పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల వేలం!


 
జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ,ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉన్నఅన్నోన్ ప్రాపర్టీ కింద  గల మొత్తం 175 వాహనాలు [(158) మోటార్ సైకిళ్ళు, (12) మూడు చక్రాల వాహనాలు , (05) నాలుగు చక్రాల వాహనాలు, వాహనాలపై చట్టపరమైన విధానాలను అనుసరించి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత ఆరు నెలల నుండి పై వాహనాల గురించి ఎవరు రానందున అన్నోన్ స్క్రాప్ ప్రాపర్టీగా పరిగణించి  శనివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో  వేలం నిర్వహించినట్లు అదనపు ఎస్పి రూపేష్ తెలిపారు .

ఈ వేలం పాటకి సంబంధించి మొత్తం 175వాహనాల ను ,5 లాట్స్ గా విభజించి  వేలం నిర్వహించగా _₹ 1605600/-. (పదహారు లక్షల ఐదు వేల ఆరువందల)  రూపాయలు రావడం జరిగింది. ఈ వేలం పాట ద్వారా వచ్చిన మొత్తం  రూపాయలును  ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని జిల్లా అదనపు ఎస్పీ గారు తెలిపారు.
116 మoది కొనుగోలుదారులు ఈ వేలం లో పాల్గొన్నారు.
ఈ వేలం  డిఎస్పీ ప్రకాష్, కోరుట్ల సి.ఐ, రాజశేఖర్ రాజు, ఆర్.ఐ నవీన్, ఎస్.ఐ లు సుదీర్ రావు, రాము, RSI వినోద్,మరియు సిబ్బంది పాల్గొన్నారు…


బాసర  గోదావరి నదిలో ఇద్దరు విద్యార్థులు మృతి


పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చదువుల తల్లి దర్శనం కోసం విహార యాత్రకు వచ్చిన ఇద్దరు మహారాష్ట్ర విద్యార్థులు  శనివారం గోదావరి నది లో మునిగి మృతి చెందారు., మహారాష్ట్రలోని అకోలా, పట్టణానికి చెందిన 17 మంది విద్యార్థుల బృందంగా,అమ్మవారి దర్శనం కోసంగా శుక్రవారం సాయంత్రం బాసర కు వచ్చారు. శనివారం ఉదయం సంబంధిత విద్యార్థుల బృందం పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి, అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకున్నారు.,  ఇందులో భాగంగానే 17 మంది విద్యార్థులు గోదావరి నదికి చేరుకోని స్నానాల కోసం నీటిలోకి దిగారు.  అయితే ఇందులో కిరణ్  ( 22 )  అనే విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా,  గమనించి మరో విద్యార్థి ప్రతీక్  ( 22 )  నీట మునుగుతున్న ఆయనను రక్షించేందుకు ప్రయత్నం చేశాడు, ఇద్దరికీ ఈత రాకపోవడంతో అందరూ చూస్తుండగానే మునిగి మృతి చెందారు.,  నీట మునుగుతున్న ఇద్దరు విద్యార్థులను రక్షించేందుకు పలువురు విద్యార్థులతో పాటు అక్కడే ఉన్న భక్తులు, ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం కానరాలేదు..
బాసర పోలీసులు నీట మునిగిన విద్యార్థుల మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.


ఘనంగా డోలోత్సవం..


జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీ రాధ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి వారి పంచాహ్నక ధ్వజరారోహణ తిరుకళ్యాణ  బ్రహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 3వ రోజున బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని,శ్రీ రాధ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి డోలోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ డోలోత్సవం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయంలో వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక, ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 7 గం, నుండి నిత్యహోమం, నవగ్రహ హోమం ,సాయంత్రం 5 గం”ల నుండి 8 గం వరకు డోలోత్సవం , హావనం, బలిహారణ, ప్రతి రోజు అన్నదాన కార్యక్రమంతోపాటు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలలో భక్తులు, మహిళలు పాల్గొని స్వామి వారి ఉత్సవాలను తిలకించారు.

రాజస్థాన్ !


రాజస్థాన్ లో కాంగ్రెస్ చింతన్ శివిరిలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టి పి సి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఉదయ్ పూర్ లో 2వ రోజు కొనసాగిన ఏఐసిసి శిబిరం