రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయండి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.


వరంగల్ లో ఈ నెల 6న జరగనున్న రాహుల్ గాంధీ సభ ను రైతులు ,రైతు కూలీ సంఘాలు ,ప్రజలు ,విజయవంతం చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆదివారం జగిత్యాలలో తన గృహంలో పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు.
ఉపాది హామీ కూలీలకు,.సమ్మర్ అలవెన్స్, అమలు చేయాలని , జాబ్ కార్డ్ కల్గిన ప్రతి కూలీకి, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర రైతాంగంతో పాటు, రైతు కూలీలకు అండగా నిలిచేందుకే ,రాహుల్ గాంధీ తెలంగాణ జీవన్ రెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా రైతులు , రైతు కూలీలు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరినాగభూషణం, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, కొత్త మోహన్ తదితరులు పాల్గొన్నారు

కార్మిక బందు కెసిఆర్..


..ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్.
ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా జగిత్యాల పాత బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం వద్ద, కార్మికుల అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి,ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,మున్సిపల్ ఛైర్మెన్ భోగ శ్రావణి పాల్గొని ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంబాలా రామ్ కుమార్, మున్సిపల్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

నివాళులు !

బీర్పూర్ మండలం తుంగుర్ గ్రామానికి చెందిన దన్నపునేని ప్రతాప్ రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీర్పూర్ ఎంపీపీ రమేష్, జెడ్పిటిసి సభ్యురాలు పాత పద్మ, కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు జితేందర్ యాదవ్, ఎంపీటీసీలు , సర్పంచులు అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

తెలుగుదేశం పార్టీలో చేరిక


జగిత్యాల కి చెందిన , డాక్టర్. తోడేటి శ్రీకాంత్ గౌడ్ ( ప్రొఫెసర్ ) , టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బక్కని నర్సింహులు
నిజామాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు, శ్రీ యాద గౌడ్ లు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పదవికి రాజీనామా చేసినట్లు శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. జిల్లా టిడిపి నాయకులు మహంకాళి రాజన్న , కాశినాదం , కొండయ్య యాదవ్, కొండ శ్రీధర్, భార్గవ్ రామ్, నారాయణ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు శ్రీకాంత్ గౌడ్ చేరికను స్వాగతించారు.


మంగలి గడ్డ పరిశీలన !


జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరి నది తీరాన గల మంగళి గడ్డ ఆధునీకరణ పనులపై, మరియు, నిర్మాణంలో ఉన్న మార్కెట్ షెడ్ లను, సంబంధిత అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.


పరామర్శలు !


పెద్దపెల్లి జిల్లా ధర్మారం మాజీ ఉప సర్పంచ్ మెడ వేణి పెద్దన్న ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ఆదివారం పరామర్శించారు. వారితోపాటు మండలం కమ్మర్ కానీ పేట, ధర్మవరం పట్టణంలో తోడేటి మురళి గౌడ్, చందు గౌడ్ తల్లి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను. కూడా లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్ ,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశం గౌడ్, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, గడ్డం మైపాల్ ,కాం పెళ్లి రాజేశం, తదితర నాయకులు, ఆయన వెంట ఉన్నారు.