హైదరాబాద్ సరూర్ నగర్ లో నాగరాజు హత్య పరువు ఎంత పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి బిజెపి పార్టీ ఎస్సీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం రాజ్ భావన్ లో గవర్నర్ తమిళసై ని కలిసివినతి పత్రం ఇచ్చారు. పరువు హత్య తీరుతెన్నులు , హత్య కావింపబడింది నాగరాజు కుటుంబ సభ్యుల వివరించిన హత్య తీరుతెన్నులను ,అందుకు పాల్పడిన వారు, అనుమానితులు, పథకం రచించిన వారి ఇ పేర్లు తదితర అంశాలను, మాజీ ఎంపీ బిజెపి, జాతీయ నేత డాక్టర్ వివేక్ వెంకటస్వామి, గవర్నర్ కు వివరించారు.

. మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు, బిజెపి ఎస్సి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, అప్సర్ భాష,. జాతీయ నేత ఎస్ కుమార్, ఎస్సీ మోర్చ రాష్ట్ర నాయకులు తదితరులు గవర్నర్ ని కలిసిన వారిలో ఉన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.!
బీర్పుర్ మండల కేంద్రం లో, నర్సింహుల పల్లి, తుంగురు, కొల్వాయి, తాళ్ళ ధర్మారం .మంగేళ , కండ్లపెల్లి రంగా సాగర్ , చేర్లపెల్లి ,గ్రామాల్లో ఐకేపీ, పాక్స్ .ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని,
రైతుల పక్షాన నిలబడి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గ పరిధిలో 80 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని త్వరిత గతిన తుకానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు
గతంలో రాష్ట్రంలో రెండు పంటలు కలిపి 99 లక్షల ఎకరాలు సాగు అయ్యేవని
నేడు 2 కోట్ల ఎకరాలకు పెరిగిందని, యాసంగి లో
50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి రాబోతుందని, ఇతర రాష్ట్రాల్లో 10 లక్షల వరకే దిగుబడి ఉందని దీనిని బట్టి రాష్ట్రం లో సాగు విస్తీర్ణం అర్థం అవుతుందని రైతులు ప్రజలు గమనించాలని అన్నారు.
40 వేల ఎకరాలలో వరి సాగు అయిందని, బీర్పుర్ లో 7 వేల ఎకరాలలో వరి సాగు అయిందని,
జిల్లా లో 4 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి కి అవకాశం ఉందని ఈ సందర్భంగా అన్నారు
అకాల వర్షాలు సహజమేనని…
రైతులు అప్రమత్తం గా ఉండాలని,ముందస్తు జాగ్రత్త లు తీసుకొని నష్టాన్ని నివారించాలని కొందరు నాయకులు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.
రైతు భీమా, రైతు బందు, చెక్ డ్యాం ల నిర్మాణం ,రోళ్ల వాగు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇలా ప్రతి నీటి బొట్టును వొడిసిపెట్టే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్, kdcc జిల్లా మెంబర్ రాంచందర్ రావు, జిల్లా రైతు బందు మెంబర్ కొలుముల రమణ, మండల పార్టీ అధ్యక్షులు నారపాక రమేష్, Pacs ఛైర్మెన్ నవీన్ రావు, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు .మహిపాల్ రెడ్డి, మండల రైతు బందు కన్వీనర్ రాజేశం, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రావు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు, రమకిస్తు గంగాధర్,.ఐకేపీ ఏపిఏం రజిత, సర్పంచులు, ఎంపీటీసీలు,ఉప సర్పంచ్ లు ,PACS డైరెక్టర్లు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిదులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సమాజాన్ని తట్టి లేపేదే కవిత్వం – ఎమ్మెల్యే
కవులు,రచయితలు సమాజం కోసం రచనలు చేయాలని, సమాజాన్ని తట్టి లేపాలని అప్పుడే ఆ రచయితలకు మంచి గౌరవం దక్కుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
స్థానిక వర్తక సంఘం లో జరిగిన వోదెల.గంగాధర్ రాసిన * దాగి ఉన్న నిజం* పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై పుస్తకాన్ని అవిష్కరించారు,

ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత, టీ ఆర్ ఎస్ నాయకులు బోగ ప్రవీణ్, కౌన్సిలర్ అల్లే గంగాసాగర్, రచయిత వోదెల గంగాధర్ డా.బుర్ల.చంద్రశేఖర్,కళాశ్రీ గుండెటి. రాజు, మార విజయలక్ష్మి, కొత్తకొండ. కరుణాకర్, మాడిశెట్టి.శ్రీనివాస్, జయ్ పాల్ రెడ్డి, రాపర్తి వినోద్, రామగిరి రమేష్, మాడిశెట్టి.రమేష్..పలువురు కవులు, రచయితలు, సాహితి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సై నిజాయితీ !

.సిద్దిపేట పట్టణానికి చెందిన హనుమాన్ భక్తుడు సాగాయిపేట ప్రమోద్ , ఆదివారం ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మనీ పర్స్ ను పోగొట్టుకున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏ ఎస్ ఐ రాజేశం కు మనీ పర్స్ దొరికింది. అందులో ₹ 2,839/- నగదు, ఏటిఎం , ఆధార్ కార్డ్, చెక్కు, ఇతర విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయి. నిర్ధారించుకుని భక్తుడికి అట్టి పర్సును ఆలయ ఉద్యోగి సమక్షంలో ఎస్సై అందజేశారు.
పిచ్చి కుక్కల దాడి

బీర్పూర్ మండలం తుంగూరులో శనివారం రాత్రి పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి., ఇంటి బయట నిద్రిస్తున్న ఐదుగురి పై దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాయి.
108 లొ చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.