ప్రధాని అంబానికి కెసిఆర్ మెగా కు దోచి పెడుతున్నారు – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి


దేశంలో ప్రధాని మోదీ, ఆదాని… అంబానికి లకు దోచిపెడుతుంటే… రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మేఘ కృష్ణారెడ్డికి, దోచిపెడుతున్నారని, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సోమవారం జగిత్యాలలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, దేశాన్ని ప్రధాని మోదీ, రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అమ్మకానికి పెడుతున్నారన్నారని , పెట్రో ధరలతో పాటు, వంటగ్యాసు, పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.. ధరలను తగ్గించాలని జీవన్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండు చేశారు
సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి నాగభూషణం. బండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు ప్రారంబించిన ఎమ్మేల్యే,సంజయ్ కుమార్

సారంగాపూర్ మండల రేచపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం,
వైకుంఠ దామం,.DCMS అధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, మరియు గ్రామంలో సిడిపి, డీఎంఎఫ్ట్ నిధులు ₹ 7.18 లక్షలతో నిర్మించిన పద్మ శాలి సంఘ భవనాన్ని , సోమవారంఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్. ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయ లక్ష్మారెడ్డి, ఎంపీపీ కొల జమున శ్రీనివాస్, జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, పాక్స్ ఛైర్మెన్ నరసింహ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, ఎంపీటీసీ లావణ్య గంగాధర్, ఉప సర్పంచ్ రాజేశం, డా. శైలేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగన్, గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్, మండల సోషల్ మీడియా అధ్యక్షులు వంశీ, సర్పంచులు ఢిల్లీ రామారావు, బుచ్చి మల్లయ్య, శ్రీలత శ్రీనివాస్,. జమున శ్రీనివాస్, పల్లపు వెంకటేష్, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు సుధాకర్ రావు, ఎంపిడిఓ వెంకటేష్, ఎంపివో శశి కుమార్, ఏవో తిరుపతి నాయక్, ,AEO వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు

ధాన్యం కొనుగోలు కేంద్రం!

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్, రూరల్ పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, రైతు బంధు నాయకులు నక్క రవీందర్ రెడ్డి, సర్పంచ్ రమ్య, ఎంపీటీసీ గిద్దే లక్ష్మి శంకర్, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, ఐకెపి apm గంగాధర్, నాయకులు హరీష్, అది రెడ్డి, సురేష్, సాగర్, రాజన్న మల్లేశం , రైతులు ఐకేపీ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.


₹ 60 లక్షలు నిధులు గల్లంతు.!
ప్రజావాణిలో 16 దరఖాస్తులతో పిర్యాదు!

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో సుమారు రూ.60 లక్షల నిధులు గల్లంతయ్యాయని అనుమానాలను వ్యక్తం చేస్తూ సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో పలు ఆధారాలతో సహా 16 దరఖాస్తులతో బుగ్గారం గ్రామస్తులు పిర్యాదు చేశారు.
నిధుల దుర్వినియోగం పై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతున్నారని,
ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మరిన్నీ తప్పుడు కేసులు పెడుతామని బెదిరింపులు చేస్తూ, తప్పుడు కేసులు పెట్టే యోచనలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
సుపారి హత్యకు – కుట్రపూరిత చర్యలకు కూడా పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
నిరాధారమైన అసత్యపు ఆరోపణలతో బెదిరింపులకు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ, సోషల్ మీడియాలలో అసత్యపు పోస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు.


ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బుగ్గారం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెళ్లి సత్యం, విడిసి సీనియర్ సభ్యులు పెద్దనవేని రాగన్న, కళ్లెం నగేష్, సుంకం ప్రశాంత్, సుంకం గంగారెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు పెద్దనవేని ఓదెలు, పరుమాల కొమురయ్య, మేసు వెంకట్రాజం, గణవేని రవి, పెద్దనవేని కొమురయ్య, అందుగుల రాజు, పరుమాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.