  పెద్ది శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొండూరి రజనీకాంత్, మేడిశెట్టి నవీన్ మరియు జగిత్యాల జిల్లా ఆవోపా అధ్యక్షులు రాజేశుని శ్రీనివాస్ తదితరులు  పాల్గొన్నారు.

న్యాక్ కేంద్ర పరిశీలన !
జగిత్యాల జిల్లా కేంద్రం లోని నుకపల్లి వద్దగల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ న్యాక్ కేంద్రాన్ని సందర్శించి న్యాక్ కేంద్రం లోని పలు కోర్సు లు ఎలక్ట్రికల్,హౌజ్ వైరింగ్,పంబ్లింగ్,శానిటేషన్,పెయింటింగ్,మేషనరి,వెల్డింగ్,సర్వే, తదితర ల్యాబ్ కేంద్రాలను పరిశీలించి,విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలను,శిక్షణ పద్ధతుల ను అడిగి తెలుసుకున్న  జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్, సర్పంచ్ లు నారాయణ, దుమాల తిరుపతి,నాయకులు గంగారాం, సుంకే మహేష్, పవన్, అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్, న్యాక్  సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.