ప్రజా సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్ రవి


జగిత్యాల జిల్లాలో ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలను అధిక ప్రాధాన్యత ఇస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసులు , ఇతర అంశాలపై అధికారులతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు !
ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండలాల వారీగా లోడింగ్, ఆన్ లోడింగ్ తహసీల్దార్లు పర్యవేక్షించాలని, కలెక్టర్ ఆదేశించారు.

బియ్యం డెలివరీ
మండలాలలో రైస్ మిల్లర్ల వారీగా పెండింగ్ ఉన్న సీఎంఆర్ రైస్ డెలివరీ వివరాలు తహసీల్దార్లు రైస్ మిల్లర్ల నుండి పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
ఇసుక అక్రమ రవాణాపై!
జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జరుగకుండా తగు చర్యలు
తీసుకోని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, వాహనాలు సీజ్ చేసి పెనాల్టీలు విధించాలని, ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు

ఇంటర్మీడియట్ పరీక్షల పై
ఇంటర్ పరీక్షల సమయాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని, పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసి మాస్ కాపీ జరుగకుండా చూడాలని, వసతులు కల్పనకు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు
కళ్యాణ లక్ష్మీ,
షాదిముబారక్ మరియు మీసేవా పెండింగ్
దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూఅధికారులు మాత్రమే పంపిణీ చేయాలని , వేరే ఇతరులతో పంపిణీ చేయరాదని తెలిపారు.
ప్రజావాణి
కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి పిటీషన్ల పై సత్వరమే చర్యలు తీసుకొవాలని సూచించారు.ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయం నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
ఈ ఆఫీస్
ద్వారా ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని పేర్కోన్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, చెక్ మెమోలపై మీ సేవా సెంటర్ల ద్వారా మాత్రమే ధరఖాస్తులు చేసుకోవాలని, సిబ్బందికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనంలు , సర్వీసు మ్యాటర్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అన్నారు. చౌకధరణ దుకాణాల పై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక శ్రద్ధ వహించి రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మండలాల్లో ఈ ఆఫీస్ వినియోగంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నూతన భవన నిర్మాణ అనుమతుల జారీ సైతం కలెక్టర్ చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.చౌకధరణ దుకాణాల పై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని, ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఇంచార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి మాదురి, 18మండలాల తహసీల్దార్లు , ఏ ఓ , కలెక్టరేట్, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.

ఆదుకుని అండగా నిలిచే ప్రభుత్వం మాది !


ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్


రైతులను రెచ్చ గొట్టడం కాదని, ఆపదలో ఉన్న రైతులకు అండగా నిలవడం మా ప్రభుత్వ బాధ్యత అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం చలిగల్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మేల్యే పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసిపోవడం చాలాబాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి దైర్యంగా, సాహసోపేత, నిర్ణయం తీసుకునీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, అన్నారు
రైతులు అదైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యం అరబెట్టెందుకు చర్యలు చేపట్టాలని, అధికారులతో తాను మాట్లాడతానని హామీ ఇచ్చారు. .రైతులు అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ వర్షానికి టార్పాలిన్ కవర్లు కప్పుకొవాలని, ఎండకి ధాన్యాన్ని ఆరబెట్టాలనీ సూచించారు. రైతుల పక్షాన నిలిచి వారికి అండగా ఉంటామని రైతులు దైర్యంగా ఉండాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం. రైతు బందు పథకం కింద పెట్టుబడి సాయం అందించడంతో పాటుగా ,24 గంటల నిరంతర కరెంటు,.రైతు భీమా వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్నీ రైతులు, ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎం చేశారో చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కపట ప్రేమలతో రైతులను రెచ్చ గొట్టడం మానుకొవాలని, హితావు పలికారు.ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు అతీతులు కారని అన్నారు. ఎమ్మేల్యే వెంట జగిత్యాల పాక్స్ ఛైర్మెన్, మహిపాల్ రెడ్డి, హస్నాభాద్. సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ మల్లారెడ్డి,.చల్గల్ ఉప సర్పంచ్ పద్మ తిరుపతి, నాయకులు రాజ రెడ్డి, తిరుపతి, రైతులు తదితరులు ఉన్నారు


రైతును అభినందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !


అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి కొనుగోలు సెంటర్లకు వెళుతున్న జీవన్ రెడ్డికి రోడ్డుపై పెంబట్ల గ్రామానికి చెందిన, వెంకటేశ్ అనే రైతు పుచ్చకాయలు అమ్ముతూ కనపడగా ఆగి రైతు నుండి వివరాలు తెలుసుకున్నారు..ఈ సందర్భంగా రైతు వివరిస్తూ ‘ నేను స్వయంగా పండించిన పుచ్చకాయలు దళారులకు విక్రయంచకుండ ,నేరుగా వినియోగదారులకు కేవలం ₹ 20 రూపాయలకే విక్రయిస్తున్నట్లు వివరించారు. జీవన్ రెడ్డి అతడిని అభినందిస్తూ పుచ్చకాయలు కొనుగోలు చేశారు. వెంకటేష్ లాంటి రైతు తక్కువ ధరకే పుచ్చకాయలు అమ్మడం అభినందనీయమని ,రాబోయే కాలం లో ఇలాంటి రైతులు ముందుకు వచ్చి వివిధ రకాల పంటలను పండిస్తూ ఆదర్శంగా ఉండాలని కోరారు..


అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి !


అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ద్యావర సంజీవ రాజు అన్నారు. గురువారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తాలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టారు. గడువు పొడగిస్తున్న అక్రిడేషన్ కార్డుల స్థానంలో వెంటనే నూతన అక్రిడేషన్లు జారీ చేయాలని, అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో, జర్నలిస్ట్ హెల్త్ కార్డులు వర్తించేలా జీవో జారీ చేయాలని, జాప్యం చేయకుండా వెంటనే ఇళ్ల స్థలాలు/డబులు బెడ్ రూమ్ ఇల్లు, మంజూరు చేయాలనే ప్రధాన డిమాండ్ తో చేపడుతున్న ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల ఫెడరేషన్ జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, జైపాల్, వెంకట రమణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు,మదన్ మోహన్, జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ రెడ్డి, కోశాధికారి మెన్నెని శ్రీనివాస్ రావు, కట్కూరి మల్లేశం, గుర్రం చంద్రశేఖర్, గురుమంతుల నారాయణ, కాంతారావు, మాకు రాజలింగం, గాజుల శ్రీనివాస్, ఆముద లింగా రెడ్డి, పూర్ణచందర్, లక్ష్మన్, .మతిన్, లవంగా గణేష్ , కరుణాకర్ రావు, ఉప్పులేటి నరేష్ , చిరంజీవి ఇతరులు పాల్గొన్నారు వీరు దీక్షకు వేడుక జర్నలిస్టు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.


జేపీ నడ్డాకు ఘనస్వాగతం !


రాష్ట్ర పర్యటనకు గురువారం వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బిజెపి నాయకులు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు ఈటెల రాజేందర్, ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ నాయకు లు మురళీధర్ రావు,బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ డా. జి. వివేక్ జేపీ నడ్డా పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.