నిందితుడిని చట్టప్రకారం శిక్షిస్తాం – కలెక్టర్ రవి!

జగిత్యాల మే 10:- జిల్లాలో ప్రభుత్వ అధికారుల పై పెట్రోల్ దాడికి పాల్పడిన నిందితులను చట్టప్రకారం కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జీ రవి తెలిపారు. మంగళవారం పెట్రోల్ దాడి  నేపథ్యంలో గాయపడిన బీర్పూర్ మండల పంచాయతీ అధికారి నీ కలెక్టర్ ఆస్పత్రిలో పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ  బీర్పూర్ మండలం లోని తూంగూర్ గ్రామంలో ఇంటికి వెళ్ళే రోడ్డు మార్గాన్ని కొంతమంది కర్రలతో ఆక్రమించి మూసివేశారని ప్రజావాణిలో తమకు ఫిర్యాదు అందిందని,   సబ్ ఇన్స్పెక్టర్, మండల పంచాయతీ అధికారి,  తాసిల్దార్ బృందంగా ఏర్పడి సమస్య పరిష్కరించేందుకు గ్రామానికి వెళ్లారని, ఆ సమయంలో  గంగాధర్ అధికారులపై పెట్రోల్ జల్లి  నిప్పంటించిడానికి  ప్రయత్నించారని తెలిపారు.
మండల పంచాయతీ అధికారి రామకృష్ణుకు   నిప్పు అంటుందని, వెంటనే స్థానిక  ప్రజలు అప్రమత్తమై మంటలను ఆర్పి  ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారని కలెక్టర్ తెలిపారు.


మండల పంచాయతీ అధికారి ఆరోగ్యం స్థిరంగా ఉందని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని, 7 రోజులలో పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ అధికారులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన వ్యక్తులపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, చట్ట ప్రకారం వారికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు.


దాడిని ఖండించిన ఎమ్మెల్యే సంజయ్


బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామంలో ఓ దారి విషయంలో విచారణకు వెళ్లిన పోలీస్, మండల పరిషత్ అధికారుల పై  చుక్క గంగాధర్ అనే వ్యక్తి పవర్ స్ప్రేయర్ తో పెట్రోల్ స్ప్రే చేసి నిప్పంటించాడు., ఈ ఘటన దురదృష్టకరమని, ఈ దుచ్చర్యను ఖండిస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.,

  పరామర్శ ,!

పెట్రోల్ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న
బీర్పూర్ మండల పంచాయతీ అధికారి రామకృష్ణ
రాజును బుగ్గారం జడ్పిటిసి సభ్యులు బాదినేని
రాజేందర్ ,.మండల కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రెహమాన్ , ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు సంఘ శేఖర్ తదితరులు పరామర్శించారు.

సమస్య  పెండింగ్ ప్రాణాంతకమైనదా?


గత నాలుగు సంవత్సరాలుగా తుం గూరు. గ్రామంలో 12 ఫీట్లు  రహదారి సమస్య పై వివాదాలు కొనసాగుతున్నాయి. రహదారి విషయంలో బాధితులు అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. పలుమార్లు రెవెన్యూ, పోలీస్ ,పంచాయతీ యంత్రాంగం, సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు సమాచారం.  ప్రత్యర్థులపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, కొందరు పారిశుద్ధ్య కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు గ్రామస్తుల కథనం. ప్రభుత్వ యంత్రాంగం నాడే ఈ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడితే,  మంగళవారం విచారణకు వెళ్లిన అధికారుల పై ఈ దాడి జరిగేది కాదని గ్రామంలో చర్చ నడుస్తుంది.

ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు పరిశీలిస్తే ఈ దారి సమస్య  2017 -18 నుండి  కొనసాగుతున్నట్టు. స్పష్టం అవుతుంది. అధికారులకు ఎలాంటి  గాయాలు గాని, ప్రాణ హాని జరగకపోవడం సంతోషకరమైన, ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా, వివాదాస్పద సమస్యలను పెండింగ్లో పెట్టకుండా   అధికార యంత్రాంగం  పరిష్కారానికి కృషి చేయాలని  ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు