క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి- ఎస్. పి సింధు శర్మ!

నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని. జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో డీఎస్పీ లు, సి.ఐలు ,ఎస్ .ఐ ల తో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి డీఎస్పీ లను, సి.ఐ లను, ఎస్.ఐలను అడిగి తెలుసుకునారు .

దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులలో త్వరగా పరిశోధన పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేయాలి అని, పెండింగ్ కేసులలో, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు. డిజిపి ఆన్లైన్ క్రైమ్ రివ్యూ ప్రకారం UI కేసుల టార్గెట్స్ రిచ్ కావాలని సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మరియు టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, ఉండేటట్లు చేయాలని అప్పుడే నిందితులకు శిక్షలు పడతాయన్నారు..పెండింగ్లో ఉన్న సీసీ నెంబర్ల గురించి తరచుగా మెజిస్ట్రేట్ లను మరియు కోర్టు అధికారులను కలిసి, ప్రతిరోజూ మానిటర్ చేసి, సీసీ నెంబరులు తీసుకోవాలని సూచించారు.

.రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, తదితర వర్టికల్, విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తరచుగా శిక్షణ తరగతులు నిర్వహించి వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.


సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలి:


సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగిపోయిందని ఎస్పీ వివరించారు. సైబర్ నేరాలకు చెక్ పెట్టడం, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం, లక్ష్యంగా పని చేయాలన్నారు. సైబర్ నేరాల కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి, నేరస్ధులను గుర్తించటం, వారికి శిక్ష పడేలా చేయడం తద్వారా, బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.


నేర స్వభావం వ్యక్తులు, రౌడీషీటర్ల పై నిఘా ఉంచాలి


భూతగాదాల విషయం లో, పాత కక్షలు మనసులో పెట్టుకుని నేరాలు చేసేవారిని మరియు, నేర స్వభావం కలిగిన వ్యక్తులను, పోలీస్ స్టేషన్ ల వారిగా గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై , ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ తెరవాలని ఆదేశించారు.
బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుంగుర్ గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించి తక్షణమే స్పందించిన బీర్పూర్ ఎస్.ఐ గౌతమ్ ను ఎస్పీ ప్రత్యకంగా అభినందించారు.
ఈ యొక్క సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీ రూపేష్, డీఎస్పీ లు ప్రకాష్, రవీందర్ రెడ్డి, SB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, DCRB ఇన్స్పెక్టర్ దుర్గ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, .సి.ఐ లు రాజశేఖర్ రాజు, కిషోర్, కృష్ణకుమార్ మరియు ఎస్. ఐ లు, ఐటీ కోర్, DCRB సిబ్బంది పాల్గోన్నారు.